వైరస్ ల దాడిపై అసలు విషయం మాత్రం చెప్పని మేధావులు,రాజకీయనాయకులు,వైద్యులు .ఎదుర్కోవటం మాత్రం ఇలా..
>> Sunday, March 22, 2020
కరోనా పై ప్రపంచం కంగారెత్తిపోతోంది . అందరూ భయపడుతూ ఇంకా భయపెడుతూ వాక్సిన్ లకోసం ఎదురుచూస్తూ చావుభయంతో జీవిస్తున్నాము. అసలు కారణం తెలిసినా ఎవరూ దాన్నిగూర్చి ఒప్పుకుని చెప్పరు. ముఖ్యంగా మేధావులు. ఒకటా రెండా వరుసన దాడిచేస్తున్న వైరస్ లు .ఇది టీజర్ మాత్రమే సినిమా ఇంకా ముందుంది అనేది నిష్ఠుర సత్యం.
ముందుగా చిన్న అవలోకనం. వైరస్ లు అనేవి ఇప్పటికిప్పుడు పుట్టినవి కాదు. అన్ని జీవరాసులతో పాటు పుట్టి మార్పులుచెందుతూ వివిధరూపాలు సంతరించుకుంటూ పెరుగుతున్నాయి. కొన్నిచోట్ల మంచుపొరలలో నిక్షిప్తమై ఉన్నాయి. ఐతే మానవ శరీరమ్ ఈ వైరస్ లను ఎదుర్కునేలా సన్నధ్ధమవుతూ ఉంది ఇప్పటివరకు. ఆప్రతినిరోధక శక్తిని [ఇమ్యునిటీ] ఇప్పుడు మానవ శరీరాలు కోల్పోతున్నాయి. కారణం ఏమిటి ? గత నలభై సంవత్సరాలకు పైగా సహజసిధ్ధమైన ఆహారాన్ని కాకుండా పారశ్రామికీకరణ పద్దతిలో తయారు చేసిన ఆహారం స్వీకరించటం ఎక్కువైంది . పలు రకాల జన్యుమార్పులకు గురిచేసిన హైబ్రీడ్ రకాలస్రుష్టి వలన ఆహార ఉత్పత్తులు పెరిగాయి కాని అవితిన్నాక శరీరములో రోగనిరోధక శక్తి క్షీణించింది . ఇక ఎక్కడ వాతావరణానికి అనుకూలంగా అక్కడ పండేపంటలు శ్రేయస్కరమవుతాయి. కానీ మనం అనుకరణ లతో మనకు సరిపడని ఆహారవిహారాలను అరువుతెచ్చు కుంటున్నాము. ఇక మనదేశ సాంప్రదాయాలన్నీ మనకొక రక్షణ కవచం.చేజేతులా మనమే వాటిని చులకనచేసుకుని రక్షణ కవచాన్ని చిన్నాభిన్నం చేసుకుంటున్నాము. అయితే అద్రుష్ఠవశాత్తూ ఇంకా ఎంతో కొంత సాంప్రదాయానుసరణ కొనసాగుతుంది.
రోగనిరోధక శక్తిని పెంచుకోవటమే మనం చేపట్టవలసిన తక్షణచర్య .దానికి అవసరమైన దేశవాళీ రకాల పంటలను పండించి వాడుకోవటమే మార్గం. రసాయనాలవాడకం కాకుండా ప్రక్రుతి సేద్యం లో పండించిన పంటలు,చిరుధాన్యాలు వాడకం గూర్చి ప్రభుత్వాలు జనానికి వివరించాలి. కానీ ఎవరూ నోరు విప్పకుండా అసలు విషయాన్ని దాటవేస్తున్నారు.
ఇప్పుడు వాక్సిన్ లకోసం ఎదురుచూడటం కాకుండా మన రోగనిరోధక శక్తిని పెంచే చిన్నప్రక్రియలు పాటిద్దామ్. సదాచారంతో జీవిస్తే అదే మనకు శ్రీరామరక్ష .
శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచే సప్త కషాయాలను గూర్చి ఆచార్య ఖారద్ వలీ గారు మన సనాతన వైద్య విధానం నుండి సూచన చేస్తున్నారు. ఒక్కొక్క కషాయం రెండురోజుల చొప్పున టీ కాఫీలకు బదులుగా సేవించండి
మొదటి రెండు రోజులు గరిక కషాయం
మూడు నాలుగవరోజులు తులసి
ఐదు ఆరవరోజులు తిప్పతీగ
ఏడు ఎనిమిది మారేడు
తొమ్మిది పది కానుగ
పదకొండు పన్నెండు వేప
పదమూడు పద్నాలుగోరోజు రావి ఆకులతో కషాయం కాచుకుని ఇంటిల్లపాదీ టీలా రెండుపూటలా సేవించండి
సహజంగా మీ వంట్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
గుప్పెడు ఆకులు మూడుగ్లాసుల నీటిలో వేసి సగమయ్యేలా కాచి అరటీగ్లాసు తీసుకోండి చాలు .
భగవద్భక్తి కలిగి జీవరాసులపై కరుణతో ఉండాలి . అప్పుడు మాత్రమే మనలను ప్రక్రుతి క్షమిస్తుంది .
జైశ్రీరాం

1 వ్యాఖ్యలు:
Although your plan appears to be too simple to modern medical science , it will work.
Doctors could not believe when Dr.Khadar Vali successfully cured multiple HIV +ive patients .
Post a Comment