శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అసలీ జనవరి 1 కథ ఏంటి?*

>> Sunday, December 31, 2017

*అసలీ జనవరి 1 కథ ఏంటి?*
నాకు చాలా మంది మిత్రులు జనవరి ఒకటిన *"విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ "* అని అభిమానంగా, సంతోషంగా చెబుతారు. అది వారి ప్రేమకు తార్కాణం. కానీ నేనిప్పటిదాకా నాకు బుద్ధొచ్చాక నేనై నేను ఎవరికీ చెప్పలేదు. (నా పై అధికారులకు తప్ప).
ఇలా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పే వారిది ఏ తప్పూ లేదు. ఎందుకంటే మనకెవ్వరికీ జనవరి నూతన సంవత్సర ప్రారంభం (న్యూ ఇయర్ ) కాదని తెలియదు. ఇక ఎంజాయ్ ఎంజాయ్ అని త్రాగి తిరిగే వాళ్ల కథ నాకు తెలియదు. ఇక పై ప్రశ్నలకు సమాధానం చూద్దాం.
ఇప్పుడు మనం అనుసరించే క్యాలెండర్‌ గ్రెగేరియన్ క్యాలెండర్. ఇదంతా తప్పులతడక, లోపాల పుడక. క్రీ.శ 1582 లో పోప్ గ్రెగేరియన్ సరిచేసిన క్యాలెండర్ ఇది. ఈ క్యాలెండర్ ప్రకారం మనం యదార్థ సంవత్సరం కంటే 24.6 సెకన్ల ఎక్కువ సమయాన్ని లెక్కించుకుంటున్నాము. ఆప్రకారం 3,513 సంవత్సరాలకు ఒక రోజు ఎక్కువ వస్తుంది. ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త *జాన్ వెర్షల్* ఈ లోపాన్ని సవరించటానికి ఒక ఉపాయం చెప్పాడు. అదేంటంటే, క్రీ.శ 4,000 సంవత్సరంను లీప్ సంవత్సరంగా లెక్కించకుండా వదిలేయడం.
ఈ క్యాలెండర్ లోని లోపాలను సరిచేయడం అవసరమని సూచనలు చేస్తూ *"నానాజాతిసమితి"* ఒక కమిటీ ఏర్పాటుచేసింది. ఆ కమిటీ 185 రకాల ప్కాన్లను పరిశీలించి, క్రీశ 1926 లో ఒక రిపోర్టు ఇచ్చింది. కాని ఇప్పటి దాకా అది ఎటూ తేలలేదని చెప్పవచ్చు. ఇంకా ఇలాంటి చిన్నచిన్న చిక్కులు చాలానే ఉన్నాయి.
మంచిది...
ప్రపంచమంతా ఒకప్పుడు నూతన సంవత్సరం ఉగాది పర్వధినం నాడు ప్రారంభమయ్యేది.
బైబిల్ లోని *ఎజ్రా* పుస్తకం 10:17 వ వచనం సంవత్సరం లోని మొదటి నెల మార్చి - ఏప్రిల్ లో ప్రారంభమౌతుందని సాక్ష్యం పలుకుతోంది. ఫ్రాన్స్‌ లో క్రీశ 1582 వరకూ, ఇంగ్లాండులో క్రీశ 1752 వరకూ నూతన సంవత్సరం మార్చి 25 న ప్రారంభం అయ్యేదని చరిత్ర చెబుతూంది. అయితే, కాలగమనంలో ఇది ఎప్పుడు మారిందో తెలియదు కానీ, అది ఏప్రిల్‌ కు మారింది. అయితే నూతన సంవత్సరం మార్చిలో ఉంచాలా, ఏప్రెల్ మాసంలో ఉంచాలా అనేది వారికి కొంత సమస్యగా మారింది. సంవత్సరం ఆరంభం ఎప్పుడూ ఒకే నెలలో ఒకే తేదీన వస్తే బాగుంటుంది అని వారు ఆలోచించసాగారు. ఆ సమయంలో క్రీ.శ 15 శతాబ్ది చివరి కాలంలో ఫ్రాన్స్‌ చక్రవర్తి *చార్లెస్* అంతవరకూ 11వ నెలగా ఉన్న జనవరి మాసాన్ని ఒకటవ నెలగా నూతన సంవత్సరంగా ప్రారంభించాడు. ఈ విధంగా నేటి మన నూతన సంవత్సరం ప్రారంభమైంది.
ఇందుకు ఎలాంటి శాస్త్రీయ, ప్రకృతి పరమైన ఆధారమూ లేదు. ముందుగా ఫ్రాన్స్‌, ఇటలీ, పోర్చుగీసు, స్పెయిన్ దీనిని అంగీకరించాయి. క్రీ.శ 1699 లో జర్మనీ, క్రీశ 1752లో ఇంగ్లండు, క్రీ.శ 1873 లో జపాన్‌, క్రీ.శ 1912 లో చైనా, క్రీ.శ 1916 లో బల్గేరియా, క్రీ.శ 1918 లో రష్యా లు ఈ కాలచక్రాన్ని అంగీకరించాయి. 17, 18వ శతాబ్ద కాలంలో తమ ఆధీనంలో ఉన్న అన్ని దేశాలలో బ్రిటిషు వాడు దీన్ని ప్రవేశపెట్టాడు.
కానీ భారతీయ క్యాలెండర్ ఋషులచే తయారు చేయబడింది. ఆర్యభట్టు, భాస్కరాచార్య వంటి మహాన్ శాస్త్రజ్ఞులచే పరిశోధించబడింది. కొన్నివేల సంవత్సరాల తర్వాత ఏ సంవత్సరంలో, ఏ నెలలో, ఏ రోజున ఏ గ్రహణం వస్తుందో, వారం వర్జ్యముతో సహా చెప్పగలిగేంతగా శోధించబడింది.
ప్రకృతికి అనుగుణంగా, వసంత ఋతువు చైత్రశుద్ధ పాఢ్యమి రోజున ఉగాది ప్రారంభ మవుతుంది.(కొన్నిచోట్ల వసంత ఋతువు మేశరాశి లో సూర్యుడు ప్రవేశించటాన్ని ఉగాదిగా చేస్తారు.)
*ప్రపంచమంతా మొదటి నుంచీ అనుసరిస్తున్న ఉగాదిని కాదని,* వాడెవడో ఫ్రాన్స్‌ వాడు ఏ ఆధారమూ లేకుండా ప్రతిపాదించిన నూతన సంవత్సరంను ఫాటించడం కంటే, ఆత్మాభిమానం కలిగి భారతీయుల మందరమూ మన సాంప్రదాయక ఉగాది నూతన సంవత్సరంగా పండుగ జరుపుకోవటం ఉత్తమము మరియు మన కర్తవ్యము.

ఏ లోపాలు లేని మన కాలమానం గొప్పతనాన్ని ప్రచారం చేయటమే మన తక్షణ కర్తవ్యం. ఈ మెసేజ్ జనవరి 1 లోగా తెలుగు వారికంతా వెళ్లేలా చేస్తే, సగం పని జరిగినట్లే.

*భారత్ మాతాకీ జై*
పెద్దల ద్వారా విన్నదాన్ని మీకు విన్నవించాను.

*ఈ మెసేజ్ 2017 డిసెంబర్ ముప్పైఒకటి కంతా తెలుగు వారికందరికీ అందిద్దాం...*
ఉగాదిని నూతన సంవత్సరంగా జరుపుకుందాం..
*చరిత్రను తిరగరాద్దాం...*

2 వ్యాఖ్యలు:

bluecake December 31, 2017 at 10:15 AM  

మరి ఒక్కోక్కరాష్ట్రంలో నూతన సంవత్సరం ఒక్కొక్క రోజు ఒస్తుందేమిటి??

కాంత్ January 3, 2018 at 10:42 AM  

"ప్రపంచమంతా ఒకప్పుడు నూతన సంవత్సరం ఉగాది పర్వధినం నాడు ప్రారంభమయ్యేది" - ఇది ఎట్లా? ప్రపంచమంతా వసంతం (Spring) ఒకేసారి రాదు కదా.

"బైబిల్ లోని *ఎజ్రా* పుస్తకం 10:17 వ వచనం సంవత్సరం లోని మొదటి నెల మార్చి - ఏప్రిల్ లో ప్రారంభమౌతుందని సాక్ష్యం పలుకుతోంది" - ఇప్పుడు బైబిల్ గురించి ప్రస్తావన ఎందుకో? అయినా బైబిల్ ప్రపంచమంతటికీ ప్రామాణికం కాదు గదా?

"ఏ లోపాలు లేని మన కాలమానం గొప్పతనాన్ని ప్రచారం చేయటమే మన తక్షణ కర్తవ్యం" - లోపాలు అన్ని మతాలలోను, అన్ని దేశాలలోను, అన్ని గ్రంథాలలోను, అన్ని శాస్త్రాలలోను ఉన్నాయి. కాల మాన పరిస్థితులను బట్టి అవి గుర్తించబడతాయి.

"భారత్ మాతాకీ జై/తెలుగు వారికందరికీ అందిద్దాం/ఉగాదిని నూతన సంవత్సరంగా జరుపుకుందాం" - దేశము, మతము, ప్రాంతీయము, భాష - అన్నీ ఒక్కటి కాదు. అన్నిటికీ ముడి పెట్టలేము. భారతీయుడైనంత మాత్రాన తెలుగు మాట్లాడాలని లేదు. తెలుగువాడైనంత మాత్రాన హిందువు అయి ఉండాలని లేదు. హిందువు అయినంత మాత్రాన ఉగాది జరుపుకోవాలని లేదు.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP