శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

లోక సంరక్షణార్ధమై జగన్మాత అనుగ్రహం కోసం వసంత నవరాత్రులు ప్రారంభం ....మీ గోత్రనామాలు పంపండి

>> Monday, March 23, 2020



బిడ్డలు అమ్మా అని పిలిస్తే చాలు కరిగిపోయి కదలివఛ్చి  ఆర్తినిబాపే అమ్మలగన్నయమ్మ దుర్గమ్మ కరుణకోరుతూ  జరిపేవే నవరాత్రి పూజలు. ఒకటి శరన్నవరాత్రులు రెండవది  వసంత నవరాత్రులు . శరత్కాలం వసంతకాలం ప్రారంభ సమయాలు యమదంష్ట్రలు  గా పిలవబడతాయి . ఈసమయంలో విజృంభించే  రోగకారకములను  నశింపజేసి  లోకాలను రక్షించే అమ్మను ఉపాసించటం అనాదిగా మన సాంప్రదాయం.  ఇప్పుడేకాదు పురాణాదులు చూస్తే సృష్టి కి  ఆపదసంభవించినప్పుడు  లోకాలన్నీ ఎలుగెత్తి అమ్మను ప్రార్థించడమూ ,అమ్మ తరలివఛ్చి ఆర్తులను కాపాడటమూ మనకు తెలిసినదే .

          ఇప్పుడు మనలను చుట్టుముట్టి ఉన్న ఆపదనుండి కాపాడగల  ఆదిపరాశక్తిని   ఆరాధించే వసంత నవరాత్రి క్రతువును శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠంలో   శార్వరి  నామ సంవత్సర ఉగాది నుండి  అంటే బుధవారం నుండి శ్రీరామ నవమి  వరకు జరుపబడుతున్నాయి  [25-3-2020 to 02-04-2020]  .
నిత్యమూ అమ్మకు షోడశోపచారములు ,హోమములు  నిర్వహించబడుతున్నాయి . అలాగే రామలింగేశ్వర స్వామివారి అభిషేకములు శ్రీవేంకటేశ్వరస్వామివారి అర్చనలు     పీఠములో నెలకొని ఉన్న పరివారదేవతలకు పూజలు జరుపబడతాయి . లోకములో  భక్త జన సంరక్షణార్థమై  సంకల్పము చేసి వారి తరపున పూజలు నిర్వహించబడతాయి . మీ గోత్రనామాలు మెయిల్ ద్వారా పంపండి . ఐతే ఈ కాలములో శుచిగా నియమబద్ధంగా జీవితం గడుపుతూ మీ మీ ఇష్ట దైవముల మంత్రములు,లేదా నామము జపించవలసి ఉంటుంది .   మీరు గోత్రనామములు పంపేటప్పుడే  మీరు జపించే మంత్రము,లేదా నామము లను  జపించదలచుకున్న సంఖ్యను తెలియపరచాలి .  మీతరఫున   సంకల్పంలో చెప్పబడుతుంది .  మీరు ప్రత్యక్షంగా  రానవసరంలేదు.  ఇందుకొరకు  ఎటువంటి రుసుములు చెల్లించనవసరం లేదు.


 మీ గోత్రనామాలను durgeswara@gmail.com నకు పంపగలరు.

లోకాస్సమస్తా  సుఖినోభవంతు
జైశ్రీరాం

లోక సంరక్షణార్ధమై

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP