శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవములు కు ఆహ్వానం

>> Tuesday, September 19, 2017
శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం  లో శరన్నవరాత్ర ఉత్సవములు  ఆశ్వీయుజ శుధ్ధ పాఢ్యమి [ది. 21-09-2017  to 30-09-2017]  వరకు  వైభవోపేతముగా జరుగనున్నాయి.
పాఢ్యమి రోజు   గణపతి పూజ ,  కలశస్థాపనతో ప్రారంభమై    నిత్యము ,సుప్రభాత  సేవ, అభిషేకములు ,అలంకరణ,కుంకుమార్చనలు పారాయణములు, హోమములు, మహానివేదనలు,  సంధ్యహారతులు,సాయంకాలార్చనలు ,భజన,సామగానసేవ,డోలోత్సవం పవ్వళింపు సేవ  నిర్వహించబడతాయి.
29-09-2017  శుక్రవారం     మహర్ణవమి ఉత్సవం పీఠసాంప్రదాయానుసారం అత్యంత భక్తిశ్రధ్ధలతో  అమ్మకు ప్రీతికరంగా నిర్వహించబడుతుంది.
 నిత్యము, శ్రీవారికి,రామలింగేశ్వర స్వామివారికి పరివార దేవతలకు విశేష అభిషేకములు అర్చనలు జరుపబడతాయి

30-09-2017    విజయదశమి రోజున  పూర్ణాహుతి,శాంతిపూజలు జరుపబడతాయి..
వచ్చిన భక్తులందరికీ   అమ్మ అన్నపూర్ణదేవి  భోజన ప్రసాదం అందించబడుతుంది.


భక్తజనుల తరపున అమ్మవారికి పూజలు జరుపబడతాయి. ఇందుకొరకై    మీ గోత్రనామాదులను పంపి  మీరు ప్రత్యక్షంగా వచ్చి ఉత్సవములో పాల్గొన్నను లేక  వీలుగాని పరిస్థితులలో మీ ఇంటివద్దనే నిత్యము దీపారాధన అమ్మవారి స్తోత్రములు పఠించుట చేయాలి. దీని కొరకై  ఎటువంటి ద్రవ్యములను పంపవలసిన అవసరము లేదు.


మనవి +     అన్నపూర్ణ భిక్షాశాల నిర్మాణం లోనూ ,మండప నిర్మాణం లోనూ మాకు సహకరించిన  భక్తుల అడ్రస్ లు   మరొకసారి గోత్రనామాదులతో పాటు పంపవలసినదిగా మనవి.
  శ్రీ వేంకటేశ్వర జగన్మాత పీఠం
రవ్వవరం    నూజండ్ల  మండలం   గుంటూరు   జిల్లా

సంప్రదించవలసిన చిరునామా       durgeswara@gmail.com         9948235641


0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP