శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

బలం ఉన్నప్పుడు రాక్షసుల ప్రవర్తన ఇలానే ఉంటుంది ..పురాణకాలంలోనైనా ..పినరపి విజయ్ కాలంలోనైనా

>> Wednesday, January 2, 2019

తనకు బలం ఉన్నప్పుడు ఎదుటివానికి మేలుచేస్తాడు దైవత్వం  ఉన్నవ్యక్తి ..కీడు జరగకూడదనుకుంటాడు మానవత్వం ఉన్న వ్యక్తి. .  రాక్షసత్వం మాత్రం  ఇతరులను బాధపెట్టటం  ,,వారి ఆచారవ్యవహారాలు కించపరచాలని చూడటం     లో  ఆనందాన్ని వెతుకుకుంటుంది . కనుకనే జరిగే యజ్ఞ యాగాదులలో రక్తం మాసం గుమ్మరించి ఆనందపడే వాళ్ళను మనం నాడు రాక్షసులనే  పిలిచాం.
అయ్యప్ప సన్నిధానం లో ఆచార వ్యవహారాలూ హైందవ ధర్మానికి సంబంధించినవి . ఇవి పాటించటం వలన  ఇతరులెవరికీ ఎటువంటి హాని జరగదు .   వీటిని అపవిత్రం చేయటం ద్వారా  ఆనందాన్ని పొందాలని అవహేళన చేయటం ద్వారా తమ బలాన్ని నిరూపించుకోవాలని దుర్మార్గానికి కలి పురుషుని సైన్యం  తెగబడుతున్నది. . ఉదయాన్నే పేపర్ చూసాను   మొన్న  ఏడువందల కిలో మీటర్ల దూరం దీపాలువెలిగించి  సేవ్ శబరిమల అని నినదించిన వారి  వార్తలు  ఈనాడు పత్రికలో కనపడలేదుగాని .... దీనికి వ్యతిరేకంగా  సిపియం వాళ్ళు అన్యమతస్తులతో కూడా కలిపి ఏర్పరచిన మానవహారాన్ని మాత్రం మహా మానవహారం అంటూ కీర్తిస్తూ   ఈనాడు పేపర్లో  పేపర్ ఫ్రమ్ట్ పేజీలో దర్శన మిచ్చింది. .
     

                                       స్కూల్ నుండి ఇంటికొచ్చాక చూసాను టీవీ నైన్ లో   తెల్లవారు జామున ఏమాత్రం నియమాలు బొట్టూ ఆచారం లేకుండా స్వామి సన్నిధానానికి స్త్రీలను చేర్చిన  కేరళ పోలీసుల తెంపరితనం ... దానికి నిరసనగా  విజయవాడలో దీక్షాధారుల ఆందోళన కార్యక్రమం.
శబరిమల స్త్రీలు ఎందుకు రాకూడదు   అని అంతరిక్షంలో కూడా   స్త్రీల శక్తి సామర్ధ్యాలు  .... అంటూ యాంకరమ్మ వినయంగా జవాబిస్తున్న స్వాములను గడ్దిమ్చి మరీ అడుగుతున్నది . హిందువులపట్ల ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు.  అదే ఏమసీదులో నో సమానహక్కులు అంటూ స్త్రీలు ప్రవేశిస్తే  ఇప్పటి కి విజయవాడ ఎలాఉండేది అని ఒక స్వామి అడుగుతుండటంతో    గతుక్కుమన్న యాంకర్ .. అతితెలివిగా మైకు మాట్లాడుకుంటూ వెళ్లిన దృశ్యం .
ఇక   ఐద్వానాయకురాలు  రమాదేవిగారు మాట్లాడుతున్నారు అడ్డదిడ్డంగా ... నెలసరి రావటం తప్పా ... ఆలయంలోకి వెళితే ఎం తప్పు అని.లాజిక్ లు తీస్తున్నారు . మీ   ఇంటిలో అన్ని గదులు మీవేకదా ...అలాంటప్పుడు  లెట్రిన్ రూములో కూర్చుని అన్నం తినరేందుకు ?   అని అక్కడ చర్చలలో మాట్లాడేవారు అడిగితె బాగుండేది.  వీటినే నియమాలు అంటారు  అనిచెప్పినా  ఎక్కడైనా ఎలాగైనా తింటామనుకునేవారికి ఎక్కకపోవచ్చూ కూడా....
శివుడాజ్ఞ   లేనిది చీమైనా కుట్టదంటారుకదా ........  ఇప్పుడు మహిళాభక్తులను  అయ్యప్ప పిలుస్తున్నాడేమో అని ఆవిడ వెటకారంగా  మాట్లాడుతున్నది.    కర్మ ఫలితాలు నెత్తికెక్కి తొక్కినప్పుడు గాని  మీకు  సమాధానం కళ్ళముందు   కనపడదు.  వేచిచూడండి ........

అధర్మం పెచ్చూరిల్లుతున్నా   ఇది తప్పు అని నోరువిప్పకుండా పట్టనట్లు చూస్తున్న హిందువులైనా    ఇంకెవరైనా  కూడా    పాపఫలితంలో భాగం పంచుకోక తప్పదు.  

...మేలుకొండి .......మేలుకొండి ... మిత్రమా     కలిప్రభావం  మీ ఇంటిముందు కరాళ నృత్యం చేస్తున్నది

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP