శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

రాక్షసులను ఎదుర్కొనే అవకాశం ఇచ్చాడు పరమాత్మ ..మీరు సిద్ధమా?????

>> Saturday, October 27, 2018

ధర్మానికి హాని జరుగుతున్నప్పుడు  మనం తక్షణం స్పందించాలి . లేదంటే అధార్మికుని దౌష్ట్యాన్ని ప్రోత్సహించినవారిగా మిగులుతాము. ఇదే మహాభారతం బోధించిన నీతి.  దుర్మార్గులచర్యలను  నిలువరించలేకపోయినా కనీసం నిరసన కూడా తెలపకుండా  వంద వంకలు చెప్పి మౌనంగా ఉన్నందుకు మంచివాళ్లను కూడా మహాభారతయుద్ధంలో దగ్గరుండి నరికించాడు పరమాత్మ . ఇది మనకు సందేశం . నిర్దేశం .
ఈరోజు కలిసేన  వికటాట్టహాసం చేస్తూ ధర్మధ్వంసనకు ,మన ఆచారాలను,పవిత్రస్థలాలలోని శక్తిని మలినంచేయాలని తద్వారా మనలను శక్తిహీనులుగా మార్చాలని వ్యూహమ్ తో  ఉరకలెత్తి సాగుతున్న ది.
దీనికి కారణం కూడా మన అలసత్వమే . ఎంతసేపూ మన బోడిగుండ్లు ,మన కొబ్బరికాయలు ,ప్రసాదాలు   ,కోరికలు మాత్రమే ధర్మాచరణగా తలచి ధర్మ నిష్ఠను పెంచుకోలేని ఉదాసీనత  నేడు సనాతన ధర్మ సమాజానికి చేతగాని తనంగా పరిణమించాయి. . తరతరాలుగా మన తాతలు తండ్రులు కాపాడుకొచ్చిన  మన సాంప్రదాయాలు ఆచారవ్యవహారాలు మనం మన పిల్లల చేతికిచ్చ్చి వారిని రక్షించుకోవాలంటే మనం ధర్మరక్షణకు నడుం బిగించాలసిందే .
సోదరా ! సోదరీ ! నేడు మనధర్మానికి పెనుముప్పు దాపురించిందని మీ కు తెలుసు  ... అయినా నేనేం చేయగలనని సందేహిస్తూ    మౌనం దాల్చకండి . ఎవరికీ చేతనైన రీతిలో వాళ్ళు  మన నిరసనను ఎలుగెత్తిచాటుదాము. అదిప్రభంజన ఘోషగా మారి  న్యాయస్థానాలని,ప్రభుత్వాలని సన్మార్గంలోకి పరుగులు తీపిస్తుంది.
మీరు ,మీ బంధువులను మిత్రులను చైతన్యపరిచి తలా ఒక ఉత్తరంగా మన నిరసనలను న్యాయ స్థానాలకు  ప్రభుత్వాలకు  పంపేలా చూడవచ్చూ. ప్రతి ధార్మికుడు ,దీక్షాధారి,అర్చకుడు పురోహితుడు  ఇలా ఎవరికీ వారు  ఒక్కొక్కరు వందమందికి జరుగుతున్న అన్యాయాలను వివరించి  ఇలా నిరస నను  ప్రకటించేలా చేద్దాం . మనం  దైవం అనుగ్రహ నీడలో నిలబడదాం దెయ్యాలు వంద కట్టగట్టుకుని వచ్చినా చచ్చి కూరుచుంటాయి.
ఇది మహాభారత నీతి .   మీకు మనసులో ఉన్న భక్తివిశ్వాసాలను  భగవంతుని పట్లగల అంకిత భావాన్ని ఇలా నిరూపించి చూపించాలి ఆయనకు .
 రాక్షసులను ఎదుర్కొనే అవకాశం ఇచ్చాడు పరమాత్మ  ..మీరు సిద్ధమా

శరణమయ్యప్పా

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP