శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

"కాటమరాజు " ప్రతిష్ఠ విషయమై కదలిక మొదలైంది.

>> Saturday, July 14, 2018

మా గ్రామం పక్కనే బుర్రిపాలెం ,పాతరెడ్డిపాలెం  జంట గ్రామాలున్నాయి. యాదవులు ఎక్కువ ఆగ్రామాలలో .. గతంలో నేను మేకపాడు లో పనిచేసేప్పుడు ఒక విషయం విన్నాను.  సమీపంలో ఉన్న కొండ పాదాలదగ్గర  కాటమరాజు ప్రతిష్ఠ జరిగి ఉన్నదని  అయితే కొన్నితరాలుగా అక్కడి ప్రాసస్త్యం మరచిపోయారు . ఆమధ్య కాలంలో పొలాలు బాగుచేస్తూ  ఒక రైతు  కంపచెట్లు నెట్టి మంత పెట్టాడని    విగ్రహాలు మంటలలో కాలడం ఆరైతు వంటిపై బొబ్బలు లేవటం తోపాటు   అతని కుటుంబంలో  ఒక దుర్ఘటన జరిగిందట . 
మేకపాడుకు చెందిన ఒక బ్రాహ్మణ స్త్రీ అప్పుడప్పుడు ఆవిగ్రహాలకు పసుపుకుంకుమ సమర్పించి నైవేద్యం పెడుతుందని చెప్పారు. 
నేను వెళ్ళి చూసొద్దామని అనుకుంటూనే ఏళ్ళు గడచిపోయాయిగాని     ...కుదర్లేదు.
తరువాత నేను తిమ్మాపురం ట్రాన్స్ఫర్ అవటం   తో విషయం పై ద్రుష్టి సారించలేదు. మధ్యలో  పదిసంవత్సరాల క్రితం  మాత్రం ఒకసారి   గంగదొనకొండ లో కాటమరాజు స్థాపిమ్చిన శక్తిపీఠం  గంగాభవాని  ఆలయం అర్చకులతో ప్రస్తావించాను . ఒకసారి మనం ఈవిషయం ఆలోచిద్దామని చెప్పాను . ఆయనకూడా వస్తానని చెప్పారు.
కానీ    ... కాలం   కలసి రాలేదు.
 నిరుడు నేను  బుర్రిపాలేనికే ట్రాన్స్ఫర్ అయ్యాను.   లేదు ఇక్కడికి రప్పిమ్చబడ్డానేమో అనుకుంటున్నాను.
గతంలో తిమ్మాపురంలో యువకుల  బలవన్మరణాలు ఎక్కువగా ఉండేవి . నేను తిమ్మాపురం వెళ్ళిన మొదటిరోజే అక్కడ హనుమంతులవారి ప్రతిష్ఠ జరగాలని బలంగా కోరుకున్నాను. నిజంగా ఆయన అనుగ్రహం.  నేను ట్రాన్స్ఫర్ అయ్యేముందు అక్కడ ప్రతిష్ఠ జరిపించగలిగాం.  అక్కడ స్వామి ఒక ఉపకరణం గా నన్ను వినియోగించారు .

ఇప్పుడు  బుర్రిపాలెం లో ఒక వారం క్రితం  ఈవిషయం ప్రస్తావించగా  గొప్ప స్పందన మొదలైంది . గొర్రెల కాపరలు కూడా అక్కడ పూర్వం   కాటమరాజు  శిలలు గొప్పగా పూజలందుకునేవని వారి తాతలు చెప్పేవారట. నేను స్కూల్ కి వెళుతుంటే దారిలో బండి ఆపి మరీ చెబుతున్నారు. మాష్టారూ ! మీరు ముందుండి ఈ విషయం  చూడండి అని కోరుతున్నారు.
రెండు గ్రామాల పెద్దలందరితో కలసి అమావాస్య తరువాత వెళ్ళి ఆ స్థలాన్ని దర్శిద్దామని చెబుతున్నాను.
ఈరోజు గంగదొనకొండ వెళ్ళి వచ్చాను  . అప్పుడు నేను మాట్లాడిన అర్చకుడు [యాదవులే] కాలం చేసారు. వారి అబ్బాయి అర్చకత్వ బాధ్యతలు స్వీకరించారు.   ఆయనకు విషయం చెప్పి  నేను పిలిచినప్పుడు రావాలని  కోరాను. ఆ అబ్బాయి సంతోషంగా ఒప్పుకున్నారు.

ఇక  ఈ కార్యక్రమం నల్లేరు మీద నడకలా ఏమీ సాగదు. ప్రతికూల శక్తులు బలమైన అడ్దంకులే స్రుష్టించే అవకాశాలూ ఉన్నాయి   . అవన్నీ కొద్దిరోజులాగాక మీకు తెలియపరుస్తాను. ముందుగా చెప్పకూడదు.
స్వామి అండగా ఉన్నాడుకదా  ...... భయం లేదు.

మీరు ఎక్కడా ప్రశాంతంగా ఉండరా ? అందరూ చక్కగా ఉద్యోగాలు మాత్రమే చేసుకుని వస్తుంటే  ,.... మీరెందుకు  అన్నీ   తెచ్చుకుని తలకెత్తుకుంటారు ????? అని మా ఆవిడ నసుగుతుంది.
కొందరికి కొన్ని బాధ్యతలు భగవంతుడు అదనంగా తలకెత్తుతాడు .... తప్పిమ్చుకుందామనుకుంటే కుదరదు  ..అని నవ్వుతూ  చెప్పాను.


0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP