శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అన్న సూక్తము” “అన్నదాన మహిమ

>> Sunday, April 8, 2018

“అన్న సూక్తము” “అన్నదాన మహిమ
(నీతి కథలు).
🌏ఓంశ్రీమాత్రేనమః🌍.


“అన్నమ్ న పరిచక్షీత”-
అన్నమును దొంగిలించకు. ఎందుకనగా, అన్నము పరమాత్ముని యొక్క రూపం. అన్నములో అతని తేజస్సు నిండియున్నది. అన్నమును ఒకరి నుండి దాన రూపములో స్వీకరించాలే గానీ దొంగిలించ రాదు. ఇక్కడ మరొక్క విశేషం తెలియవలెను. అన్నమును దొంగిలించుటతోబాటు అమ్ముట కూడా పాపకరమైన కార్యమే. నేడు వీధికి వంద సంఖ్యలో అన్నవిక్రయశాలలు ఉన్నవి.

ఇందులో వండబడినవి రుచికరమైనప్ప టికీ మంచి జ్ఞానమును పెంపొందింపలేవు. ఎందుకన గా, మొదటగా ఆ వంటలు భగవంతునికి నివేదింప బడవు. రెండవదిగా వంట వాళ్ళు దేహశుచిని పాటిస్తారేమో గానీ ఆత్మశుచిని పాటించుట అరుదే.కల్మషమైన మనసుతో వండు పదార్థము లలో సూక్ష్మమైన రూపములో కలిపురుషుడు ప్రవేశిస్తాడు. అలాంటి అన్నపదార్థములను తిన్నవారిలో కూడా కలిపురుషుని ప్రభావము ఎక్కువగును. వాని ప్రభావ తీవ్రతతో మనుష్యులలోకామ, క్రోధ, లోభాది అరిషడ్వర్గాలు పెరిగి చివరకు మొత్తము సమాజము కలుషితమై, కష్టాల పాలగును. ఇలాగున, మనలను కలిబాధ నుండి తప్పించేందుకే వేదములు ప్రాకులాడుచున్నవని ఈ సూక్తము ద్వారా ప్రజలు గ్రహించగలరు. వేదజ్ఞానము ప్రజాహితమునే కోరుతున్నది గానీ ప్రజలను మూఢులను చేయుటలేదు కదా!

“అన్నమ్ బహు కుర్వీతా” – అన్నమును అనేక విధములు గా సన్మానింపవలెను. ఎందు కనగా, అన్నము పంచ భూతములనూ, పంచతన్మాత్ర లనూ తనలో ఇముడ్చు కొన్నది. అన్నము భూమిలో పండును. అది పండుటకు వర్షము కావలెను. వాతావరణములో సరియగు వేడి ఉండవలెను. అన్నము వలనే పంచప్రాణములూ (పంచవాయువులు) తృప్తినొందును. అన్నములో చక్కటి గంధము (వాసన) ఉన్నది. అన్నములో “రుచి”యను స్పర్శవిశేషము న్నది. అన్నములో పరమాత్ము ని రూపమున్నది. అన్నములో “అమృతము” అను రసము న్నది. ఈ విధముగా పంచ భూతములు మరియు తన్మాత్రలను కలిగిన అన్నము ను మనము పవిత్రభావనతో చూడవలెను.

లోకంలో ఏ వస్తువునైనా దానం చేయవచ్చు. కానీ అన్నం శ్రేష్టమైనది. 84లక్షల జీవరాశుల్లో ఒక్కో జాతికి ఒక్కో ప్రత్యేక ఆహార విధానం పరమేశ్వరుని ద్వారా నిర్ణయించబడి ఉంటుంది. అందుకే ఆయనకు పూజ చేసేటప్పుడు ఉపవాసం చేపట్టాలంటారు. అలా ఉపవాసం చేసి…పరమేశ్వరునికి నైవేద్యం చేయడం ద్వారా…ఉపవసించిన వ్యక్తి పరమేశ్వరునికి నైవేద్యం పెట్టిన ఆహారం సకల జీవులకు చేరుతుందని విశ్వాసం.

ఓ వ్యక్తి ఉపవాసం ఉండి పరమేశ్వరుని పెట్టే నైవేద్యాన్ని... పరమేశ్వరుడు తాను మాత్రమే స్వీకరించకుండా తాను సృష్టించిన 84లక్షల జీవరాశులకు పంచిపెడతాడని పురాణాలు చెప్తున్నాయి. ఇక శుభకార్యాలు చేసేటప్పుడు అన్నదానాన్ని చేయాలి. అన్నం లేకుండా ఏ జీవరాశి బతకలేదు. అందుకే ఆకలి బాధతో ఉన్నవారికి అన్నదానం చేయడం ద్వారా శుభఫలితాలు లభిస్తాయి.

అన్నదానానికి మించింది లేదని పెద్దలు అంటారు. ధనం, బంగారం దానం చేస్తే దానంగా పొందే వ్యక్తి మరింత అధికంగా ఆశిస్తాడు. అదే అన్నాన్ని దానం చేస్తే కడుపు నిండిన తర్వాత అధికం ఆశించడు. అన్నదానాన్ని చేస్తే భవిష్యత్తులో రాబోయే కార్యక్రమాలను శుభఫలితాలను ఇస్తుంది. అన్నదానం చేయడం ద్వారా దంపతుల అన్యోన్యత పెరుగుతుంది అభిప్రాయభేదాలు తొలగిపోతాయి. అందుకే పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాల్లో అన్నం పెడతారు. అలా శుభకార్యాల్లో అన్నాన్ని దానంగా పెట్టడం ద్వారా దంపతులకు మేలు జరుగుతుంది. కడుపారా భుజించిన వారి నోట వచ్చే శుభమైన మాటలు కొత్త వధూవరులకు ఆశీర్వాదంగా మారుతాయని పండితులు చెప్తున్నారు.

అన్నదానం మహిమ చెప్పే కథ.

      ఒక కథ ప్రకారం పూర్వ కాలంలో ఒక బ్రాహ్మణుడు కాశీ యాత్రకు బయలుదేరాడు. ఆ రోజుల్లో ప్రయాణ సాధనాలు, సరైన రహదారి వ్యవస్థ ఇంతగా లేనందున కాశీ చేరడానికి వారున్న ప్రాంతాలను బట్టి కొన్ని నెలలు ప్రయాణించాల్సి వచ్చేది. యాత్రికులు మధ్యలో గ్రామాల్లో రాత్రిళ్లు బస చేస్తూ వెళ్లేవారు.

ఈ బ్రాహ్మణుడు ఏదో ఆలస్యం కారణంగా చీకటిపడే సమ యానికి తాను వెళ్ళవలసిన గ్రామానికి చేరుకోలే పోయాడు. చీకటిపడింది. ఏమి చేయాలో తోచలేదు. అయితే అదృష్టవశాత్తు ఒక కోయవాని ఇల్లు కనబడింది. అక్కడ ఆశ్రయం కోరాడు. శంబరుడు అనే ఆ కోయవాడు ఆశ్రయం ఇవ్వడానికి ఒప్పుకుని తన వద్ద ఉన్న వెదురు బియ్యం, తేనె తినడానికి ఇచ్చాడు. తన కుటీరం చిన్నదైనందున దానిలో పడుకోమని, తాను బయట కాప లాగా ఉంటానన్నాడు. అర్ధరాత్రి ఒక పులి అతనిపై అదను చూసి దాడి చేసి చంపి వేసి దేహాన్ని తీసుకుపోయింది. బ్రాహ్మణుడు బిక్క చచ్చిపోయాడు. కోయవాని మరణానికి చింతించి తన దారిన తాను వెళ్లాడు.

కాశీ చేరాడు. దైవ దర్శనం చేసు కున్నాడు. ఈ బ్రాహ్మణునికి ఎప్పటి నుంచోె అన్న దానం అంత గొప్పదా అన్న అను మానం ఉండేది. తన ఇష్ట దైవమైన విశ్వేశ్వరుడు ఆ సందేహం తీరిస్తే బావుండునని అనుకున్నాడు. ఆ రోజు రాత్రి విశ్వేశ్వరుడు అతనికి కలలో కనిపించి నువ్వు తిరుగు ప్రయాణంలో ఒక రాజ్యం మీదుగా వెడతావు. అక్కడి రాజుకు ఒక పుత్రుడు జన్మించి ఉంటాడు. ఆ శిశువును ఏకాంతంగా ఆశీర్వ దించు అని చెప్పాడు. ఎందుకో చెప్పలేదు. బ్రాహ్మణుడు అలాగే చేశాడు.

రాజ కుమారుణ్ణి ఏకాంతంగా ఆశీర్వదించేందుకు వెళ్లాడు. చంటి పిల్లవాడైన ఆ రాజకుమారుడు ఈ బ్రాహ్మ ణున్ని చూసి నవ్వి, ఓయీ బ్రాహ్మణా, నన్ను గుర్తు పట్టావా. నేను కోయవాణ్నౖన శంబరుణ్ని. నీకు ఒక్క రాత్రి అన్నదానం చేయడం వల్ల ఈ జన్మలో నాకు రాజ యోగం సిిద్ధించింది అన్నాడు. మరు క్షణం అతనికి మళ్లిd పూర్వజన్మ జ్ఞానం నశించి మామూలు శిశువుల మాదిరి ఆడుకోవడం మొదలెట్టాడు. బ్రాహ్మణుని సంశయం తీరింది. అది ఎలా ఉన్నా అన్నదాన మహిమ ఎంతటి గొప్పదో ఈ కథ చెబుతుంది.

అన్నం గురించి ఓ ఉపాఖ్యానం వుంది.

అన్నం వండేవారు ఏ మనస్సుతో, ఏ భావంతో వండుతారో, దాని ప్రభావం ఆ అన్నం మీద , దాన్ని తినేవారి మీద కూడా ఉంటుంది. అందుకనే దేవుడికి నైవేద్యం వంట చేసేవారు కనీసం దాని రుచిని ఆఘ్రాణించను కూడా ఆఘ్రానించరు. అలా మనసా, వాచా, కర్మణా కూడా తయారైన నైవెద్యాన్ని దేవుడికి నివేదించడం వల్ల దాన్ని దేవుడు ఆరగించటంవల్లే నైవేద్యానికి అంత రుచి వస్తుంది.

వంట చేసేవారు కోపంగా, విసుగ్గా వంట చేస్తే, ఆ వంటకాలకు సరైన రుచి రాకపోగా, దాన్ని భుజించిన వారి మనస్సు కూడా కోపతాపాలకు నిలయమవుతుంది. అందుకే వంట చేసేటప్పుడు ఆ వంట చేసేవారు మానసికంగా ప్రశాంతంగా, సంతోషంగా వంటచేస్తే, దానికి రుచితోపాటు ఆ వంట తిన్నవారి మనస్సులు సంతోషంగా వుంటాయన్నది పూర్వూకుల విశ్వాసం.

లోకంలో మానవులు దాత, అదాత అని రెండు రకాలుగా వుంటారు. ఇతరులకు అన్నం దానం చేసి తాను తినేవాడు దాత. ఇతరులకు దానం చేయకుండా విషపూరితమైన అన్నాన్ని తినేవాడు అదాత. దాతకు కాలంతరాన అన్నం లభిస్తుంది. అదాతకు కాలాంతరాన అన్నం లభించకపోగా, అగ్ని నశింపచేస్తాడని తైత్తిరీయబ్రాహ్మణం వివరిస్తుంది.

ఇతరులకు అన్నం పెట్టకుండా తానే తింటే, ఆ అన్నం విషంతో సమానం. దాత, అదాత ఇద్దరూ అన్నసంపాదనకు ప్రయత్నిస్తారు. కాని దాత ఇతరులకు దానం చేయడం కోసం అన్నం సంపాదిస్తాడు. అది ఉత్కృష్టమైనది. అదాత తాను తినడంకోసమే సంపాదిస్తాడు. అతను పాపాత్ముడు అని శ్రుతి పేర్కొంటోంది.

అన్నం దేవతే కాకుండా మృత్యురూపమైంది కూడా. మనం తినే అన్నాని బట్టే మనకు రోగాలు, ముసలితనం లభిస్తాయి. అన్నమే సంతానోత్పత్తికి కారణమని కూడా చెపుతుంది ఆయుర్వేదం. కాబట్టి ఇంత మహిమగల అన్నం ఇతరులకు పెట్టకుండా తాను మాత్రమే తినేవాడు ఒక రకంగా విషాన్ని భుజిస్తున్నట్టే.

యజ్ఞయాగాది క్రతువుల్లొ అగ్నికి ఆహుతి చేసే అన్నం 'మేఘం' అవుతుంది. అన్నమే మేఘం. సూర్యుడు తన కిరణాలచే భూమిమీదున్న నీటిని స్వీకరించి ఔషధులను, అన్నాన్ని సృష్టిస్తున్నాడు. ఆ అన్నంతోనే ప్రాణులన్నీ జీవిస్తున్నాయి. శరీరం బలాన్ని సంపాదిస్తుంది. ఆ బలంతోనే తపస్సు చేయగలుగుతున్నారు.

పరిశుద్ధమైన , ఏకాగ్రమైన మనస్సుగలవారికి తపస్సు సత్ఫలితాలనిస్తుంది. ముందు మేధస్సు, తర్వాత శాంతి, జ్ఞానం, విజ్ఞానం, ఆనందం, పరమానందం లభిస్తాయి.

కాబట్టే ఇన్నింటినీ సమకూర్చే అన్నదానం వల్ల సర్వ వస్తువులనూ దానం చేసిన ఫలితం వస్తుంది.

From watsap

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP