శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

లాల్ బహుదూర్ శాస్త్రిని అమెరికా, పాకిస్థాన్‌లు కలిసి చంపేశాయా?

>> Thursday, March 28, 2019

లాల్ బహుదూర్ శాస్త్రిని అమెరికా, పాకిస్థాన్‌లు కలిసి చంపేశాయా?
జవహార్‌లాల్ నెహ్రూ 1964 లో మరణించిన తర్వాత లాల్ బహుదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే, బాధ్యతలు చేపట్టిన కొన్నాళ్లకే… అంటే (1965 జూన్ ప్రాంతంలో) పాక్ భారత్ పై యుద్ధానికి తెగబడింది. దీనికి ప్రతిగా, ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి అండదండలతో… ఆయన భారత సైన్యానికి ఇచ్చిన స్వేచ్ఛతో… ఎప్పటికప్పుడు ఆయన పదునైన వ్యూహాల కారణంగా భారత్ దళాలు పాక్ కు ధీటుగా సమాధానమిచ్చాయి. 1965 సెప్టెంబర్ నాటికి పాక్ ఈ యుద్ధంలో ఓడిపోయే స్థితికి వచ్చింది. దీంతో, ఆయన దేశం ప్రజల చేత యుద్దవీరుడిగా ప్రజలు నీరాజనాలందుకున్నారు. ఇదే సమయంలో, ఐకరాజ్యసమితి పాక్-భారత్‌లకు యుద్ద విరమణ ఒప్పందాన్ని ప్రతిపాదించింది. ఈ నేఫథ్యంలో, ఈ విషయం గురించి చర్చించేందుకు లాల్ బహూదూర్‌తో పాటు.. అప్పటి పాక్ అధ్యక్షుడు మహహ్మద్ అయూబ్ ఖాన్ అప్పటి సోవియట్ రష్యాలోని తాష్కెంట్ సమిట్‌కు వెళ్లారు. ఇక్కడ యుద్ధ విరమణ ఒప్పందానికి సంతకం చేయమని శాస్త్రి మీద ఐక్యరాజ్యసమతి ఒత్తిడి తెచ్చింది. సహజంగానే, శాంతి కాముకుడైన శాస్త్రి యుద్దంలో పాక్ పై పైచేయి సాధించినప్పటికీ యుద్ధ విరమణ ఒప్పందంపై (1966, జనవరి10న) సంతకం చేశారు. అయితే, ఆ మర్నాడే శాస్త్రి గుండెపోటుతో మరిణించారు. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే ఆయనను మర్డర్‌ చేసి గుండెపోటుతో మరణించారని నమ్మించారు.

చరిత్రలో ఓ దేశ ప్రధానమంత్రి మరో దేశానికి అతిధిగా ఒప్పందాలపై సంతకాలు చేసేందుకు వెళ్లినప్పుడు అసహజంగా, అనుమానాస్పదంగా మృతి చెందడం ఎప్పుడూ జరగలేదు. లాల్ బహూదూర్ శాస్త్రి హృద్రోగం వల్ల మరణించారని అప్పటి సోవియట్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే, గతంలో శాస్ర్రికి ఎన్నడూ ఎలాంటి అనారోగ్యం లేదు. ఆయన పూర్తి ఆరోగ్యంతో తాష్కెంట్‌కు వెళ్లారు. ఆయన మరణించిన తర్వాత శాస్త్రి భౌతిక కాయం ఇండియాకు వచ్చినప్పుడు నీలం రంగులోకి మారి ఉంది. ఆయన శరీరంపై కొన్ని గాట్లు కూడా ఉన్నట్లు ఆయన భార్య లలితా శాస్త్రి గుర్తించారు. మరణించడానికి ముందు శాస్త్రి ఆఖరుగా ఆయన కుమార్తె సుమన్‌తో మాట్లాడారు. ఫోన్‌లో మాట్లాడుతూ పాలు తాగి పడుకుంటానని ఆయన కుమార్తెకు చెప్పారు. అయితే, ఈ లోగా ఫోన్ డిస్‌ కనెక్ట్ అయ్యింది. ఆ తర్వాత దాదాపు పదిహేను నిమిషాల పాటు సుమన్ లాల్ బహుదూర్‌ శాస్త్రి లైన్ కోసం ప్రయత్నించారు. కానీ, లైన్ కనెక్ట్ కాలేదు. పదిహేను నిమిషాల తర్వాత కనెక్ట్ అయ్యింది. కానీ, శాస్త్రి గారు బదులు ఓ సోవియట్ అధికారి ఫోన్ ఎత్తి… మీ తండ్రి గారు ఇప్పుడే మరణించారని సుమన్‌కు తెలిపారు. అసలు ఎలాంటి అనారోగ్యం లేని వ్యక్తికి గుండెపో్టు రావడమేంటి… పోనీ, గుండెపోటు వచ్చినా కేవలం పదిహేను నిమిషాల్లో మృత్యువాత పడతారా అనే సందేహాలు ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి.

తాష్కెంట్ పర్యటనలో లాల్ బహుదూర్ శాస్త్రి వ్యక్తిగత వైద్యుడు ఆర్‌. ఎన్. చుగ్‌ కూడా వెళ్లారు. ఆయనకు శాస్త్రి గారి పక్క గదినే కేటాయించారు. శాస్త్రికి గుండెపోటు వచ్చిందన్న విషయాన్ని సోవియట్ అధికారులు ఆయనకు కూడా చెప్పలేదు. ఆయన మరణించిన తర్వాత ఆ విషయాన్ని చుగ్‌కు సోవియట్ అధికారులు తెలియచేశారు. 1977లో శాస్త్రి మరణంపై అనుమానంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఓ దర్యాప్తు కమిటీని నియమించింది. ఈ కమిటీ ముందు వాంగ్మూలం ఇవ్వడానికి డాక్టర్ చుగ్ బయలుదేరారు. ఆయన కారు ఢిల్లీ వైపు ప్రయాణిస్తుండగా ఎదురుగా ఓ లారీ వచ్చి ఆయనను ఢీ కొట్టింది. దీంతో, చుగ్ అక్కడికక్కడే దారుణంగా చనిపోయారు.

అలాగే, లాల్ బహుదూర్ శాస్త్రికు తోడుగా ఆయన పర్సనల్ అసిస్టెంట్ రామనాథ్ కూడా తాష్కెంట్‌కు వెళ్లారు. శాస్త్రిగారి మరణానంతరం ఆయన మృతదేహాన్ని జాగ్రత్తగా ఇండియాకు తీసుకువచ్చింది రామనాథే! దీంతో, ఆయనను కూడా ఓ సాక్షిగా దర్యాప్తు కమిటీ పరిగణించింది. తమకు వాంగ్మూలం ఇచ్చి దర్యాపుకు సహకరించాలని పిలిచింది. అయితే, వాంగ్మూలం ఇచ్చేముందు దిల్లీలోని మోతీలాల్ మార్గ్‌లో లాల్ బహూదూర్ శాస్త్రి భార్య లలితా శాస్త్రి నివాసానికి వెళ్లి ఆయన ఆఖరుగా ఈ మాటలు ఆమెతో అన్నారు…” చాలా రోజుల నుంచి ఈ భారాన్ని (రహస్యాన్ని) గుండెల్లో పెట్టుకుని మోస్తున్నానమ్మా? ఈ భారాన్ని ఈ రోజుతో వదిలించుకుంటాను” అన్నారు. ఆ మాటలని ఆ ఇంటి నుంచి బయటకు వచ్చి ఆయన ఒక్కడుగు వేయగానే, ఎదురుగా ఓ వాహనం వచ్చి ఆయనను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆయనను రెండు కాళ్లు నుజ్జునుజ్జు అయ్యాయి. తలకు బలమైన గాయాలయ్యాయి. దీంతో, ఆయన గతాన్ని మరిచిపోయారు. ఈ రకంగా, తమ దర్యాప్తులో కీలక సాక్ష్యుల్లో ఒకరు మరణించడం… ఇంకొకరికి ప్రమాదం కారణంగా జ్ఞాపక శక్తి కోల్పోవడం, ఈ కేసును పరిశోదించలేక దర్యాప్తు బృందం చేతులెత్తేసింది. ఇదంతా, చదివిన తర్వాత మీకు తెలుగు సినిమాల్లోని సీన్స్ గుర్తుకు వస్తున్నాయి కదా! కానీ, ఇవి సినిమా సీన్స్ కాదు… వాస్తవంగా జరిగిన సంఘటనలు.

అంతదాకా ఎందుకు, 2009లో ‘సౌత్ ఏషియా పై సీఐఏ దృష్టి’ అనే పుస్తకాన్ని రాసేందుకు అనుజధార్ అనే రచయిత పూనుకున్నారు. (సీఐఏ-సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ-అమెరికా నిఘా సంస్థ) ఈ క్రమంలోనే ఆయన శాస్త్రి అనుమానాస్పద మరణానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కావాలని సమాచార హక్కుచట్టం క్రింద భారత ప్రధాని కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఆశ్చర్యకరంగా ఈ పత్రాలను బయటపెట్టడానికి పీఎంవో ససేమిరా అంది. పైగా, ఈ పత్రాలు విడుదలచేస్తే భారతదేశ అంతర్గత భద్రతకు, సార్వభౌమత్వానికి, ఆర్థిక ప్రయోజనాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఓ రాతపూర్వకలేఖ ద్వారా అనుజధార్‌కు సమాధానమిచ్చారు. భారతదేశాన్ని పాలించిన ఓ ప్రధాని మరణానికి సంబంధించిన పత్రాలు విడుదల చేస్తే దేశ అంతర్గత భద్రతకు ముప్పు వాటిల్లుతుందని స్వయంగా మన దేశ పీఎంవో సమాధానమివ్వడం పెద్ద జోక్ కదూ!
Some Other Info On Sastry Ji Death:
Four reasons Lal Bahadur Shastri’s death was suspicious
1. The KGB suspected poisoning
2. Shastri’s near and dear ones see a needle of suspicion pointing towards an insider's hand
3. No post mortem was carried out on Shastri’s body
4. RTI responses muddied the water further
Source : Various Webs And Books
#LalBahudurSastryDieath #LalBahudurSasty

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP