రేప్ కాని రేప్ కథ*
>> Monday, May 14, 2018
*రేప్ కాని రేప్ కథ*
ఎం.వి.ఆర్.శాస్త్రి
'నన్ను ఎత్తుకుపోయింది మీ భక్తులు కాదు.. రావణుడు! కాబట్టి బతికిపోయా' అంటుంది సీతమ్మతల్లి రామచంద్రమూర్తితో! అమ్మవారి చేతిలో 'గుడిలో బాలిక మానభంగం' వార్త ఉన్న పత్రిక ఉంటుంది.
ఇదొక కార్టూను! దానిని వేసిన 'ది హిందూ' అనబడే హిందూ వ్యతిరేక ఆంగ్ల దినపత్రిక ఒక పత్రిక!!
ఇలాంటి ముదనష్టపు కార్టూను రోషం, పౌరుషం ఉన్న ఇంకో మతానికి చెందిన పవిత్రమూర్తులపై వచ్చి ఉంటే ఈ పాటికి దేశమంతటా పెద్ద అల్లరి అయ్యేది. చేసిన వెధవ పనికి ఆ మోతుబరి దినపత్రిక లెంపలేసుకుని ముక్కు నేలకు రాచి ఉండేది. హిందువుల చర్మం చాలా మందం కాబట్టి, తాము పవిత్రంగా, పూజించే దేవతామూర్తుల మీద, ప్రాణసమానమైన సెంటిమెంట్ల మీద ఎవడు ఎంత అఘాయిత్యం చేయబూనినా, వెంటనే చలించి తగిన శాస్తి చేసే మగటిమి ఈ కాలంలో హిందూ సమాజానికి కాస్త లోపించింది కాబట్టి, 'ది హిందూ' లాంటి హిందూ విద్వేష పత్రికలది,ఇతర మీడియాది ఆడింది ఆట అయిపోయింది.
నిజం చెప్పులేసుకునే లోపల అబద్ధం సగం ప్రపంచాన్ని చుట్టేస్తుందని సామెత. కథువా రేప్ కట్టుకథదీ ఇదే బాపతు. జమ్మూ దగ్గర కథువా ప్రాంతంలో రసనా అనే ఊళ్ళో పశువులు కాచే ముస్లిం సంచార జాతికి చెందిన ఎనిమిదేళ్ళ బాలికను హిందూ మతోన్మాదులు మరియు హిందూ నేషనలిస్టులు కూడబలుక్కుని, కుట్ర చేసి, ఆ ఊళ్ళోని ఒక దేవాలయంలో రోజుల తరబడి సామూహికంగా చెరచి, దారుణంగా చంపేశారని ఇవాళ దేశ దేశాల్లో పచ్చి అబద్ధం కోడై కూస్తున్నది. రేపిస్టులు వట్టి హిందూ మతోన్మాదులే కాదు; రామభక్తులు కూడానట! 'జైశ్రీరాం' అని నినదిస్తూ, జాతీయ జండాను ఊపుతూ వాళ్లు మైనర్ అమ్మాయిని వరసబెట్టి చెరిచారట! ఆ సంగతి ఏ సెక్యులర్ కర్ణపిశాచో, మరో అక్కుపక్షో మన వీర సెక్యులర్ మీడియా చెవిలో ఊది, సవిస్తరంగా కళ్ళకు కట్టించిందట. కల్లబొల్లి పత్రికల్లో, ఎర్రకామెర్ల టీవీ చానెళ్ళలో ఉత్పత్తి అయి, హిందూ ద్వేషులైన జాతి వ్యతిరేక శక్తులకు అమందానందం కలిగించిన ఈ కట్టుకథ క్రమపద్ధతిన ప్రపంచానికి పాకింది. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరలు, అంతర్జాతీయ సంస్థల పెద్ద దొరలు, అమెరికా, జర్మనీ తక్కుంగల దేశాల్లోని పేరు గొప్ప పత్రికలూ, మీడియా గుడారాలూ ఈ సంగతే మాట్లాడుతూ, హిందూ ప్రజానీకానికి ఎడాపెడా క్లాసులు పీకడం సూడో సెక్యులర్ రాకాసి మూకలకు పసందైన విందు!!
' అబద్ధాల అంకయ్యకు అరవై నాలుగు అసత్య ప్రమాణాలు' అన్నట్టు జరగని అత్యాచారానికి కావలసినన్ని అబద్ధపు సాక్ష్యాలు! కథువాలో మైనర్ బాలిక మీద జరిగింది రేప్! రేప్! అని కుట్ర కాకులు ఎంతలా కావ్ కావ్ మంటున్నా, ఆ అమ్మాయిపై అసలు అత్యాచారం జరిగిన ఆనవాళ్ళే లేవని రెండు పోస్ట్‌మార్టం రిపోర్టుల్లో సర్కారీ డాక్టర్లే చెప్పారు. మహబూబా ముఫ్తీ అనే మహాసాధ్వి చెప్పుచేతల్లోని కాశ్మీరీ పోలీసులు స్పెషలార్డరుమీద బనాయించిన తప్పుడు
చార్జిషీట్లో ఆ బాలికను అనేక రోజులు ఫలానా గుడిలో బంధించి గ్యాంగ్ రేప్ చేసినట్టు నిందమోపారు.
నిజానికి సదరు 'దేవీస్థాన్' గుడి కాదు. పెద్ద గది. పోలీసులు కనిపెట్టినట్టు దానికింద రహస్య నేలమాళిగ ఏదీ లేదు. కులదేవతల పవిత్ర చిహ్నాలు ఉండే ఆ మందిరానికి మూడు తలుపులు, నాలుగు కిటికీలు ఉన్నాయి. లోపల ఏమి జరుగుతున్నదీ బయటివారికి ఎటు నుంచైనా కనపడుతూనే ఉంటుంది. మూడు ఊళ్ళ నుంచి భక్తులు రోజూ అక్కడికి వచ్చిపోతుంటారు. గ్యాంగ్ రేప్ మహత్కార్యం జరిగినట్టు చెప్పబడుతున్న జనవరి 10-15 మధ్య సంక్రాంతి సహా
మూడు పెద్ద ఉత్సవాలు అక్కడ జరిగాయి. వందలమంది అక్కడ చేరి భోజనాలు చేశారు. పోలీసు చార్జీషీట్లో చెప్పినట్టు ఆ మందిరంలో ఓ చిన్న బల్ల కింద ఎనిమిదేళ్ళ అమ్మాయి నోట్లో గుడ్డలు కుక్కి ఎవరి కంటబడకుండా బంధించి ఉంచగలగటం కలలో మాట. రోజూ ఊడ్చి, నీళ్ళతో కడిగే దేవీస్థాన్‌లో తరువాతెప్పుడో బాలిక తలవెంట్రుక ఒకటి దొరికినట్టు చూపెట్టి.. ఆ వెంట్రుక ఆధారంతో సామూహిక మానభంగం అక్కడే జరిగిందని ఆరోపించటం అర్థంపర్థం లేని అభూత కల్పన!
రసనా ఊరిని ఆనుకునే పెద్ద అడవి ఉంది. గుర్రాలని మేపటానికి అడవికి వెళ్ళిన బాలికను ఎవరైనా పాడు చేయదలిస్తే ఆ పాపిష్టి పని ఏదో అడవి మాటునే కానిస్తారు కాని, ఊళ్ళోకి తీసుకొచ్చి మరుగులేని, అందరికీ కళ్ళబడే పవిత్ర మందిరాన్ని ఆ పైశాచిక కృత్యానికి మనిషన్నవాడెవడూ ఎంచుకోడు. అలాగే- మతి ఉన్న ఏ హంతకుడైనా శవాన్ని
ఎవరికంటా పడకుండా ఊరవతల అడవిలో పారవేస్తాడే గాని, సరిగ్గా తన ఇంటి వెనక పడవేసి తన గొంతుకు తానే ఉరి బిగించుకోడు.
ఈ చిన్న కామన్‌సెన్స్ పాయింటు కూడా శ్రీనగర్ పోలీసుల మట్టి బుర్రలకు తట్టలేదు. సాంఝీరామ్ అనే ఆసామి, ముస్లిం సంచార జాతిని భయవిహ్వలురను చేసి, ఊరినుంచి వెళ్ళగొట్టాలని తలపెట్టి, ఆ బకర్వాల్ జాతికి చెందిన బాలికను ఎత్తుకొచ్చి, ఏరి కోరి గుడిలో బంధించి, సామూహిక మానభంగం చేసి, చంపేసే డ్యూటీని విశాల్ అనే తన కొడుకుకి, తన ఇలాకాలోని మరికొందరికి అప్పగించాడని పోలీసుల కథనం. సామూహిక మానభంగానికి వేదిక అయిన దేవీస్థాన్‌కీ, తన ఇంటికీ నడుమ ఉన్న మట్టిదారి పక్కన బాలిక శవాన్ని ఆ సుపుత్రుడు పడవేసి, ఆ సాయంత్రం ఊరొదిలి పరారయ్యాడనీ సర్కారీ అభియోగం.
ఇది ఇంకో పెద్ద అబద్ధం. విశాల్ జంగోత్ర అనే ముద్దాయి జనవరి 15న కథువాలో శవాన్ని పారవేసే పనిలో బిజీగా ఉన్నాడని పోలీసులు చెబుతున్న సమయాన అతడు 600 కిలోమీటర్ల దూరంలోని ముజఫర్‌నగర్‌లో మీరట్ యూనివర్సిటీ బి.ఎస్సీ పరీక్ష రాస్తున్నాడు. అతడు రాసిన పరీక్ష పేపర్లు కాలేజివాళ్ళు చూపెట్టారు. వేరెవరో అతడి పేరున పరీక్ష రాసి ఉండొచ్చన్న అనుమానానికి తావు లేకుండా సి.సి.కెమెరాలో అతడి మొహాన్నీ కాలేజి అధికారులు గుర్తుపట్టారు. అంతేకాదు, కథువాలో నేరస్థలంలో అతడు ఉన్నాడని చెబుతున్న సమయాన ఆ కుర్రవాడు ముజఫర్‌నగర్‌లోని స్టేట్‌బ్యాంక్ ఏటీఎంలో డబ్బులు తీసుకున్నట్టు సి.సి.కెమెరాలో రికార్డు అయింది. ఎ.టి.ఎం. స్లిప్పునూ ఒక టీవీ చానల్ బయటపెట్టింది.
మానభంగం మిథ్య
మందిరంలో నేరం మిథ్య
నేరస్థలంలో నిందితుడు ఉండటం మిథ్య
-అనడానికి ఇన్ని తిరుగులేని సాక్ష్యాలు బయటికొచ్చినా, ఇంకా కథువా గుడిలో మైనర్ బాలిక మీద రామభక్తులు, హిందూ జాతీయవాదులు త్రివర్ణ పతాకం ఊపుతూ, జైశ్రీరాం అంటూ గ్యాంగ్‌రేప్, దారుణ హత్య ఘాతుకాలు పాల్పడ్డారనే దుష్ప్రచారం తెరపి లేకుండా సాగుతూండటం దుర్మార్గం. జమ్మూలో జరిగిన హత్యానేరాన్ని పరిశోధించటం జమ్మూ పోలీసులకు చేతకాదని మహబూబమ్మ సర్కారు నిశ్చయించి, శ్రీనగర్ క్రైంబ్రాంచికి దర్యాప్తు పని అప్పజెప్పడమేమిటి? పదిరోజుల తేడాలో మూడు దర్యాప్తు బృందాలను ముగ్గులోకి దించటమేమిటి? అందులోనూ లాకప్ డెత్, మైనర్ బాలిక మానభంగం, సాక్ష్యాలను తుడిచిపెట్టటం అనే తీవ్ర నేరాలకు పాల్పడి, సస్పెండై, జైలుకు కూడా వెళ్ళిన పోలీసు ఆఫీసర్లకు ఏరికోరి ఈ కేసు అప్పగించటమేమిటి ? హిందూ, ముస్లిం తేడా లేకుండా స్థానిక 5ప్రజలు, జమ్మూ బార్ కౌన్సిలు ముక్తకంఠంతో కోరుతున్నా ఈ కేసును సిబిఐకి అప్పజెప్పడానికి రాష్ట్ర సర్కారు
ససేమిరా అనడంలోని మర్మమేమిటి?
జనవరి 10 న అడవిలోకి వెళ్ళిన అమ్మాయి తిరిగి రాలేదని ఆ రోజే కన్నవాళ్ళు ఫిర్యాదు చేస్తే వేగిరం కదిలి సకాలంలో ఆమెను రక్షించే ప్రయత్నం చేయకుండా వారం తరువాత ఆమె శవం బాట పక్కన కనిపించే దాకా నిమ్మకు నీరెత్తినట్టు ఊరుకోవటం పోలీసుల మొదటి తప్పు. శవమై కనపడ్డ తరువాతయినా ఆమెకు ఏమయింది, ఎవరు చంపారు, దాని
ఎవరున్నారు అన్నది తిన్నగా కూపీ తీయకుండా, ఖూనీ కేసులో ఎవరిని ఇరికించాలి, తప్పుడు సాక్ష్యాలు ఎలా పుట్టించాలి అన్న వాటిమీద దృష్టిపెట్టి, చిత్రహింసలతో బలవంతపు వాఙ్మూలాలు రాబట్టి కట్టుకథలల్లడం సర్కారు వారి రెండో తప్పు. గజానికొక గాంధారి కొడుకు ఉన్న లోకంలో రోజూ ఏదో ఒక మూల ఎవరో ఒక అతివ అత్యాచారానికి గురి అవటం మామూలైపోయింది. కామంతో కన్నుకానని నరపిశాచులెవరో ఎక్కడో చేసిన ఒక ఘాతుకానికి మొత్తం హిందూ సమాజాన్ని, హిందూ మతాన్ని, వారి భక్తి విశ్వాసాలను ముద్దాయిలాగా చూపెట్టేందుకు సర్కారు ప్రోద్బలంతోనే కుతంత్రాలు సాగడం అన్నిటికంటే ఘోరం. ఇన్నాళ్ళూ లేనిది ఇప్పుడే హఠాత్తుగా జమ్మూలో హిందువులను బద్నామ్ చేసే కూహకాలు ఎందుకు సాగుతున్నాయి అన్నది జాతి జనులందరూ సావధానంగా ఆలోచించాలి.
అత్యాచార బూటకానికి కేంద్ర స్థానమైన కథువా ప్రాంతం, అందునా రసనా గ్రామం అంతర్జాతీయ సరిహద్దుకు చాలా దగ్గరలో ఉన్నాయి. రసనా ఊరు అవతల ఏరు దాటితే పాకిస్తానే. సరిహద్దు ఆవలి నుండి జిహాదీలు, పాకిస్తానీ ఏజెంట్లు మనవైపు చొరబడటానికి ఈ దారి బాగా పనికొస్తుంది. కాని పొలిమేరల్లోని హిందువులు, బకర్వాల్ వగైరా సంచార జాతుల ముస్లింలు అప్రమత్తంగా ఉండి చొరబాటుదారుల కదలికలను కనిపెడుతూ, భారత సైన్యానికి కళ్ళూ చెవుల్లా పనిచేస్తూండటంతో జాతి శత్రువుల ఆగడాలు అక్కడ సాగడంలేదు. జమ్మూవైపు సరిహద్దుల నుంచి హిందువులను తరిమివేయగలిగితే పాకిస్తానీ తొత్తులకు పండుగే. కాశ్మీర్ లోయ నుంచి లక్షలాది హిందువులను కట్టుబట్టలతో రాక్షసంగా వెళ్ళగొట్టిన దరిమిలా పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి మనవైపు జిహాదీల చొరబాట్లు ధారాళంగా సాగుతున్నాయి. కాశ్మీర్ లాగే జమ్మూ నుంచీ హిందువులను గెంటేయగలిగితే జాతి శత్రువులు కోరే 'ఆజాదీ' కి విద్రోహపుబాట మరింత చక్కబడుతుంది.
బర్మా నుంచి తగులడ్డ రోహింగ్యాలను మహబూబా ప్రభుత్వం కడుపులో పెట్టుకుని కాపాడుతూ కడుజాగ్రత్తగా ఆర్మీ క్యాంపులు, రైల్వేస్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, ముఖ్యమైన వంతెనలు వంటి కీలక ప్రాంతాల్లో పునరావాసం కల్పించి పాలుపోసి పెంచుతున్నది. మిలటరీ స్థావరాలపై జరుగుతున్న జిహాదీల దాడులకు అక్కడికి దగ్గరలో చేరిన రోహింగ్యాలు గుంభనంగా సహాయ పడుతున్నారన్న అనుమానాలు చాలా ఉన్నాయి. హిందువులతో కలిసిపోయి శాంతియుతంగా బతుకుతున్న ముస్లిం సంచార జాతులకీ, హిందువులకూ మధ్య చిచ్చుపెట్టి, మెల్లిగా రోహింగ్యాలనూ జమ్మూ సరిహద్దుల చేరువకు చొరబడినిస్తే తమ రొట్టె విరిగి నేతిలో పడుతుందని పాకిస్తానీ ఏజంట్లూ, కాశ్మీర్ విద్రోహ వర్గాలూ తలచటం సహజమే. ఈ దృక్కోణం నుంచి 'కథువా అత్యాచారం' పాపాన్ని హిందువుల మెడకు చుట్టడానికి పథకం ప్రకారం పడుతున్న అడుగుల వెనుక భయానక జాతి వ్యతిరేక కుట్ర లీలగా పొడగడుతుంది.
ఇదంతా ముఖ్యమంత్రమ్మ మహబూబా ముఫ్తీయే కావాలని చేయిస్తున్నదనీ, జమ్మూ కాశ్మీరి రాష్ట్ర ప్రభుత్వానికి ఇలాంటి జాతి విద్రోహ కుట్రల్లో భాగం ఉన్నదనీ చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. రుజువు లేనప్పుడు అభియోగం మోపడం తప్పు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన, అందులోనూ జాతీయవాది భాజపా భాగస్వామి అయిన రాష్ట్ర సర్కారుపై బాధ్యతారహితంగా నిరాధార నిందలు మోపడం తగదు అనడంలో రెండో మాటకు తావు లేదు.
అదే సమయంలో కథువా కట్టుకథ, అది తిరిగిన మలుపులు, వాటిపై అంతర్జాతీయంగా జరుగుతున్న రభస, మొత్తం హిందూ సమాజాన్ని దోషిగా నిలబెట్టేందుకు పథకం ప్రకారం సాగుతున్న కుతంత్రాలు, ఈ వరస ఇలాగే కొనసాగితే జాతి ఐక్యత, సమగ్రత, దేశ భద్రతలపై పడగల దుష్ప్రభావాలు అన్నిటినీ సాకల్యంగా గమనిస్తే దేశభక్తి, జాతీయ దృష్టి ఉన్న ఆలోచనాపరులందరికీ తీవ్రాందోళన కలుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం మీద తప్పులెంచి, బోనెక్కించడం కాదు. తెలిసో తెలియకో, బుద్ధి పూర్వకంగానో యాదృచ్ఛికంగానో కీలక సరిహద్దు రాష్ట్రంలో అధికార యంత్రాంగం వరస తప్పుల వల్ల వాటిల్లిన అనర్థాన్ని ఎలా సరిదిద్దాలి, జాతీయ ఐక్యతకు, ప్రాదేశిక సమగ్రతకు పొంచి ఉన్న ముప్పును ఎలా నివారించాలి అన్నదే మునుముందుగా ఆలోచించాల్సింది.

2 వ్యాఖ్యలు:
నిజమే నమ్మబుద్ధి కాలేదు . అబద్దమనే అనిపించింది వార్త రాగానే.
ఎలక్షన్లు రాబోతున్నాయి కదా , ముస్లిం ఓట్ల కోసం వేసిన పన్నాగం లా ఉంది.
హిందు పేరు పెట్టుకున్న స్యూడో సెక్యులర్ కుక్క పత్రికను చెప్పుతో కొట్టాలి. ఆ పత్రికను హిందువులు బహిష్కరించాలి.
Post a Comment