శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అంతా ఋణానుబంధం - జగమంతా ఋణానుబంధం ""

>> Monday, November 26, 2018

"" ఋణానుబంధం -  అంతా ఋణానుబంధం  -  జగమంతా  ఋణానుబంధం ""

ఈ విషయం చదివేముందు ఒక్కమాట !

ఒక తండ్రి 70 సంవత్సరాల వయస్సు వచ్చిన తరువాత చనిపోయినప్పుడు పెద్దకొడుకు  వయస్సు 40, రెండవకొడుకు  వయస్సు  37, మూడవ కొడుకు వయస్సు 33, నాలుగవ కొడుకు వయస్సు 30. సంవత్సరాలు అయితే...

అంటే పెద్ద కొడుకుతో 40 ఏళ్ళు ఉంటే , చివరి నాలుగవ కొడుకుతో  30 ఏళ్ళు మాత్రమే వున్నాడు . ఎందుకు ?

మీ అనుభవంలో ....... ...... Niఒక సంతానం ఏదైనా కోరితే డబ్బులు లేకున్నా అప్పు చేసి వారి కోరిక నెరవేరుస్తాము , కానీ మరో సంతానం ఏదైనా కోరితే చేతిలో  డబ్బులున్నా వాడి కోరిక   తీర్చాలనిపించదు ఎందుకని ?

అలాగే కొంతమంది విషయంలో ఎక్కువ ప్రేమ చూపిస్తాం  ఎందుకని ?

ఇక చదవండి !

మనకు పూర్వ జన్మ కర్మల వలననే
ఈ జన్మలో...
తల్లి,
తండ్రి,
అన్న,
అక్క,
భార్య,
భర్త,
ప్రేమికుడు, ప్రియురాలు, మిత్రులు,
శత్రువులు మిగతా సంభంధాలు...
ఈ ప్రపంచం లో మనకు లభిస్తాయి.

ఎందు కంటే మనం వీళ్లకు...
ఈ జన్మ లో...
ఏదో ఒకటి ఇవ్వ వలసి, లేదా తీసుకొన వలసి రావచ్చును.

# *మనకు సంతాన రూపం లో ఎవరెవరు వస్తారు.*

మనకు....
*పూర్వ జన్మ లో సంబంధం వున్న వాళ్ళే*
ఈ జన్మలో సంతాన రూపంలో జన్మిస్తారు. వాటినే  మన శాస్త్రాల ప్రకారం నాలుగు రకాలుగా వున్నట్లు చెబుతారు...

 *ఋణాను బంధం*:-
 గత జన్మ లో మనం ఎవరి వద్ద నైనా రుణం తీసు కుని వుండచ్చు  లేదా ఎవరో ఒకరి ధనాన్ని నష్ట పరచి వుండొచ్చు.

అటు వంటి వాళ్ళు మీకు సంతాన రూపం లో జన్మించి లేదా ఏదైనా వ్యాధి రూపం లో వచ్చి మీ వద్ద వున్న పూర్తి ధనం ఖర్చు అయ్యే వరకూ వుండి ఆ పాత ఖర్చులు సరి సమానం అయ్యే వరకు మన తోనే వుంటారు.

# *శత్రువులు - పుత్రులు*:-
మన పూర్వ జన్మ లో శత్రువులు మనపై వారు తమ తమ కక్షను తీర్చుకోవటానికి మన ఇంట్లో సంతాన రూపం లో తిరిగి పుడతారు.

అలా పుట్టి తల్లి దండ్రులతో పెద్దయ్యాక కొట్లాటలు,
నానా గొడవలూ చేస్తారు.

జీవిత మంతా ఏదో ఒక విషయంలో ఏడి పిస్తూనే వుంటారు.

ఎల్లప్పుడును తల్లితండ్రులను
నానా యాతన పెడుతూ వాళ్ళ పరువు తీసి వాళ్ళను దుఃఖితులను చేస్తూ... ఆనంద పడు తుంటారు.

# *తటస్థ పుత్రులు* :-
వీళ్ళు ఒక వైపు తల్లి తండ్రులకు సేవ చెయ్యరు...

మరో వైపు సుఃఖం గా కూడా వుంచరు,
వాళ్ళను వాళ్ళ మానానికి వాళ్ళను వదిలేసి వెళ్తారు.

వాళ్ళ వివాహా నంతరం తల్లి దండ్రులకు దూరంగా జరిగి పోతారు.

# *సేవా తత్పరత వున్న పుత్రులు*:-

గత జన్మలో మీరు ఎవరి కైనా బాగా సేవచేసి వుండవచ్చును,

ఆ రుణాన్ని తీర్చు కోవటానికి మీకు కొడుకు లేదా, కుతూరు రూపంలో ఈ జన్మలో వస్తారు.

అలా వచ్చి బాగా సేవను చేస్తారు.

మీరు గతం లో
ఏది చేసుకున్నారో ఇప్పుడు అదే సంప్రాప్తిస్తుంది.

మీరు గత జన్మలో ఎవరి కైనా సేవ చేస్తే,
ఈ జన్మలో మన ముదుసలి తనంలో మనకు సేవ చేస్తారు.

లేకపోతే మనకు వృద్ధాప్యంలో గుక్కెడు నీళ్లు పోసే వారు కూడా మన వద్ద వుండరు.

ఇది పూర్తిగా మనుష్యులకు మాత్రమే అమలు అవుతుంది.
అని అనుకోవద్దు.

ఈ క్రింద చెప్పిన ప్రకారం ఎలాంటి విధంగా నైనా పుట్ట వచ్చును.

ఒక వేళ మీరు ఒక ఆవుకి నిస్వార్థమైన సేవ చేసి వుండవచ్చును.
వాళ్ళే మీ  కొడుకు లేదా, కూతురుగా
మీ ఇంట పుట్ట వచ్చును.

ఒక ఆవుకి తన దూడకు సమంగా పాలు తాగనియ్య కుండా దూరంగా వుంచిన పాపానికి వాళ్ళే కొడుకు లేదా, కూతురుగా మీ ఇంట పుడతారు.

లేదా మీరు ఏదైనా నిరపరాధి జీవిని సతాయించారనుకో, వాళ్ళు మీకు శత్రువు రూపం లో పుట్టి మీతో తన గత శత్రుత్వం యొక్క కక్ష తీర్చు కుంటారు.

అందుకనే జీవితంలో ఎవరికీ కూడా కీడు, చెడు చెయ్య వద్దు.

ఎందు కనగా ప్రకృతి నియమం ప్రకారం మీరు ఏది చేస్తే...

దానికి ఈ జన్మ లో లేదా వచ్చే జన్మలో నూటికి నూరు శాతం  అనుభవం లోకి తెస్తుంది. 

మీరు ఒక వేళ ఎవరికైనా ఒక్క రూపాయి దానం చేస్తే అది మీ ఖాతాలో నూరు రూపాయలుగా జమ చెయ్య బడతాయి.

ఒక వేళ మీరు ఎవరి వద్దయినా ఒక్క రూపాయి లాక్కుంటే మీ ఖాతా నుంచి నూరు రూపాయలు తీసి వేయ బడతాయి.

(అనగా పాప పుణ్యాలు)
 కొద్దిగా ఆలోచించండి "
మీరు మీతో కూడా ఎంత ధనాన్ని తెచ్చు కున్నారు.

మళ్లీ ఎంత ధనాన్ని
మీ వెంట తీసు కెళ్తారు..?

ఇప్పటి వరకు పోయిన వాళ్లు ఎంత బంగారం,
వెండి పట్టుకు పోయారు..?

చివరగా ఒకమాట !

తాతగారు  సంపాదించిన ఆస్తినంతా  తగిలేసి  మాకు ఏమి మిగల్చలేదని  ఒక కొడుకు బాధపడతాడు .
దానికి కారణం అతనికి తాత తండ్రుల ఆస్తిపాస్తులు అనుభవించే  యోగం లేదన్నమాట !

అతి బీద కుటుంబంలో  పుట్టిన  మరో తండ్రి కోట్లాది రూపాయలు సంపాదించి సంతానానికి మిగిల్చి  చనిపోతాడు. దీనికి కారణం ఆ తండ్రి , తన కొడుకుకు  చెల్లించాల్సిన  అప్పన్నమాట !

మీ జీవితంలోని సంఘటనలను ఒకసారి బేరీజు వేసుకొని ఆలోచించండి .

నేను,
నాది,
నీది అన్నది.
అంతా ఇక్కడి కిక్కడే పనికి రాకుండా పోతుంది.

ఏది కూడా వెంట రాదు.
ఒకవేళ మీ వెంట వస్తే గిస్తే మీ పుణ్య పాపఫలం వెంట వస్తుంది.

జీవితమన్నా, సంసారమన్న ఏదైనా అనండి అంత ఋణానుబంధం.

కావున మీరు వాస్తవాలను గ్రహించి , వాస్తవాలను తెలుసుకొని , ఎంత వీలయితే అంత *మంచికర్మలు* చెయ్యండి.

   📙  శుభం భూయాత్ !!

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP