శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

హనుమత్ రక్షాయాగం ఏకాదశావృతి .

>> Saturday, December 29, 2018

భగవద్బంధూ  !

   హనుమత్ప్రభువుల అనుగ్రహంతో ఇప్పటివరకు  హనుమత్ రక్షాయాగం  పది ఆవృతులు నిర్వహించుకోగలిగాం . మనపెద్దలు చూపిన మార్గంలో  భగవంతుని  అనుగ్రహమునకు పాత్రులమై ధర్మబద్ధమైన మన ఇష్ట కామ్యములను సాధించుకొనవచ్చుఁ  ..అనేమాట   పట్ల  సంపూర్ణ విశ్వాసం లేని వారికి  ప్రయోగపూర్వకంగా  ఈ సాధనను సూచించటం జరిగింది . స్వామిని నమ్మిన వారి ఎంతోమంది జీవితాలలో ఈ సాధన ద్వారా అద్భుత ఫలితాలు  నిరూపించబడ్డాయి . ఎన్నెన్ని మహిమలు !!!!!!  . విశ్వాసం తో  స్వామిని ఆశ్రయించినవారి భక్తిని గూర్చిగాని..... అసాధ్య సాధక స్వామిన్ ..అసాధ్యం తవ కిం వద  ..రామదూత కృపాసింధో   మత్కార్యం సాధయ ప్రభో  ... అని ఆశ్రయించిన వారి ని బ్రోచే స్వామి శక్తిని   ఎలా ... వర్ణించగలం .

  ఇప్పుడు ఏకాదశావృతి  ప్రారంభం  అవుతున్నది.   31.. 12.. 2018  మార్గశిర  బహుళ దశమి నాడు  మహాగణపతి పూజతో   ఏకాదశావృతి  సద్గురువుల ఆశీర్వాదములతో  ప్రారంభం అవుతున్నది . మాఘ శుద్ధ దశమి  15-2-2019  శుక్రవారం  పూర్ణాహుతి కార్యక్రమం జరుపబడుతుంది.

ఇంకొక విశేషం ఏమిటంటే   ఈ  సంవత్సరం  శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం   పుష్కరోత్సవాలు  జరుగుతున్నాయి.
విశేషమయిన కార్యక్రమములు భక్తుల అభీష్టములు తీరుటకై  నిర్వహించబడుతున్నాయి . మీరు    మంచిరోజు చూసుకుని    మీమీ అభీష్టములు నెరవేరాలని సంకల్పించుకుని   హనుమాన్ చాలీసా పారాయణము ..శ్రీరామ నామ లేఖనము ప్రారంభించి  పూర్ణాహుతి సమయానికి  యాగశాలకు వఛ్చి సమర్పించటం లేదా ఇక్కడకు చేరేలా పోస్ట్ లేక కొరియర్ ద్వారా పంపవలసి ఉంటుంది . పురోహితులు మీ తరపున  ఆహుతులను సమర్పిస్తారు. స్వామికి నివేదిస్తారు
 మీ గోత్రనామాలు  యధావిధిగా మాకు పంపవలసినదిగా కోరుతున్నాము. యాగ నిర్వహణ గూర్చిన సందేహాలు మీ సూచనలు  సలహాలు  సహాయాలను మాతో పంచుకోవలసినదిగా మనవి .

durgeswara@gmail.com
9948235641

లలో సంప్రదించగలరు

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP