శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

పాశ్చాత్యుల శాస్త్రీయ అభివృద్ధికి కారణం క్రైస్తవమా? if

>> Saturday, September 16, 2017

పాశ్చాత్యుల శాస్త్రీయ అభివృద్ధికి కారణం క్రైస్తవమా?

కాదు. నిజానికి క్రైస్తవ ప్రాభల్యం ఆ దేశాలపై ఉన్నంత వరకూ అవి సాంకేతికంగా అభివృద్ది చెందలేదు సరికదా, ఎన్నో మూఢ నమ్మకాలతో చాలా వెంకనబడి ఉండేవి. భూమి బల్లపరుపుగా ఉంది, భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతాడు, సృష్టి జరిగి 6000 సంవత్సరాలే అయ్యింది అనే బైబిల్ ఆధారిత మూఢ నమ్మకాలు ఎన్నో ఉండేవి. ఈ మూఢ నమ్మకాలు తప్పు అన్న వారిని చర్చి అధికారులు చంపెసేవారు లేదా బంధించేవారు. సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుంది అన్నందుకు గేలీలియోని జైలు లో పడేసారు. పది సంవత్సరాల జైలు జీవితం తరువాత అతను అక్కడే చనిపోయారు [1]. ఇలా చేసినందుకు కాథలిక్ పోప్ తరువాత తప్పక క్షమాపణ కూడా చెప్పారు. చాలా కాలం పాటు దేశాలని ఏలే రాజుల కన్నా చర్చి అధికారులు శక్తివంతులుగా ఉండేవారు. బైబిల్, దేవుడి వాఖ్యం అనే గుడ్డి నమ్మకం వలన, బైబిల్ లో ఉన్న దానికి వ్యతిరేకంగా ఎవరు ఏం మాట్లాడినా, ఆ వాదానికి హేరెసి (Heresy) అని ఆ వాదాలని బలపరచిన మేధావులని, సామాన్యులని హేరేటిక్స్ (Heretics) అని ముద్ర వేసి చంపేసే వారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉండేది కాబట్టే యూరోప్ మీద చర్చి అధికారం చలాయించిన ఆ కాలాన్ని “ఐరోపా చీకటి యుగం” గా (European Dark Age) చరిత్ర కారులు పిలుస్తారు [2]. ఇది రోమన్ సారాజ్య పతనం తో ప్రారంభం అయ్యి, 14వ శతాబ్దంలో తగ్గు ముఖం పట్టడం ప్రారంభం అయ్యింది. చర్చి హస్తాలలో పడి చీకటి యుగం లో మగ్గిపోయిన ఐరోపా స్వేచ్చా వాయువులు పీల్చడానికి కొన్ని శతాబ్దాల సమయం పట్టింది. ఎందరో తమ ప్రాణాలని పణంగా పెట్టి స్వేచ్చని సాధించుకున్నారు

ఈ మార్పు వివిధ దశలలో జరిగింది

ఐరోపా చీకటి యుగం  ఐరోపా సాంస్కృతిక పునరుజ్జీవనం  క్రైస్తవ మత సంస్కరణ ఉద్యమం  ఆధునిక, లౌకిక ఐరోపా/అమెరికా (క్రైస్తవము – రాజ్య పాలన వేరు చేయబడ్డాయి)

ఐరోపా చీకటి యుగం: ఇది రోమన్ సామ్రాజ్య పతనంతో ప్రారంభం అయ్యి ఐరోపా సాంస్కృతిక పునరుజ్జీవనం ప్రారంభం అయ్యేవరకూ, అంటే దాదాపు 1000 సంవత్సరాలు, కొనసాగింది. ఐరోపా పై చర్చి అధికారం చలాయించిన ఈ కాలంలో ఎటువంటి శాస్త్ర, సాంకేతిక అభివృధ్ధీ జరగలేదు, ఒకటి రెండు మినహాయింపులు ఉండవచ్చు.    

ఐరోపా సాంస్కృతిక పునరుజ్జీవనం (Renaissance): చర్చి అధికారం కొనసాగినంత కాలం చీకట్లో, మూఢ నమ్మకాలలో మగ్గిపోయిన ఐరోపా సమాజంలో మార్పు మొదట కళల రూపంలో ప్రారంభం అయ్యింది. 14వ శతాబ్దంలో ఇటలీ లో ప్రారంభం అయిన ఈ సాంస్కృతిక పునరుజ్జీవనోధ్యమం క్రమంగా ఐరోపా అంతా వ్యాపించి 17వ శతాబ్దం వరకూ కొనసాగింది. అప్పటి వరకూ చర్చి అధికారులు అణగద్రోక్కిన ప్రాచీన గ్రీకు కళలకి ఈ కాలంలో మళ్ళీ ఆదరణ లభించింది. ప్రాచీన గ్రీకు తత్వశాస్త్రం, అచ్చు యంత్రం ఆవిష్కరణ ఐరోపా సాంస్కృతిక పునరుజ్జీవనోధ్యమంలో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించాయి. తరువాతి కాలం లో నాగరిక దేశాలైన భారత్ తదితర దేశాలతో ఏర్పడ్డ సంభంధాలు కూడా ఐరోపా సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఎంతో దోహద పడింది. ముఖ్యంగా సంస్కృత భాష వలన ఐరోపా భాషలు ఎంతో లాభ పడ్డాయి. ఐరోపా భాషల గ్రామర్ కి మూలం సంస్కృత వ్యాకరణ సూత్రాలే. 20వ శతాబ్దం వరకూ కూడా ఐరోపా భాషలలో డాక్టరేట్ చెయ్యాలి అంటే సంస్కృత అధ్యయనం తప్పని సరి అంటేనే అర్ధం చేసుకోవచ్చు, వాళ్ళు మన సంస్కృతం నుండి ఎంత నేర్చుకున్నారో [3]

క్రైస్తవ మత సంస్కరణ ఉద్యమం: ఏజ్ అఫ్ ఎన్లైటెన్మెంట్ లేదా ఏజ్ అఫ్ రీసన్ గా పిలిచే ఈ కాలం 18వ శతాబ్దం లో ప్రారంభం అయ్యి ఇప్పటికీ కొనసాగుతోంది. సైన్సు కి చర్చి కి మధ్య ఈ కాలం లో జరిగిన పోరాటంలో చర్చి ఓడిపోయింది. దాని ఫలితంగానే రాజ్య పాలన లో చర్చి పాత్ర అంతమయింది. దీనిని మనం ఇప్పుడు లౌకిక వాదం (Secularism) అని పిలుస్తున్నాం. అప్పటి వరకూ అణగద్రోక్కబడిన మేధావులు, ఆలోచనా పరులు, సంఘ సంస్కర్తలు భయం లేకుండా క్రైస్తవం లో ఉన్న మూఢ నమ్మకాలని ప్రశ్నించడం మొదలుపెట్టారు. బైబిల్/క్రైస్తవానికి వ్యతిరేకమైన శాస్త్రీయ ఆలోచనలు, పరిశోధనలు ప్రారంభం అయ్యాయి. దాని ఫలితమే శాస్త్ర సాంకేతిక అభివృద్ది. ఐరోపా పారిశ్రామిక విప్లవం కూడా ఈ కాలంలోనే ప్రారంభం అవ్వడం గమనార్హం.

చాలా మంది అనుకుంటున్నట్లు ఐరోపా శాస్త్ర, సాంకేతిక అభివృద్ధికి కారణం క్రైస్తవం కాదు సరి కద, వారు దాదాపు వెయ్యి సంవత్సరాలు ఎంటువంటి శాస్త్ర సాంకేతిక అభివృద్ది లేకుండా ఉంది పోవడానికి కారణం క్రైస్తవం. పాశ్చాత్య ప్రపంచం మీద క్రైస్తవం ప్రభావం తగ్గడమే వారి శాస్త్ర సాంకేతిక పురోగతికి ప్రధాన కారణం [4]  

ఉల్లేఖనాలు

1. https://en.wikipedia.org/wiki/Galileo_affair
2. https://en.wikipedia.org/wiki/Dark_Ages_(historiography)
3. రాజీవ్ మల్హోత్రా గారి బీయింగ్ డిఫరెంట్ (పుఠ సంఖ్య 238)
4. https://en.wikipedia.org/wiki/Age_of_Enlightenment

2 వ్యాఖ్యలు:

maheshudu September 17, 2017 at 10:44 PM  

https://www.washingtonpost.com/news/acts-of-faith/wp/2017/09/17/the-world-as-we-know-it-is-about-to-end-again-if-you-believe-this-biblical-doomsday-claim/?utm_term=.dff0eb78bfd3

Chiranjeevi Y September 19, 2017 at 5:10 AM  

>>వారు దాదాపు వెయ్యి సంవత్సరాలు ఎంటువంటి శాస్త్ర సాంకేతిక అభివృద్ది లేకుండా ఉంది పోవడానికి కారణం క్రైస్తవం.

ఏ మతమైనా గానీ, తను ఉన్న రాజ్యాన్ని ఏలాలనుకుంటే.. ఆ దేశ పరిస్తితి అంతే.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP