శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఆపదామప హర్తారం......... హనుమత్ రక్షాయాగ ప్రభావం ఇలా.ఉంటుంది.

>> Wednesday, December 18, 2019

హనుమత్ రక్షాయాగం ద్వాదశావృతి ప్రారంభమైనది . ప్రధానంగా ఇక్కడ సేవాకార్యక్రమాలలో పాల్గొనే నాగిరెడ్ది అనే యువకునికి ఈసారి ప్రారంభకార్యక్రమంలో పాల్గొనటానికి వీలు చిక్కలేదు. మరుసటిరోజు ఫోన్ చేసి  వెంటనే పారాయణము ,రామనామ లేఖనము మొదలుపెట్టమని గట్టిగా చెప్పాను. స్వామి అనుగ్రహం ఉండటం వలన మొదలుపెట్టాడు.   పదిరోజులక్రితం సాయంత్రం వచ్చాడు .   సార్ !  ఈవేళ స్వామి అనుగ్రహంతో ప్రాణాలతో ఉన్నాను అని గాభరాగా చెప్పాడు. ఏమైంది నాగిరెడ్డీ! అనడిగాను.
ఈ రోజు పొలంవద్ద మోటర్ స్విచ్ వేయటానికి వెళ్లాను . చేయి బాక్స్ మీద వేయగనే జిల్లు మని షాక్.  అయిపోయాను అనుకుంటున్నాను.ఈడ్చి కొట్టినట్లు చేయిని ఎవరో కొట్టినట్లు దూరంగా పడ్డాను. స్వామి అనుగ్రహం లేకుంటే ... చెప్పటానికే భయమేస్తుంది. అన్నాడు .
ఆపదామప హర్తారం  ...దాతారం సర్వసంపదాం  .. అని శ్రీరామచంద్రప్రభువు  నామాన్ని లిఖిస్తున్నసమయమిది . సర్వత్రా హనుమత్ స్వామి రక్షకులై ఉంటారు. భయపడవద్దు . అనిచెప్పి పంపాను.

నిన్న మరలా ఫోన్   ... ఎక్కడున్నావు నాగిరెడ్డి..  అనడిగాను. సార్ ! మా మేనల్లునికి డెంగ్యు జ్వరం .  సీరియస్ గా ఉందని  కబురుచేస్తే   వెళ్లి గుంటూరు తీసుకొచ్చాము . ఐ సి యు లో ఉంచారు.  డాక్టర్లు రెండురోజులాగితే గాని  చెప్పలేమంటున్నారు. బ్లడ్సెల్స్ రేట్ ఏభై వేలకు పడిపోయిందట అని ఖంగారు పడుతున్నాడు. పరవాలేదులే తగ్గుతుంది  ఇప్పుడు డెంగ్యు కు బాగానే వైద్యం చేస్తున్నారు అన్నాను. అదికాదు సార్ ! నాలుగు నెలల క్రితం వీళ్ల నాన్నకు పాము కరిచి పెద్ద ప్రమాదమై  భగవంతుని దయతో బయట పడ్డాడు.  మరలా రెండు నెలల క్రితం వీళ్ల అమ్మకు అంటే మా అక్కయ్యకు చేయి విరిగింది. ఇప్పుడేమో మరలా వీనికి .. అంటూ బాధపడ్డాడు.

జన్మకర్మఫలితాలు వాటి ప్రభావం చూపుతుంటాయి. వాటిని మనం తప్పించలేము. కానీ దానినుండి రక్షణపొందటానికి భగవత్ శక్తిని ఆశ్రయించటమొకటే మార్గం .  అందుకే గదా హనుమత్ రక్షాయాగం జరుగుతున్నది.  వానిని   మనసులో స్వామిని స్మరించుకుని " నాసైరోగ హరై సబపీరా ..జపతనిరంతర హనుమత్ వీరా" అనే దోహాను మరువకుండా జపం చేస్తుండమని చెప్పు . అలాగే బొప్పాయి ఆకురసం త్రాగించు. వాల్లు లోపలకి ఎలౌ చేయకపోయినా చిన్నగా జ్యూస్ లో కలిపైనా పట్టించు . అని చెప్పాను.
నిన్న రాత్రి  ఫోన్ చెస్తే   సెల్స్  ఇరవై ఏడు వేలకు పడిపోయాయని ఖంగారు గా చెప్పాడు. అలాగే హోమియో లో అనుభవం ఉన్న మన రేణుని అడిగి  కొన్ని మెడిసిన్స్  తెచ్చి ఇవ్వమన్నాను.
ఎక్కడ సార్ ! వాల్లు లోపలకు పోనివ్వటం లేదు.  ఒక్కసారి రెండుసార్లు మాత్రమే అనుమతిస్తున్నారు. అన్నాడు.
వాళ్లంతే ! మనలను  ఎంతగా భయపెడితే వాల్ల కంత లాభం .  ఆపిల్లవాని అమ్మగారిని కూడా  వాళ్ల ఊరిలో ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణలుచేసి వేడుకొమ్మని చెప్పు అని సూచించాను.

ఇక ఈరోజు ఉదయం ఫోన్ చేసి  ఏడ్చాడు .. సారి సెల్స్ ఇరవై ఒక్క వేలకు పడిపోయాయట. నేను మాబావగారు మాత్రం ఉన్నాము ఇక్కడ . అని దుఃఖిస్తున్నాడు. ధైర్యం కోల్పోవద్దు  స్వామి పై నమ్మకం సడలించవద్దు.   నీవుకూడా వానికోసం  జపంచేయి .. నిష్ఠానియమాలు ఇప్పుడు  పాటించనవసరం లేదు. ఆపదకాలం ... స్వామిని వేడుకొనటమే మార్గం అని చెప్పాను.

ఇప్పుడు సాయంత్రం ఏడవుతుంది పూజ అయ్యాక   ఫోన్ చేశాను.  రిలీఫ్ గాఉన్నాడు.   సార్ ! సెల్స్  ముప్పైతొమ్మిది వేలకు పెరిగాయి .  అన్నాడు.
వాని ముఖంలో కళ ఎలాఉంది అనడిగాను. పరవాలేదు సార్ నార్మల్ గా ఉన్నాడు. ముఖంలో కాంతి తగ్గలేదు. జపం చెస్తున్నాడు బెడ్ మీద ఉండి  అనిచెప్పాడు.
ఇక పరవాలేదు   స్వామిని ఆశ్రయించినవారి ఆపదలు  కమ్ముకొచ్చిన కారుమేఘాలు మారుత ప్రభావానికి చెల్లాచెదరవుతున్నమాదిరిగా రక్షింపబడతాడు అని చెప్పాను.

స్వామి అనుగ్రహాన వాడు కోలుకుని స్వామి భక్తుడై ..ధర్మ తత్పరతతో జీవనం సాగించాలని కోరుకుంటూ  స్వామిని వేడుకుంటున్నాను...

జైశ్రీరాం
-------------------------------------------------------------------------------------------------------------------

 స్వామి అనుగ్రహంతో ఆ కుర్రవాడు శీఘ్రంగా కోలుకుని ఈరోజు హాస్పిటల్ నుండి ఇంటికివచ్చాడు.ఇప్పుడేచెప్పారు

21-12-19        8.12 pm



1 వ్యాఖ్యలు:

swathi December 18, 2019 at 7:12 AM  

very true.i have my own experiences I read hanumanchalisa when my kids are unwell.they get better soon.jaihanuman

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP