శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

తామ్రపర్ణి నదికి పుష్కరాలైతే భీమా నదికి అని చెప్పి మోసం చేస్తున్న వ్యాపారులు

>> Monday, July 9, 2018

ఏ నదికి ఈ సారి పుష్కరాలు?
------------------////----------
పుష్కరమంటే 12ఏళ్ళు.ప్రతి 12ఏళ్ళకు ఒక నదికి పుష్కరం వస్తుంది. మనకు 12రాశులున్నాయి.ఆయా రాశులలో బృహస్పతి సంచరించే కాలంలో ఒక్కో నదికి పుష్కరాన్ని బ్రహ్మ దేవుడు అనుగ్రహించాడు. బృహస్పతి ఒక్కో రాశిలో ప్రవేశించిన తొలి 12రోజులు ఒక్కో నదికి పుష్కరమొస్తుంది.ఆ సమయంలో ఆ నదిలో స్నానం చేస్తే పుణ్యప్రదం అని నమ్మకం.
ఈ సంవత్సరం భీమా నదికి పుష్కరమని పంచాంగాలలో వ్రాశారు. దీన్ని బట్టి వివిధ ట్రావెల్స్ సంస్థలు ప్రోపగాండా మొదలెట్టేశారు.అప్పుడే రైల్వే టిక్కెట్లన్నీ బ్లాక్ చేసేసారు. భీమానది మహారాష్ట్రలోని భీమశంకర్ నుంచి కర్నాటక మీదుగా తెలంగాణ వరకు వచ్చి కృష్ణలో కలసిపోతుంది.ఈ నదికే పుష్కరమని నిర్ణయించేసి పైన చెప్పినట్లు టిక్కెట్లు బుక్ చేసేసారు.
కానీ భీమానది కి అసలు పుష్కరమే లేదు.పుష్కర నిర్ణయం మూలశ్లోకం చూడండి.

"శ్లొ//మేషే గంగా వృషే రేవా మిథునేతు సరస్వతీ
కర్కటే యమునా ప్రోక్తా సింహే గోదావరీ స్మ్రతా
కన్యాయాం కృష్ణవేణీచ కావేరీ ధటకే స్మ్రతా
వృశ్చికే తామ్రపర్ణీచ చాపే పుష్కర వాహినీ
మకరే తుంగభద్రాచ కుంభే సింధునదీ స్మ్రతా
మీనే ప్రణీతా నదీచ గురోస్సంక్రమణే స్మ్రతా
పుష్కరాఖ్యౌ మునీనాంహి బుధై స్మ్రతా....."

ఇదీ మూల శ్లోకం.
దీన్ని బట్టి చూస్తే ఈ జాబితాలో"భీమానది"లేదు.తామ్రపర్ణి మాత్రమే ఉంది.ఈ తామ్రపర్ణి నది ఒకప్పుడు శివునికి రథంగా ఉండడం చేత దీనికి "భీమరథి"అనే పేరు ఉంది.అంతే కానీ ఇది భీమానది మాత్రం కాదు.

ఈ తామ్రపర్ణి నది తమిళనాడు లోని తిరునల్వేలి ,తూత్తుకూడి జిల్లాల్లో ప్రవహిస్తుంది. శాస్త్రప్రకారం 'బాణతీర్థం'లో పుష్కర స్నానం చేయాలి.బాణతీర్థం దగ్గరలోని రైల్వేస్టేషన్'అంబాసముద్రం'.

కాబట్టి దయచేసి అందరూ గమనించండి.మనం పుష్కర స్నానం చేయవలసింది తామ్రపర్ణి నదిలో!!!!
అంతే కానీ 'భీమానది'లో కాదు.                        గ

1 వ్యాఖ్యలు:

maheshudu July 10, 2018 at 3:03 AM  

dhanyavaadaalu

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP