శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఏయే టైమ్ లో మన బాడీలో ఏమేం జరుగుతుందో తెలుసా???*

>> Friday, September 8, 2017

*💝Human body energy clock*

*ఏయే టైమ్ లో మన బాడీలో ఏమేం జరుగుతుందో తెలుసా???*

ఫ‌లానా స‌మ‌యానికి ఫ‌లానా ప‌ని చేయాలి. ఫ‌లానా వ్య‌క్తిని క‌ల‌వాలి. ఆ టైంకి భోజ‌నం చేయాలి. ఇంకో టైంకి ఇంకో ప‌ని చేయాలి. ఆ స‌మ‌యానికి నిద్ర పోవాలి… ఇలా మ‌నం అనేక ర‌కాల ప‌నుల‌ను నిత్యం టైం ప్ర‌కారం చేస్తుంటాం. కొంత మంది టైం లేకుండా చేస్తార‌నుకోండి అది వేరే విష‌యం. అయితే మ‌నం ఏ ప‌ని చేసినా దానికి ఒక టైం అంటూ ఉంటుంది. కానీ మ‌న శ‌రీరం కూడా ఒక నిర్దిష్ట‌మైన స‌మయాన్ని పాటిస్తుంద‌ని మీకు తెలుసా? అవును, మీరు విన్న‌ది నిజ‌మే. మ‌న శ‌రీరం కూడా త‌న‌లో జ‌రిగే జీవ‌క్రియ‌ల‌కు ఒక్కో స‌మ‌యాన్ని కేటాయిస్తుంది. ఆ స‌మ‌యంలో ఆయా అవ‌య‌వాలు యాక్టివ్‌గా ప‌నిచేస్తాయి. దీని వ‌ల్ల మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. అయితే మ‌న శ‌రీర అవ‌య‌వాలు యాక్టివ్ గా ఉన్న సమ‌యంలో వాటికి విరుద్ధంగా మ‌నం చేసే కొన్ని ప‌నుల వ‌ల్ల ఆయా భాగాల‌పై ఒత్తిడి పెరిగి మ‌న‌కు అనారోగ్యం క‌ల‌గుతుంది. ఈ క్ర‌మంలో అస‌లు ఏయే భాగాలు ఏయే స‌మ‌యాల్లో యాక్టివ్‌గా ప‌నిచేస్తాయో, అవి ప‌నిచేసేట‌ప్పుడు మ‌నం ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

*💛ఉద‌యం 5 నుంచి 7 గంట‌ల మ‌ధ్య*

 – ఈ స‌మ‌యంలో పెద్ద పేగు యాక్టివ్‌గా ఉంటుంది. శ‌రీరంలోని వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కి పంపే ప‌నిలో అది మునిగి ఉంటుంది. కాబ‌ట్టి ఈ స‌మ‌యంలో మ‌నం ఎంత వీలైతే అంత ఎక్కువ‌గా నీటిని తాగాలి. వాకింగ్‌, ర‌న్నింగ్ వంటి వ్యాయామాలు చేయాలి. కాఫీ, టీ వంటివి అస్స‌లు తాగ‌కూడ‌దు.

*❤ఉద‌యం 7 నుంచి 9 మ‌ధ్య*

 – ప్రోటీన్లు, త‌క్కువ పిండి ప‌దార్థాలు క‌లిగిన ఆహారం, ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు క‌లిగిన ఆహారాన్ని, పండ్ల‌ను ఈ స‌మ‌యంలో బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవాలి. దీని వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు ఎక్కువ‌గా ఉద‌య‌మే అందుతాయి.

*💚ఉద‌యం 9 నుంచి 11 మ‌ధ్య*

– ఈ సమ‌యంలో మ‌న శ‌రీరంలోని ప్లీహం ఉత్తేజంగా ఉంటుంది. అది మ‌న శ‌ర‌రీంలో జ‌రిగే జీవ‌క్రియ‌ల‌ను గాడిలో పెడుతుంది. ఉద‌యం మ‌నం తిన్న ఆహారం నుంచి పోష‌కాల‌ను శ‌రీరం గ్ర‌హించేలా చేస్తుంది.

*💛ఉద‌యం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట మ‌ధ్య*

 – ఈ స‌మ‌యంలో మ‌న గుండె ఉత్తేజంగా ప‌నిచేస్తుంది. శ‌రీర భాగాల‌కు ర‌క్తం బాగా స‌ర‌ఫ‌రా అయ్యేలా చూస్తుంది. దీని వ‌ల్ల శ‌రీర క‌ణాల‌కు శ‌క్తి అందుతుంది.

*💙మ‌ధ్యాహ్నం 1 నుంచి 3 గంట‌ల వ‌ర‌కు*

 – ఈ స‌మ‌యంలో చిన్న పేగులు అల‌ర్ట్‌గా ఉండి బాగా ప‌నిచేస్తాయి. మ‌నం తిన్న బ్రేక్‌ఫాస్ట్, లంచ్‌ల జీర్ణ‌ప్ర‌క్రియ‌ను ముగిస్తుంటాయి.

*💚మ‌ధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు*

 – ఈ స‌మ‌యంలో మ‌న మూత్రాశ‌యం యాక్టివ్‌గా పనిచేస్తుంది. శ‌రీరంలోని వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కి పంపే ప‌నిలో ఉంటుంది. ఈ స‌మ‌యంలో నీరు ఎక్కువ‌గా తాగాలి.

*💜సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు*

 – ఈ స‌మ‌యంలోనూ మ‌న కిడ్నీలు బాగా చురుగ్గా ప‌నిచేస్తాయి. ర‌క్తాన్ని వ‌డ‌బోయ‌డం, వ్య‌ర్థాల‌ను మూత్రాశ‌యానికి పంప‌డం వంటి కార్య‌క్ర‌మాల‌ను చేస్తాయి.

*❤రాత్రి 7 నుంచి 9 గంట‌ల మధ్య*

 – ఈ స‌మ‌యంలో పెరికార్డియం ఉత్తేజంగా ఉంటుంది. ఈ టైంలో రాత్రి భోజ‌నాన్ని క‌చ్చితంగా ముగించాలి. మెద‌డు, ప్ర‌త్యుత్ప‌త్తి అవ‌య‌వాల‌ను పెరికార్డియం ఈ స‌మ‌యంలో యాక్టివేట్ చేస్తుంది.

*💛రాత్రి 9 నుంచి 11 గంట‌ల మ‌ధ్య*

 – ఈ స‌మయంలోభోజ‌నం అస్స‌లు చేయ‌కూడ‌దు. థైరాయిడ్‌, అడ్రిన‌ల్ గ్రంథులు ఇప్పుడు బాగా ప‌నిచేస్తాయి. ఇవి శ‌రీర మెట‌బాలిజం ప్ర‌క్రియ‌ను చురుగ్గా సాగేలా చేస్తాయి. శ‌రీర ఉష్ణోగ్ర‌తను క్ర‌మ‌బ‌ద్దీక‌రిస్తాయి. క‌ణాల‌కు శ‌క్తి అందేలా చూస్తాయి.

*💚రాత్రి 11 నుంచి 1 గంట మ‌ధ్య*

– ఈ స‌మ‌యంలో మూత్రాశయం యాక్టివ్‌గా ఉంటుంది. గాల్ స్టోన్స్ వంటివి ఉన్న‌వారికి ఈ స‌మ‌యంలో సాధార‌ణంగా నొప్పి వ‌స్తుంటుంది.

*💙రాత్రి 1 నుంచి ఉద‌యం 3 మ‌ధ్య*

 – ఈ స‌మ‌యంలో కాలేయం చురుగ్గా ఉంటుంది. అప్పుడు మేల్కొని ఉంటే లివ‌ర్ ప‌నిత‌నం దెబ్బ‌తింటుంది. కాబ‌ట్టి ఈ స‌మ‌యంలో క‌చ్చితంగా నిద్ర‌పోవాల్సిందే. లేదంటే కాలేయం స‌రిగ్గా ప‌నిచేయ‌దు. వ్య‌ర్థాలు బ‌య‌టికి వెళ్ల‌వు.

*💜ఉద‌యం 3 నుంచి 5 మ‌ధ్య*

 – ఈ టైంలో ఊపిరితిత్తులు యాక్టివ్‌గా ఉంటాయి. ఆ స‌మ‌యంలో ద‌గ్గు వస్తుందంటే ఊపిరితిత్తులు విష ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతున్నాయ‌ని అర్థం చేసుకోవాలి.
AmtarjAlam numdi

2 వ్యాఖ్యలు:

ketan September 9, 2017 at 6:55 PM  

As a doctor, I see these points to be sense-less.

durgeswara September 10, 2017 at 7:30 AM  

kaavachchu doctor gaaru.

mana maanasika sthiti anni samayaalalo okatigaa umdatam ledukadaa ? daaniki kaaranaalumdvachchu kadaa anveshimchamdi . eppatikappudu kottavishayaalu veluguloki vastunnaayi kadaa

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP