శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఈ రహస్య విజ్ఞానం ఎక్కడిది

>> Saturday, January 13, 2018

ఈ రహస్య విజ్ఞానం ఎక్కడిది ?

 టిబెట్ సరిహద్దు ఆనుకొని నేపాల్ లో ధవళగిరి అనే పర్వత ప్రాంతం ఉన్నది. అక్కడ మన్‌ధాంగ్ అనే ఒక బౌద్ధ విహారం ఉన్నది. కొన్ని వేల సంవత్సరాల క్రితం మన భారతీయ ఋషులు దానిని మనుధామం అని పిలిచేవారు. మన వాళ్లు  ఆ ప్రాంతాన్ని ఏనాడో మరచి పోయారు. ఇప్పటికీ అక్కడి నేపాల్ ప్రజలు దసరా పండుగను మహాట్టహాసంగా జరుపుకుంటారు. దుర్గా మాతను హనుమంతుడినీ శ్రద్ధగా పూజిస్తారు. మహర్నవమి నాడు మాత్రం భగవాన్ విశ్వకర్మను పూజిస్తారు. అది వారి సాంప్రదాయం.  సా.శకం 1951 లో చైనా దృష్టి టిబెట్ మీద పడింది. 1959 లో చైనా ఎఱ్ఱ సైన్యం  టిబెట్ ను పూర్తిగా ఆక్రమించింది. టిబెట్ వదిలి బౌద్ధ సన్యాసులంతా వెళ్లిపోవ సాగారు. సరిహద్దులో ఉండటం వల్ల మన్‌ధాంగ్ విహారం లోని బౌద్ధ సన్యాసి తన అనుచరులతో కలిసి వెళ్లి పోతుండగా
ఒక సి.ఐ.ఏ ఏజెంట్ వారిని అనుసరించాడు.  ఆ బౌద్ధ సన్యాసి వద్ద ఒక బరువైన చక్కపెట్టె ఉన్నది. దానిలో అద్భుతమైన లోహ విగ్రహం దాయబడి ఉంది.  దాని కథే ఈ వ్యాసం లో ప్రధానాంశం.
"A heavy chest containing a 47 gram metal alloy idol was  given to CIA officials for safekeeping at Lo Monthang  (called “Mustang” in CIA files) by a Tibetan monk accompanied by Khampa bodyguards in 1959.   The monk apparently verbally told CIA officials the importance of the chest and its contents which the CIA wrote down
The chest was kept in a CIA store-room in Washington DC labeled “ST Circus Mustang-0183” in the army base of Camp Hale , near Vail , Colarado. When they opened the chest an ancient manuscript was found with the idol inside .
The chest was so magnificent that it provoked lot of excitement and curiosity.  This heavy metal-lined wooden chest had a socket-and-pivot hinged lid and an ancient loop-and-rod lock assembly.  It was a cubical box of more than 8 inch square.  The teak box wood was 6 inches thick."- Capt. Ajith Vadakayil.
 " ఇందులో అతి పురాతనమైన కల్ప రసాయన విగ్రహం ఉంది. దానిని ఒక రాగిపాత్రలో జలం లో తొమ్మిది రోజులపాటు ఉంచి ఆ జలాన్ని మూడు రోజుల పాటు సేవిస్తే మనుషులు నూటపది సంవత్సరాల పాటు ఆరోగ్యంగా జీవించ వచ్చు. ఈ పెట్టెను మీవద్ద భద్ర పరచండి !" అని ఆ బౌద్ధ సన్యాసి CIA వాళ్లకు inform చేయటం జరిగింది. అతని స్టేట్ మెంట్ ను వాళ్లు రికార్డు చేసుకున్నారు. చాలా బరువైన ఆ పెట్టెను  CIA  వాళ్లకు అప్పగించేసి ఆ సన్యాసి తన బాడీ గార్డ్స్ తో సహా వెళ్ళి పోయాడు
 ఆ పెట్టె మూలలకు పువ్వుల డిజైన్ తొ మందపాటి లోహపు రేకు తాపడాలున్నాయి. పెట్టె లోపల కూడా రేకు తాపడాలున్నాయి  అందులో ఒక త్రిలోహ/పంచలోహ విగ్రహం ముత్యపు చూర్ణం తో మెరుగు పెట్టినట్లు మెరుస్తూ కనిపించింది.  ఇంచు మించు నలభై ఏడు గ్రాముల బరువున్న అనంత శయన విష్ణు విగ్రహం అది. ఆ విగ్రహం తో పాటు వారికి అర్థం కాని అత్యంత ప్రాచీన లిపిలో కొన్ని మాటలు లిఖించబడిన ఒక కొయ్యపలక కూడా ఉన్నది. వాళ్లు చాలా కష్టపడి అందులో " కల్పరసాయనామృత విగ్రహం" అని వ్రాసి ఉందని తెలుసుకో గలిగారు. తరువాత ఆ పెట్టెకు ST ముష్టాంగ్ - 0183 అని ఒక కోడ్ నంబర్ అలాట్ చేసి టెస్టులు మొదలు పెట్టింది సి.ఐ.ఏ ప్రత్యేక విభాగం. ఆ విగ్రహం ను కార్బన్ డేటింగ్ కోసం ల్యాబ్ కు పంపించారు. All were carbon dated ( C14 ) by the University of California Radiation Laboratory, Berkeley . కార్బన్ డేటింగ్ పరీక్షలో అది క్రీ.పూ.26,450 సంవత్సరాల క్రితంది అని తేలటం తో అందరూ షాక్ అయ్యారు.  దానితో ఆ విగ్రహ విషయం లో  అప్పటి సి.ఐ.ఏ డైరెక్టర్  జాన్ మాక్ కోన్ (John McCone)  ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం జరిగింది. CIA had targeted for consumption of the “charged” Kalpa Vigraha water back in 1960-61. సన్యాసి చెప్పింది నిజమో కాదో పరీక్షించటానికి ఒక వాటరింగ్ టీమ్ ను ఏర్పాటు చేసి 1960-61 లో రహస్యం గా కొందరు ప్రత్యేక వ్యక్తులతో వారికి తెలియకుండా రాగి పాత్రద్వారా లభించిన విగ్రహ జలాన్ని త్రాగించటం జరిగింది.
All persons subjected to the Kalpa Vigraha experiment were expected to live very long lives, past the age of 110 at least.  The entire lot in the diary had lived beyond 110, some even to 120,  except four names, that of Ruth Golonka, Willie Lee Morgan, Steven Martin and Bert Jenkins were found to be of people who had died “accidentally”.  Ruth Golonka, died of a car accident, Willie Lee Morgan was murdered. Both Steven Martin and Bert Jenkins had died in Vietnam- Capt. Ajith Vadakayil. అలా త్రాగిన వారిలో  అందరూ నూటపది సంవత్సరాల పైగా  జీవించారు. నలుగురు వ్యక్తులు మాత్రం యాక్సిడెంట్ ల లో చనిపోవటం, ఒకరు వియత్నాం యుద్ధం లో చనిపోవటం జరిగింది.  1966 లో జరిగిన సి.ఐ.ఏ ఆడిట్ రిపోర్ట్ ప్రకారం ' కోడ్ నం. ఎస్.టి. ముష్టాంగ్ - 0183 ఛెస్ట్ భద్రం గానే ఉంది కాని ఆ పెట్టెలోని విగ్రహం దానితోబాటు లేఖనం ఉన్న కొయ్య పలక కూడ అదృశ్యం అయిందని కనుగొనటం జరిగింది. సి.ఐ.ఏ వాటికోసం చాలా తీవ్రమైన అన్వేషణ చేసింది. చిట్ట చివరికి ఒక ల్యాబ్ లో లేఖనం తో ఉన్న కొయ్యపలక  దొరికింది కాని విగ్రహం దొరక లేదు.  ఇప్పుడా విగ్రహం ఎక్కడున్నదో ఎవరికీ తెలియదు. ఎందుకంటే అప్పటి డైరెక్టరు తో సహా రహస్య టీమ్ లో పని చేసిన వ్యక్తులు  సర్వీస్ నుండి రిటైర్ అవటం జరిగింది.   ఇక  ఆఖరు భాగం - ముఖ్యాంశములు చదవండి :
తెలుసుకోవలసిన ముఖ్యాంశములు :
1. 25 వేల సంవత్సరాల క్రితమే అనగా ప్రాచీన ఋగ్వేదకాలం లో సానగ, సనాతన, అహభూన, ప్రత్న, సుపర్ణు లనబడు పంచ బ్రహ్మర్షులకు చెందిన విశ్వకర్మ వంశీయుల వలన సనాతన వైజ్ఞానిక నాగరికత వర్ధిల్లినది.వారినే మను మయ త్వష్ట శిల్పి, విశ్వజ్ఞ బ్రహ్మ వంశీయులని కూడా అందురు. మను బ్రహ్మ వంశీయులు వ్యవసాయ నాగరికతకు ఆద్యులు కాగా, మయ బ్రహ్మ వంశీయులు  కాష్ట శిల్ప , వాస్తు , గృహనిర్మాణ, యంత్రనిర్మాణాది విద్యలకు ఆద్యులు, త్వష్ట బ్రహ్మ వంశీయులు లోహ శిల్ప రసాయన శాస్త్ర విద్యలలో అద్వితీయులు. అటులనే శిల్పి బ్రహ్మ వంశీయులు శిలా శిల్ప రసాయనాది విద్యలలో గొప్పవారు. విశ్వజ్ఞ  బ్రహ్మ వంశీయులు, జ్యోతిర్విద్యలోను, స్వర్ణశిల్ప,  రసాయనాది విద్యలలో ప్రవీణులు.  మయ బ్రహ్మ వంశీయులు  రథనిర్మాణ శిల్పం లో ఆరితేరిన వారగుటచే విమాన నిర్మాణ విద్యలో గొప్ప నిపుణులు కాగలిగారు.  క్రి.పూ.25,000 సంవత్సరముల క్రితమే త్వష్ట బ్రహ్మ వంశీయులగు శిల్పాచార్యులు కల్పరసాయన విగ్రహములను తయారు చేయు చుండి రనుటకు  పైన తెలిపిన వృత్తాంతమే ఒక నిదర్శనము.
2.  పూర్వఋషి యుగమున త్వష్టబ్రహ్మ వంశీయులు కల్ప రసాయన తంత్రముతో త్రిలోహ పంచలోహ విగ్రహములు నిర్మించెడు వారు. శిల్పి బ్రహ్మ వంశీయులు ఉల్కా పాతమున లభ్యమైన శిలలతో మాత్రమే శివలింగములను, గండకీ నది, మరియు నర్మదానది యందు లభ్యమగు శిలలతో మాత్రమే విష్ణు విగ్రహములను శిల్పీకరించెడు వారు. నేటి బ్రాహ్మణులకు గాని / విశ్వబ్రాహ్మణులకు గాని  కల్ప రసాయన విద్య గురించి తెలియదు. కేవలము సిద్ధ సాంప్రదాయము వారిలో ఈ విద్య మిగిలి యిన్నది. వేదకాలమున రసమనగా సోమరసము మాత్రమే. నేటి కాలమున రసమనగా పాదరసము మాత్రమే. గోంగూరలో ఇనుము, పొన్నెగంటి కూరలో బంగారము ఉన్నట్లుగానే హిమాలయములలో సరోవరముల లో పూర్వము లభించెడు సోమలత యందు పాదరసము, రోడియం, ఇరిడియం అనెడి లోహములు పరమాణుస్థాయిలో సారము గా నుండెడివి.  బంగారము మొదలగు లోహముల మిశ్రణము ద్రవస్థితి యందుండగా సోమరసమును 108 సార్లు లేదా సహస్రము హవిష్యము గావించి తదుపరి రత్న చూర్ణములను కలిపి చల్లార్చిన లోహములతో మాత్రమే దేవుని విగ్రహముగా శిల్పాచార్యులు రూపొందించెడి వారు, అట్టి విగ్రహములను  తమ ఆశ్రమములయందు, గృహము లందు పూజించుచు పంచామృతములతోను, శుద్ధ జలము తో అభిషేకించి భక్తి తో సేవించుట వలన సంపూర్ణారోగ్యముతోఅనేక వందల సంవత్సరములు జీవించెడి వారు. క్షత్రియులైనచో నూరు యాగములు చేసి సోమరసమును పానము చేసెడివారు. సోమరసము మృత జన్యువులను కూడా చైతన్య పరచెడివి. కుండలినిని ఊర్ధ్వముఖముగా నడిపించి జ్ఞాన నేత్రమును ప్రసాదించెడిది. సోముని మహాత్మ్యమును వేదము లందు దాదాపు 250 సూక్తముల లో వర్ణింప బడినది.  ఇప్పుడు అట్టి సోమలత లభించుటలేదు. నీచులైన ఆంగ్లేయులు సోమమనగా బైరాగులు సేవించు గంజాయి యని మన వైదిక సంస్కృతిని నిందించెదరు. సోమరసమును యజ్ఞములలో వాడెడి విజ్ఞానము పంచ ఋషుల సంస్కృతి లోనిది. వారి సంస్కృతినే  తదుపరి కాలమున వేద ఋషులు అనుసరించిరి. ' పూర్వఋషులచే స్తుతింప బడిన ఈ అగ్ని దేవుడు హోతకు రత్నమును (పరిపూర్ణ జ్ఞాన సిద్ధిని ) యొసగు చున్నాడు.- ఋగ్వేదం.1-1.
3. సింధు నాగరికత త్రవ్వకములలో లభించిన లోహ ముద్రలలో "పశుపతి" విగ్రహము ఉండుట మీరు అందరూ చూచి యుందురు. ఆ ముద్రలపై యున్న వ్రాతను రోంగొ రోంగో లిపి యందురు. పలు ముద్రలపై వైదిక దైవమగు త్వష్ట భగవానుని పేరు వ్రాయబడి యున్నది. త్వష్ట బ్రహ్మ జన్యువులను సృష్టించి తద్వారా వివిధ జీవులను సృష్టించెనని ఆ లోహముద్రికల పై వ్రాయబడి యున్నది. దీనిని బట్టి వేద విజ్ఞాన రహస్యము ఆకాలపు శిల్పులందరికి తెలియునని గ్రహించ గలరు. ఆకాలమున సప్త సింధు యందలి బ్రాహ్మణ్యము త్వష్టయు పశుపతియు ఒకరే నని భావించెడి వారని తెలియుచున్నది. ఏది యేమైనను దైవమును  విగ్రహరూపమున పూజించి  అభిషేకించి ఆ అభిషేక జలమును స్వీకరించుట వలన పలు ప్రయోజనములు గలవని అందరు గ్రహించ వలసి యున్నది. ఆ విధముగా తీర్థమును ఇచ్చు సాంప్రదాయము మన దేవాలయములందు ఇంకను కొనసాగుచున్నది.    
4 .  ఇప్పుడా కల్ప రసాయన విగ్రహములు లేవు దానికి ప్రధాన కారణము సప్తార్షేయులు  తమకు పూర్వులైన పంచార్షేయ శిల్పాచార్యులను వేద విద్యకు దూరము గావించుటయే. ఈనాడు శిల్పాచార్యులు ప్రాణసూక్తమును జదువుచు శిల్పములు జెక్కు పద్ధతిని మరిచినారు.  వారు చేసే పనులను ఇప్పుడు యంత్రముల సాయముతో అందరు చేయుచున్నారు. అయినను విశ్వకర్మలు మాత్రము తమ వృత్తులను విడువజాలక ప్రభుత్వ సాయము కొరకు ఎదురు చూచు చున్నారు. ఈ యుగమున ఎవరిని నిందించి ఏప్రయోజనము లేదు కారణమేమనగా వేద విజ్ఞానము పూర్తిగా పాశ్చాత్యుల పాలైనది. విశ్వకర్మ బ్రాహ్మణులు తమ వృత్తులను ఆదరించు వారు లేక దుర్భర దారిద్ర్యమును అనుభవించు చున్నారు. వారు వీరనుటేల అందరూ విదేశీ నాగరికతా విష వలయమున అందరూ చిక్కుకొని విష ద్రష్టులై యున్నారు. ఎందుకైనా మంచిది దేవాలయమునకు వెడలి నపుడు దేవుని అభిషేకతీర్థమును తప్పక స్వీకరించి రండు.మొద్దు వారిన మెదడుకు కొంత విశ్రాంతి లభించగలదు.

పరాశరాదులు బృహజ్జాతకాది గ్రంథములలో తెలిపిన విధముగానూ, పరాశరులకు పూర్వమే సత్యాచార్యులు నక్షత్ర నాడీ శాస్త్రములో తెలిపిన విధముగానూ, జాతకుని (జన్మించిన వాని) ప్రామాణిక ఆయుర్దాయము "వింశోత్తరి", అనగా నూట ఇరువది సంవత్సరములు.  దర్శ పూర్ణల దృష్ట్యా ఈ నూట ఇరువది సంవత్సరముల కాలము తదుపరి కాలములోని ఆంగ్లమానములోని నూట పది సంవత్సరములకు సమానము. నవరాత్రుల ప్రభావము ఎవరికీ ప్రత్యేకముగా తెలియజేయనవసరము లేదు కదా! కనుక ఈ కల్ప విగ్రహ అభిషేకతీర్థము తొమ్మిది రోజుల అభిషేకము తరువాత స్వీకరించిన వారు నూట పది సంవత్సరముల పాటి జీవించి వుండిరనుట ఈషణ్మాత్రము సత్యదూరము కానిది!  ఏ భంగిమలో దర్శించిననూ, ఏ కోణములో వీక్షించిననూ "సత్యము మాత్రమే నిత్యము, అదియే సనాతనము, భారతీయము"!✊🙏

ప్రాచీన విశ్వకర్మ శిల్పాచార్యుల
నైపుణ్యెం,వైజ్ఞానిక పరిజ్ఞానము
ఎంతటి ఉన్నత స్థితిలో వున్నదో
దీనిని బట్టి తెలుస్తున్నది!! ఆ కల్ప విగ్రహం కార్బన్ డేటింగ్
ప్రకారం 26 వేల సంవత్సరాల
క్రిందటిదని అన్నప్పుడు అది
ద్వాపరయుగము నాటిదేమో!!
కలియుగము ప్రారంభమై 5119
సంవత్సరాలైనది!!మన విశ్వకర్మ
ఆచార్యుల ప్రతిభ,సృజనాత్మకత
సాటిలేనిది!

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP