శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

హనుమత్ రక్షాయాగమునకు సిద్దమవుతున్న భక్తులకు నియమావళి

>> Thursday, January 11, 2018

ఈనెల  27 న జరగనున్న హనుమత్ రక్షాయాగం పూర్ణాహుతికి సిద్ధమవుతున్న  భక్తులకు నమస్కారములు.
యాగములో పాల్గొనుటకు వచ్చువారు రెండువర్గములుగా ఉన్నారు. ఒకటి యాగం చూడటం తీర్థప్రసాదములు స్వీకరించేవారు ....వీరు ఆరోజు  శుచిగా  యాగస్థలమునకు రావలెను.

యాగములో స్వయముగా పాల్గొనేవారు  రెండవవర్గము. వీరు  పదిహేడవ తేదీ నుండి పదకొండు రోజులపాటు  మద్యమాంసాలు ముట్టకుండా నియమబద్దంగా ఉండాలి.  యాగశాలలోకి సాంప్రదాయ వస్త్రములతో మాత్రమే అనుమతి ఉంటుంది.

మొత్తం ద్వాదశ కుండములతో జరుపబడే యాగములో నలభైఎనిమిది మంది దంపతులకు అవకాశం ఉంటుంది .
ఎవరైతే పాల్గొనదలచుకున్నారో వారు ముందుగా తమపేర్లు నమోదు చేసుకోవాలి. వారు ఇరవైఏడవతేదీ ఉదయం ఎనిమిదిగంటలకల్లా  యాగస్థలికి చేరుకోవాలి. ముందురాత్రి వచ్చినవారికి వసతి ఉంటుంది .
యాగములో పాల్గొనేవారు తప్పనిసరిగా  కొంత శ్రీరామనామ జపం,లేఖనం  జరుపాలి.
జైశ్రీరాం

9948235641
durgeswara@gmail.com

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP