శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

స్త్రీ మూర్తులకు ఇవి అవసరం

>> Sunday, November 22, 2020

స్త్రీ మూర్తులకి ఇవి అవసరం🙏

1.స్నానం చేసే నీటిలో అప్పుడప్పుడు కాస్త రాళ్ళ ఉప్పు హాఫ్ స్పూన్ వేసుకుని స్నానం చేస్తే దిష్టి పోతుంది.

2. బయటకు వెళ్లే ముందు ఛాతీ పైన చిన్న కాటుక కనపడకుండా పెట్టుకుంటే ఎదురు దిష్టి తగలదు..

3.అరికాలు లో కాటుక కానీ కాస్త ఒక డ్రాప్ కొబ్బరి నూనె కానీ రాసుకుంటే మీ వెంట వెళ్లిన చోట నెగటివ్ పవర్ వెంట రాదు..

4.తల స్నానం చేశాక వారానికి ఒక సారి అయినా తల వెంట్రుకలుకు సాంబ్రాణి వేసుకోవాలి ఆడవాళ్లపైన పడే చెడు దృష్టి అంతా వెంట్రుకలను అంటి ఉంటుంది అది పోతుంది..

5.అష్టమి, అమావాస్య, ఆదివారం ఇలాంటి రోజుల్లో కచ్చితంగా దుర్గా స్త్రోత్రం చదవడం దుర్గమ్మ గుడికి వెళ్లడం , బైరావుడిని తలుచుకుని నమస్కారం చేయడం మంచిది..

6. ఉదయం లేవగానే 21 సార్లు గం గణపతయే నమః అని తలుచుకుని పడక దిగాలి , నిత్యం రాత్రి వేళ హనుమాన్ చాలీసా కానీ లేదా 11 సార్లు ఓం నమఃశివాయ అని కానీ తలుచుకుని నిద్రపోతే మంచిది.

7.మీ జన్మ నక్షత్రం రోజు మీ ఇంటి దేవుడు ఎవరో ఆ గుడికి వెళ్లి అర్చన చేసుకోవాలి ఉదా: వెంకటేశ్వర స్వామి అయితే మీ జన్మ నక్షత్రం రోజు కచ్చితంగా దగ్గరలో ఉన్న గుడికి వెళ్లి అర్చన చేసి రావాలి.

8.తలకు నూనె పెట్టుకోవడం లేదు చాలా మంది అలా డ్రై గా ఉంచకుండా తల లో ఎదో ఒక చోట చుక్క నూనె అయినా రాసుకోవాలి. 

9.ఇంటి విషయాలు గట్టిగా మాట్లాడ కూడదు కొత్తవారికి కష్టాలు చెప్పుకో కూడదు పరిచయం లేని వారిని సహాయం కొరకూడదు..

10. పండగ రోజుల్లో సెలవు దినాల్లో, కనీసం శుక్రవారం రోజు అయినా పాదాలకు పసుపు పూసుకోవాలి..మంగళవారం రోజుమోహనికి పసుపు రాసుకుంటే చెడు దృష్టి పడదు..

11.కుటుంబ సభ్యులు దగ్గర  ఏది దాపరికం ఉండకూడదు..

12. అతి చనువు ఎప్పటికీ ప్రమాదమే, మొండి ధైర్యం మొదటికే మోసం. ఇవన్నీ పెద్దవాళ్ళు కాలం నుండి వస్తున్న పద్దతులు .

13. నిత్య దీపారాధన అలవాటు చేసుకోవాలి , అమంగళం పలక కూడదు..పొలాలు బీడు ప్రాంతంలో ఏదైనా దొరికి న వస్తువులు తెచ్చి దాచ కూడదు కొన్ని మంత్రించి దాచినవి ఉంటుంది..

14. గొరోజనం వశీకరణకువాడుతారు మీకు తెలియని  కొత్త వారి నుండి  మాంత్రికులు తాంత్రికులు నుండి చేతికి ఏది నేరుగా తీసుకోకూడదు. 

15 చీకటి పడ్డాక ఒంటరిగా బయటకు వెళ్ళాలి అంటే తోడు లేకుండా వెళ్ల కూడదు నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో  ఒంటరిగా పగలు కూడా తిరగకూడదు ముఖ్యంగా వెంట్రుకలు విరబోసుకుని తిరగకూడదు...🙏

అమ్మ అందరిని చల్లగా చూడమ్మా 🙏from whatsapp

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP