శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

శివారాధన సకలదోషాలను తొలగించి శుభములను ప్రసాదిస్తుందనటానికి ఇదొక నిదర్శనం

>> Sunday, August 13, 2017

పరమేశ్వరుడు భక్తజనవశంకరుడు . శివారాధన సకలదోషాలను పరిహరించి శుభాలను కలుగజేస్తుందనేది శాస్త్రప్రమాణం. అందుకే  జన్మరీత్యా,గోచారరీత్యా,జాతక,గ్రహదోషాదులవలన ఇబ్బందులు సూచిస్తున్నప్పుడు  శివాభిషేకం జరుపించుకొమ్మని సిద్దాంతులు,పండితులు సూచిస్తుంటారు. 

భగవదారాధన ,భగవత్ సేవద్వారా తమ సమస్యలను తొలగించుకోవచ్చని నన్నడిగినవారికి చెబుతుంటాను.ఐతే ఇందుకోసం వ్యక్తిగతంగా తామే ఈ కార్యక్రమాలు నిర్వహించటమే సరైనమార్గమని జాగ్రత్తలు చెబుతాను.

సుబ్బారావు అనే వైశ్యులకుర్రవాడు .మంచి సేవాభావం గలవాడు. మన పీఠానికి వస్తుంటాడు . వ్యక్తిగతంగా నేనంటే బాగా అభిమానం . శ్రీవారిసేవకు వెళ్ళేబ్రుందంలోనూ వస్తూ ఉంటాడు.   ధర్మబుధ్ధి కలవాడు ,కుటుంబం పట్ల కూడా అనుబంధాలపట్ల కూడా డబ్బుతో కాకుండా ఆత్మీయతతో మెలగేవాడు. కనుకనే పెద్దవాల్లు చేసిన పొరపాట్లవల్ల తన భాగం ఆస్తి కూడా పోతున్నా సరే లెక్కచేయక అనుబంధానికే ప్రాధాన్యతనిచ్చి సంతకం పెట్టిన వాడు.  ఇప్పటికే ముప్పై దాకా వయసు . వివాహం కావటం లేదు. ఇప్పుడు ఆస్తులు ఎంతవున్నాయనే లెక్కలేగాని ఆదర్శాలు ,ఆత్మీయతా లక్షణాలు ఉన్నాయా లేవా అనేది పిల్లనిచ్చేవాళ్లు,పుచ్చుకునేవాళ్లు  పరిగణలోకి తీసుకోవటం లేదు.
ఇలాంటి కారణాలు భౌతికంగాను,ఇక గ్రహచార దోషాలు జీవితాన్ని బాగా ఇబ్బంది పెడుతున్నాయి.
వీనికి అన్నీ మంచిలక్షణాలున్నాయి గాని దైవభక్తి ......లేదనలేంగాని.. ఏదో ఒక పనిలాగా చేస్తాడు. ఏకాగ్రత ఇష్టపూర్వకమైన ఆరాధన లేదు. మళ్ళీ సేవాకార్యక్రమాలలో మాత్రం ఒళ్లువంచి పనిచేస్తాడు.     వీనితోపాటు వస్తుండేవాళ్లలో చాలామంది కుర్రవాల్లకు వివాహాలయ్యాయి. వీనికి మాత్రం ఎన్ని ప్రయత్నాలు చేసినా..నేను కూడా ప్రయత్నించినా ఒక్క సంబంధం కూడా కుదరలేదు.     చివరకు  వాల్ల అక్కయ్య కూడా వీనిచేత అన్ని సహాయాలు పొందుతూ కూడా  పిల్లనివ్వాలంటే  అనేక వంకలు చెబుతూ వస్తున్నది. ఆవిడ చెప్పేవాటన్నిటికీ మూలం  మాత్రం ,,వీనికి ఆస్తిలేదు అనేకారణం మాత్రమే.

        నాకు బాగా విసుగువచ్చి  ఓమాట చెప్పాను నీవు చేసే సేవ మనుషులకు సంబంధించినది. మంచిదే  కాదనను. కానీ అదేరీతిలో  ఇష్టపూర్వకంగా భగవదారాధన చేయనంతకాలం నీసమస్యను ఎవరూ పరిష్కరించలేరు.
నువ్వుచూస్తూనే ఉన్నావు కార్తీకం లో మనం సామూహికంగా  శివారాధన మొదలుపెట్టిన నాటినుండి పాల్గొంటున్నవాళ్ల కు కలిగిన  అనుభవాలు  . వాల్లు చెబుతున్నది నీవు వింటూకూడా  నిశ్చలంగా ఆయనను సేవించలేకపోతున్నావు. శ్రధ్ధ లేదు. ఈ కార్తీకంలో  నీఇష్టమైన రోజు వచ్చి ఆరాధనలో పాల్గొనటం కాక ముప్పైరోజులు కూడా ఎన్ని ఇబ్బందులున్నా శివారాధన చేయి .అందరితోపాటు నీకు  సమయం కుదరకపోయినా సరే ..... నీవుమాత్రం ఆపకుండా  వీలైన సమయంలోనే వచ్చి నీపూజ నీవు చేసుకుని వెళ్ళు. మళ్ళీ కార్తీకం వచ్చేసరికి   నీకు వివాహం కాకుంటే నన్నడుగు .అని గట్టిగా చెప్పాను.
  క్రితం కార్తీకం లోమాత్రం  ఒక్కరోజుకూడా ఆగకుండా వచ్చేవాడు. అందరూ తెల్లవారుఝామున వచ్చి ఎవరి పార్థివలింగ వారు తయారు చేసుకుని వారి వారి అభిషేక అర్చనాదులు వాళ్లు చేసుకుని వెళతారు . ఒక్కోసారి    రాత్రిడ్యూటీ చేసి పొద్దున ఏడింటికి గాని రావటం కుదరకున్నా సరే నిద్రకళ్ళతో వచ్చైనా  శివారాధన చేసుకుని చక్కగా కార్తీకం స్వామి ఆరాధనలో గడిపాడు.

ఇంకా     ఏదారి చూపలేదేం స్వామీ! వీడు ఒకింటివాడయితే  జీవితాన్ని చక్కగా గడుపుతాడు కదా అని స్వామితో చెప్పుకుంటుండేవాడిని అప్పుడప్పుడూ పూజాసమయంలో . నాకు కాలు దెబ్బతగిలినప్పుడు ఈపిల్లవాడు చేసిన సేవ కు నేను చాలా రుణపడి ఉన్నాను. వాని పెల్లికావటానికి నేనుకూడా కాస్త కారణాన్నయితే .కొంత రుణం తీరుతుందని నాబాధ. కానీ ఇప్పటిదాకా ఎదురుచూపులే. తిరుమల శ్రీవారి సన్నిధిలో పెళ్ళిచేసుకొమ్మని అవసరమైతే నేనైనా బాధ్యత తీసుకుంటానని కూడా వాళ్లకు చెప్పాను.

స్వామి అనుగ్రహం వర్షించింది   .అనుకోకుండా  పెళ్ళి కుదరటం జరిగింది.  . మొన్న శుక్రవారం కన్యాదాతల ఇష్టాన్ననుసరించి కురిచేడు కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో పెళ్ళి జరిగింది.అమ్మాయి పేరు సుప్రియ . వెంటనే పెళ్లిబట్టలతోనే తిరుమల వెళ్ళి శ్రీవారి దర్శనం చేసుకొమ్మని చెప్పాను . వెళ్ళి వచ్చారు. రేపు సోమవారం ముక్కెళ్లపాడు లో సుబ్బారావు వాళ్లింటిలో సత్యన్నారాయణ స్వామివారి వ్రతం .అందరినీ రమ్మని ఆహ్వానిస్తున్నాడు. మీరుకూడా ఈదంపతులను ఆశీర్వదించాలని కోరుతున్నాను.

జయజయ శంకర....హరహర శంకర

1 వ్యాఖ్యలు:

Surya August 13, 2017 at 10:32 PM  

సుప్రియ-సుబ్బారావులకు వివాహసందర్భ శుభాశీస్సులు.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP