శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

| *రవి గ్రహస్సూర్యవారే సోమేగ్రహస్తదా !* *చూlడామణి ఖ్యాతః తత్రదత్తమనంతకం* *

>> Saturday, August 5, 2017




**|| శ్రీ హరి హర గురు పరబ్రహ్మణే నమః ||*
 ★★★★★★★★★★★★★★★

శ్లో|| *రవి గ్రహస్సూర్యవారే సోమేగ్రహస్తదా !*
*చూడామణి ఖ్యాతః తత్రదత్తమనంతకం*
*వారేష్వన్యేషు యత్పుణ్యం గ్రహణే చంద్ర సూర్యయో: !* *తత్పుణ్యమ్ కోటి యోగే చూడా మణౌ స్మృతం !!*

_ఆదివారం సూర్యగ్రహణం, సోమవారం చంద్ర గ్రహణం వచ్చుటను *చూడామణి యోగం* అంటారు. ఆ సమయంలో చేయబడిన దానం వలన అనంతఫలం వస్తుంది. ఇతర వారాలలో సూర్య , చంద్ర గ్రహణాలలో వస్తే చేసే దానం కంటే ఈ *చూడామణి యోగం* వచ్చునప్పుడు చేసేదానం దానికంటే కోటి రెట్లు అధిక ఫలమిస్తుంది_.

 { అనగా 07.08.2017 రోజున ఇదే “చూడామణియోగం” వస్తుంది}
 { వ్యాసోక్తి – నిర్ణయసిందు}

చూడామణి నామక అర్థాల్పగ్రాస చంద్రగ్రహణం

07 / 08 / 2017 తేదీ రాత్రి
శ్రావణ పూర్ణిమ సోమవారం శ్రవణా నక్షత్రమున ధూమ్రవర్ణం కేతుగ్రస్థం సవ్య గ్రహణం.

స్పర్శ  రాత్రి 10:52 🌖

మధ్య 11:49 🌗

మెక్షం రాత్రి 12:48 🌚🌝

మధ్యాహ్నం 1:52 నిమిషాలు లోపు భోజనాలు తినవలెను.

అయితే *వృద్ధులు, రోగులు, గర్భిణీ స్త్రీలు, పిల్లలకు* సాయంత్రం 4గం.56ని.లవరకు మినహాయింపు ఉంది. ఆ తరువాత వారు కూడా ఏదీ భుజించరాదు. ఒకవేళ *వీరు* మరీ ఉండలేక పోతే రాత్రి 8గం.8 ని. ల వరకూ ఏదైనా తేలికపాటి పదార్థాలు స్వీకరించవచ్చు.

రాత్రికి భోజనాలు తినకూడదు.

*రాశి ఫలితాలు :~*
*****************
మేషం(సుఖము)          *| * * **
సింహం(సౌఖ్యాము)     *|  శుభ*
వృశ్చికం(ధనలాభము) *| ఫలములను*
మీనం(లాభము)          *|ఇచ్చును*
-----------------------
వృషభం(మాననాశము) *| * **
కర్కాటకం(స్త్రీ కష్టము)  *|మద్యమ*
కన్యా(చింత)                *|ఫలములను*
ధనస్సు(క్షతి)                *|ఇచ్చును*
-----------------------
మిథునం(మృత్యుతుల్య కష్టము) *|* *
తుల(శరీర పీడ)             *|అధమ*
మకరం(ఘాతము)         *|ఫలములను*
కుంభం(హాని)                 *|ఇచ్చును (దోషం)*
-----------------------

మంగళవారం ఉదయం

మకరరాశి వారు (ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ఠ )

శాంతి జరుపుకొన్నా మంచిఫలమును పొందవచ్చును.

రుద్రాభిషేకము, కిలోనర బియ్యం

తెల్ల ఉలవలు కిలోనర 100 గ్రాములు స్వయంపాకం, నువ్వులు దానము చేయవలెను.

అవకాశము ఉన్నా వారు శక్తి కలిగిన వారు వెండి తో చంద్రబింబమును, బంగారం తో వెండి సర్పమును , రవి బింబమును ఇవి అన్ని కంచు పాత్రలో వేసి నిండా ఆవునెయ్యి పోసి దానము చేయవచ్చును.

గ్రహణ స్నానం వివరాలు :
----------------

పట్టుస్నానం చేసి ఇష్టమైన దైవప్రార్థన,

లేదా విష్ణుసహస్రనామ పారాయణ

లలిత సహస్ర పారాయణ, ఉపదేశ మంత్రజపం విశేషమైన ఫలితాలు పొందుతారు

గ్రహణం  విడుపు స్నానం చేయవలెను.

         *|| సర్వే జనాః సుఖినోభవంతు ||*

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP