శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

నాయనమ్మ మాటలు*"

>> Thursday, March 19, 2020

"*నాయనమ్మ మాటలు*"

_ఒరేయ్ అలా మడి ఆచారాలు, శుచి, శుభ్రత లేకుండా ఏంటిరా ఆ అప్రాచ్యపు పనులు_

- చెప్పులు ఇంట్లోకి తీసుకు రాకురా.

- బయటి నుండి రాగానే కాళ్ళు కడుక్కొరా

- స్నానం చేసిన తరువాత మాత్రమే తిను

- బయట తిరిగి వచ్చిన తరువాత స్నానం చేసి , వేరే బట్టలు వేసుకొని ఇంట్లోకి రా

- ఉతకని బట్టలు కట్టు కోవద్దు

- ఏదైనా తినే ముందు చేతులు కడుక్కో

- ఎవర్ని బడితే వాళ్ళని తాకి , వాళ్ళు ఎంగిలి చేసినది నువ్వుతినకు

- శాఖాహారం మాత్రమే తిను

- కుక్కల్ని , పిల్లుల్ని అలా ఒళ్ళో కూర్చో బెట్టుకొని ముద్దుచేయకు

- బయట వండినవి , నిన్న వండినవి తినకు , వేడిగా ఉన్నప్పుడే తిను

- మడి కట్టుకొని వండు  , నేను వంట చేస్తు న్నప్పుడు నన్ను ముట్టుకోవద్దు

- పిల్లల్ని నేరుగా ముద్దాడద్దు

- పాత్రలు ఎండలో బోర్లా పెట్టు

- శవాన్ని ముట్టు కోవద్దు , చనిపోయిన వారి కుటుంబ సభ్యులను రెండు వారాలదాకా ముట్టుకోవద్దు,
వారితో తిరగ వద్దు

- ఒకప్పుడు మన ఇళ్ళల్లో పెద్దలు ఇలా అంటే చాదస్తం అని చిరాకు పడే వాళ్ళం.
ఇప్పుడు ప్రపంచం మొత్తానికి చాదస్తం పట్టుకుంది.
🌹👏🏾🌷

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP