శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

జ్యోతిష్య_విరోధులకు_సవాల్ !!!

>> Sunday, July 8, 2018

#జ్యోతిష్య_విరోధులకు_సవాల్ !!!

‘‘ప్రపంచం ఒక భయంకరమైన కుట్రకు బలౌతోంది. ఈ కుట్ర ద్వారా ప్రపంచంలోని మేధస్సును సొంతం చేసుకోవాలని ఆంగ్లేయులు పథకరచన చేశారు. అణురహస్యాలు, వైద్యం, రసాయన శాస్త్రం, ఖగోళం, భూగర్భశాస్ర్తం, వాణిజ్య, గణిత, వ్యవసాయ శాస్త్రాల నుంచీ ఆధ్యాత్మిక రంగం వరకూ అన్ని రంగాలలోని మేధస్సును తమ ఆధీనంలో ఉంచుకోవాలని ఆంగ్లేయులు దుర్మార్గమైన దాడి ప్రపంచం మీద మొదలుపెట్టారు. అయితే వారి దోపిడీని ఎదుర్కొనే దేశం ప్రపంచంలో కేవలం భారతదేశం మాత్రమే అని తెలుసుకున్నారు.

కనుక భారత విజ్ఞాన శాస్త్రాలు దోచుకొనిపోయి, భారత దేశ విద్యావ్యవస్థను నాశనం చేసి భారతీయుల చేతే మహోన్నతమైన మేధశాస్త్రాలు సర్వనాశనం చేసే ఎత్తుగడను ముందుగా రూపొందించుకొని 16వ శతాబ్దంలో భాతరదేశంలోకి అడుగుపెట్టారు. దీనిలో భాగంగా ఇక్కడి విజ్ఞాన శాస్ర్తాల రాతప్రతులైన తాళపత్రగ్రంథాలు తరలించుకుపోయారు.

సంస్కృతంలో తమ దేశీయులకు తర్ఫీదు ఇచ్చి అనువాదాలు చేయించుకొన్నారు. వారు ఈ కుట్రను ఎంతగా చేశారంటే ఆంగ్లేయులు తమ భాషలో చేసినన్ని సంస్కృత గ్రంథాల తర్జుమాలు నేటికీ భారతీయ భాషల్లో 10 శాతం కూడా కాలేదు అంటే భారతీయులు సిగ్గుపడాల్సిన అంశం. కుట్రలో భాగంగా వారు మెకాలే విద్యావిధానాలు ప్రవేశపెట్టి సంస్కత భాషను నాశనం చేశారు. దీంతో సహజంగానే భారతీయ గ్రంథాలలో ఉన్న కణాదుడు (అణురహస్య గ్రంథాలు), రసవేదాలు, ఆయుర్వేదాలు అర్థం చేసుకొగలిగిన మహాపండిత తరాలు అంతరించాయి.

నేడు కేవలం భాషా పండితులు మాత్రమే మిగిలారు. వీరు కూడా 2010 వచ్చే సరికి అంతరిస్తారు. దీంతో భారతదేశంలో సంపూర్తిగా సర్వనాశనం జరిగిపోతుంది. దీని వల్ల విజ్ఞానం అంటే అమెరికా ఇంగ్లండుల్లో ఉన్నదే అనే పైశాచిక తరం మొదలు అవుతుంది.‘‘అని 1982న ఆంధ్రవ్యాసుల వారు చెప్పింది దాదాపు 35 ఏళ్ల తరువాత నిజం అవుతోంది. ఈ రోజు విజ్ఞాన శాస్ర్త పుస్తకాలు అంటే లక్షల రూపాయలు డాలర్లుగా మార్చి కొనుక్కోవాల్సి వస్తోంది. సిగ్గుపడాల్సిన అంశమేమిటంటే భారతీయ వ్రాతప్రతులు, తాళపత్రగ్రంథాలను విదేశీ గ్రంథాలయాలు ఒక్కో తాటాకు ప్రతీ సెంటీమీటరు వేల రూపాయల చొప్పున అమ్ముతున్నాయి.

ఈ దేశంలో పుట్టి, ఈ దేశం సొమ్ముతిని పెరిగి, ఈదేశప్రజల రక్తమాంసాలు పన్నులు చెల్లిస్తే పరిపాలిస్తున్న సన్నాసి నేతల పాలనలో బయల్దేరిన దౌర్భాగ్య మేధావి వర్గం చేస్తున్న పని ఒక్కటే. భారతీయ వేదవిజ్ఞానాన్ని అపహాస్యం చేయడమే.
ఇదే అంశాన్ని ఆంధ్రవ్యాసులవారి దృష్టికి కొందరు బాధపడుతూ తీసుకువెళ్లినప్పుడు వారు చెప్పిన మాటలవి.

వారు ఈ విధంగా చెప్పారు. ‘‘ నేడు భారతదేశంలో కేవలం భాషా పండితులే అక్కడక్కడా మిగిలారు. శాస్ర్తపండితులు లేరు. అంటే సంస్కృతంలో ఉన్న ఆయుర్వేద గ్రంథాలు చదివి అర్థం చేసుకోగలిగినవారు లేరు. కణాది మహర్షులు వ్రాసిన అణురహస్యాలున్న గ్రంథాలు అర్ధం చేసుకోగలిగిన సంస్కృతపండితులు లేరు. రసశాస్త్రాం అనే సంస్కృతంలోని కెమిస్ట్రీ గ్రంథ రహస్యాలు చెప్పగలిగిన వారు లేరు, పరిశోధన చేయగలిగినవారు లేరు.

మా తరాలు ముగిశాక సంస్కృతం పూర్తిగా నశించపోనుంది. ఫలితంగా మహారహస్య గ్రంథాలు సంపూర్తిగా మనవి కాకుండాపోతున్నాయి. మయమతం వంటి ఆర్కిటెక్టులకు చెందిన గ్రంథాలు ఇప్పటికే అంతరించి కేవలం కొన్ని శ్లోకాలతో మాత్రమే మిగిలాయి. ఇక రేపు ఆంగ్లేయులు ఇన్నాళ్ళూ దాచిపెట్టిన సంస్కృత పుస్తకాలు బయటకు తెచ్చి అచ్చువేసి పిప్పరమెంటు బిళ్లల్లా పంచిపెట్టినా చదవి అర్థం చేసుకొని పరిశోధనలు చేయలేని జాతి తయారు అవుతుంది‘‘ అని అన్నారు.

జ్యోతిష్యం మీద భారతప్రభుత్వం ముద్రించిన కొన్ని పుస్తకాలు ఆంధ్రవ్యాసులవారి దృష్టికి వెళ్లినప్పుడు వారి స్పందన ఇది. ‘‘ఈ భారతదేశ దౌర్భాగ్యులు ప్రచారం చేస్తోంది శుద్ధఅబద్ధం. అమెరికా అంతరిక్షప్రయోగాలు చేసి ప్రగతి సాధించింది కేవలం 19వ శతాబ్దంలో మాత్రమే. అది కూడా హాలీవుడ్ లో సెట్టింగులు వేసి తాము చంద్రుడి మీద కాలుమోపామని అసత్యప్రచారాలు చేశారనే వారు కూడా లేకపోలేదు. ఆంగ్లేయులు మొదటగా భయపడింది భారతీయ ఖగోళపరిజ్ఞానానికి. ఇందుకు కారణమైన విజ్ఞానం జ్యోతిషంలో ఉంది. ఆంగ్లేయులు  ఈ విజ్ఞాన శాస్త్రాలు పునాదిగా చేసుకొని అంతరిక్షప్రగతి సాధించారు. దీనికి ప్రామాణికాలు కూడా కావలసినన్ని ఉన్నాయి. వీటిని ప్రచారంలోకి తీసుకురావాలంటే సంస్కృతం తెలిసిన గణితశాస్త్ర పండితులు కావాలి.‘‘ అని అన్నారు.

ఆంధ్రవ్యాసుల వారు చూపిన బాటలో పరిశోధనలు చేస్తే అత్యద్భుతమైన అంశాలు తెలిశాయి. అందులో ఒక అంశం నేడు తెలుసుకొందాం.

ఆర్యభటీయంలో గోళపాదం అనే అధ్యాయంలోని 39 శ్లోకం ఈ విధంగా చెబుతోంది.

భూరవివివరం విభజేద్ భూగుణితం తు రవిభూవిశేషేణ!
ఛాయాయా దీర్ఘత్వం లబ్ధం భూగోళవిష్కమ్భాత్!! అని అంటోంది.

దీని అర్థం ఏమిటంటే భూమి నుంచీ సూర్యుడి దూరాన్ని భూవ్యాసంతో హెచ్చవేసి, సూర్య వ్యాసం నుంచీ భూ వ్యాసం తీసి వేస్తే వచ్చినదానితో భాగాహారించు. దీని వల్ల భూవ్యాసం నుంచి భూ ఛాయ కొలత తెలుస్తుంది అని అర్థం.

దీని తరువాత శ్లోకంలో

ఛాయాగ్రచంద్రవివరం భూవిష్కమ్భేణ తత్ సమభ్యస్తమ్!
భూఛాయయా విభక్తం విద్యాత్ తమః స్వవిష్కంభమ్!!
అని అంటోంది.

దీని అర్థం ఏమిటంటే భూమి నీడ పొడవును భూమి నుంచీ చంద్రుడి దూరం నుంచీ తీసివేత చేసి, భూమి వ్యాసంతో హెచ్చవేసి భూమి నీడ పొడవుతో భాగాహారిస్తే వచ్చే ఫలితం చంద్రుడి నుంచీ భూమి నీడ వ్యాసం అవుతుంది అని అంటోంది.

ఈ విధంగా స్పష్టంగా ఆర్యభటీయం గణిత ఫార్ములాలు గ్రహణాల లెక్కింపులో చెప్పింది.

ఇక్కడ గమనించాల్సిన అంశం మరొకటి ఉంది.

భూమి వ్యాసం 1050 యోజనాలుగా ఆనాడు మహర్షులు లెక్కవేశారు. యోజనం అంటే 13 కిలోమీటర్లుగా ఆధునికులు అంగీకరిస్తే ఇది దాదాపు నవీన లెక్కల ప్రకారం భూమి వ్యాసం 12,742 కిలోమీటర్లకు సరిపోవడం పరమ ఆశ్చర్యకరమైన అంశం.

పైన ఆర్యభటీయంలో నుంచీ రెండు శ్లోకాలు ఇవ్వడానికి కారణం ఉంది. గ్రహణాల సమయం, గ్రహగతులు లెక్కించడంలో వ్యాసం, దూరం  అతి ముఖ్యమైనవని చెప్పడానికి ఉదాహరించాల్సి వచ్చింది. పూర్వం మహర్షులు ఇటువంటి ఫార్ములాలు తయారు చేసి పంచాంగ కర్తలకు ఇచ్చారు. వీటిని బట్టీ గ్రహణాలు ఎప్పుడు వస్తాయి అవి సంపూర్ణమా? పాక్షికమా? స్పర్శ, మోచన కాలాలు నిర్ణయించేవారు.

కనుక వీటిలో అతి ముఖ్యమైనవి ఈ దూరాలు, వ్యాసాలు.

ఇదిలా ఉంటే పాశ్చాత్యులు నోరు వెళ్లబెట్టిన మహాద్భుతమైన మహర్షుల గణిత మేధస్సు బయటపడింది. అది అర్థం కావాలంటే ఈ క్రింది లెక్కలు పరిశీలించాలి.

మొదటి భాస్కరాచార్యమహర్షి సాధించిన సూర్యుని వ్యాసం, దూరం నిష్పత్తి 0.009596 అయితే ఇదే నిష్పత్తి చంద్రునిది 0.009163

అలాగా రెండో భాస్కరాచార్యమహర్షి సాధించిన సూర్యనిష్పత్తి 0.009461 అలాగే చంద్రునిది 0.009308

ఇవి తెలుసుకున్నాక అమెరికా  అంతరిక్షపరిశోధనా సంస్థ నాసా సిగ్గుపడాల్సిన అంశం తెలుసుకుందాం. ప్రపంచాన్ని దోచుకున్న సొమ్ములో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నాసా కనుగొన్న సూర్య నిష్పత్తి 0.0093 అలాగే చంద్రుని నిష్పత్తి 0.009

ఈ నిష్పత్తులు చాలా ముఖ్యమైనవి. ముఖ్యంగా గ్రహణాలను కచ్చితంగా నిమిషాలు, ప్రదేశాలతో సహా లెక్కించడానికి ఇటువంటి నిష్పత్తులు అతి ముఖ్యమైనవి. భారతీయులు కేవలం పగిలిపోయిన కుండపెంకులు, నులకమంచం తాళ్లు, చెక్కముక్కలతో సాధించిన నిష్పత్తులు చూసి ఆంగ్ల శాస్త్రవేత్తలు నేటికీ కోమా లో నుంచీ కోల్కోలేదు.

సాధారణంగా ఎవరైనా ఇంత అద్భుతమైన మేధస్సు చూసి సాష్టాంగ నమస్కారం చేస్తారు. కానీ పైశాచిక సంతతి కనుక ఆంగ్లేయులు భారతీయ మేధస్సును సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు. దీనికి ప్రాతిపదికగా ఆంగ్లవిద్యావినాశన పథకాన్ని సెక్యులరిజం పేరుతో భారతీయుల నెత్తిన రుద్దారు.

దౌర్భాగ్య నేతలు, పిశాచవిద్యాప్రొఫెసర్లు నేడు భారతీయ బ్రహ్మవిద్యలు భూస్థాపితం చేశారు. అన్ని చోట్లా అంటిన ఈ ఆంగ్ల సుఖవ్యాథి పాత్రికేయరంగానికి కూడా పాకింది.

పాత్రికేయత అంటే ఒక అంశం మీద సమగ్రమైన పరిశోధన చేసి, దాన్ని ఆకళింపుచేసుకొని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిలా నిజానిజాలు నిర్థారించి ప్రజలకు ఏవిధంగా ఎంతవరకూ ఎలా చెప్పాలో అలా చెప్పడం. కానీ నేడు పాత్రికేయత అంటే హిందూమతాన్ని తిట్టు, సంప్రదాయాల్ని తిట్టు, యాంకర కింకరిణులకు బొట్టు పెట్టకు, జుట్టువిరబోసి కూర్చోబెట్టు. తెలుగు పలకలేము కనుక ఇంగ్లీషు పదాలతో అటూ ఇటూ కాని భాష మాట్లాడు. ఈ లక్షణాలు ఉంటే దేశాన్ని ఉద్దరించే వారు. బొక్కల తడిక భారతరాజ్యాంగం సెక్యులరిజం పరిరక్షకులు, సైంటిఫిక్ టెంపర్ గాళ్ళు.

ఈ దగుల్బాజీ నేతలు, పొట్టలోని పురుగులు నోటి మాటలుగా బయటకు తెస్తూ కుష్టుపట్టిన చేతిరాత ప్రొఫెసర్లు, భ్రష్టులైన పాత్రికేయులను ప్రశ్నించేది ఒక్కటే.

మీకు దమ్ముంటే  పైన ఇచ్చిన శ్లోకాలు, వాటి అర్థాలు గణిత, ఖగోళ, భౌతిక శాస్త్రా ల ద్వారా ఖండించండి.   అలా చేయలేకపోతే మీరు ఈ దేశంలో అక్రమసంతానం అని ఒప్పుకోండి. ఇదే మా బహిరంగ సవాల్.

జ్యోతిష్యం అనేది పక్కా లెక్కలతో, గ్రహాల వివరణ, విశ్లేషణతో, భూమిపై గల జీవుల ప్రాణ, జనన మరణాది సంగతులతో గణాంక సంగతులు చెప్పే 64 కళల్లో ఒక శాస్త్రం. నేర్చుకుని చెప్పేవాళ్ళు వేరు పొట్టకూటికై జిమ్మిక్కులు చేసే వాళ్ళు వేరు.

ఈ ఆధునిక యుగంలో ఏ శాస్త్రాన్ని అయినా తేలికగా నేర్చుకునే అవకాశం ఉంది. కావలసింది శ్రద్ధ భక్తి పట్టుదల జీజ్ఞ్యాస మానవ ప్రయత్నం.

http://mathlearners.com

Vedic Mathematics https://g.co/kgs/QkWbrX

ధర్మో రక్షతి రక్షితః
జై హింద్
జై శ్రీరాం
మాతా భారతీ కీ జై

Like my PAGE "Satyamev A Jayate" 👍👍👍👍
https://www.facebook.com/dharmorakshatirakshitahanow/

Share

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP