శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

కష్టపడుతూ_కూడా_నిందలు_మోస్తున్న_ప్రధాని

>> Saturday, July 15, 2017

#కష్టపడుతూ_కూడా_నిందలు_మోస్తున్న_ప్రధాని

గత కొన్నిరోజులుగా నేను ప్రధాని విదేశీపర్యటనల పై వస్తున్న జోక్స్ మరియూ వేళాకోలాలు గమనిస్తూ వస్తున్నాను. అందరికీ ప్రధాని మాటిమాటికి విదేశీపర్యటనలు ఎందుకు చేస్తున్నారు? దాని వల్ల దేశానికి ఒరిగింది ఏమిటి ? అన్న ప్రశ్న తలెత్తడం సహజం. దేశంలోని ప్రధాన మీడియా ఈ విషయాలను ప్రజల ముందు ఉంచదు. ఉద్దేశపూర్వకంగా మీడియా ఈ విషయాలను ప్రజలనుంచి దాస్తోంది. ఇక ప్రధాని విదేశీపర్యటనల వల్ల ఇంతవరకూ కలిగిన లాభాలు చూడండి.

1.సౌదీఅరేబియా మనకు ఇంతవరకూ క్రూడ్ ఆయిల్ దిగుమతులపై " On time delivery premium charges" వేస్తూ వచ్చింది. సమయానికి వస్తువు అందించినందుకు అధిక రుసుము వసూలు చేస్తూ వచ్చేది. మన పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మరియు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ లు ఈ రుసుము రద్దు చేయిన్చగలిగారు, తద్వారా దేశానికి కొన్ని వేల కోట్ల ఆదాయం మిగిలింది.

2. భూటాన్ లో మన దేశం 4 హైడ్రోఎలక్ట్రిక్ విద్యుత్కేంద్రాలు మరియూ ఆనకట్టలు నిర్మించదానికి కాంట్రాక్ట్ పొందింది.భవిష్యత్తులో గ్రీన్ ఎనర్జీ ( ప్రాకృతిక వనరుల ద్వారా వచ్చే ఎనర్జీ) లో సింహ భాగం మనకు అందుబాటులో ఉంటుంది. Green Energy వివరాలకు ఈ లింక్ చూడండి https://www.mnn.com/earth-matters/energy/stories/what-is-green-energy

3.నేపాల్ లో భారత్ అతి పెద్ద ఆనకట్ట నిర్మించబోతోంది. చైనా ఈ కాంట్రాక్ట్ పొందటానికి విశ్వప్రయత్నం చేసింది. కాని మన దేశం ఇది సాధించుకుంది. భవిష్యత్తులో 83% గ్రీన్ ఎనర్జీ దీనివల్ల మనం ఉచితంగా పొందే వీలు ఉంది.

4.జపాన్ తో సంబంధాలు ఎంతో మెరుగు పడ్డాయి. ఆ దేశం DMIC [ Delhi Mumbai Investment Corridor] లో 30 బిలియన్ డాలర్లు పెట్టుబడి కి సిద్ధమయింది.

5. వియత్నాం తో వ్యూహాత్మకంగా భారత్ సంబంధాలు మెరుగు పరచుకుంది. దక్షిణచైనా సముద్రంలో చమురు అన్వేషణకు ఆ దేశం మనకు కాంట్రాక్ట్ ఇచ్చింది. UPA ప్రభుత్వం ఇన్నాళ్ళు చైనా కు తొత్తుగా వ్యవహరిస్తూ ఈదిశగా అసలు ఏ అడుగూ వేయలేదు. మోడిి చైనా తొత్తు కాదు కాబట్టి మరియు అంతర్జాతీయంగా చైనాకు వ్యతిరేకంగా సమర్థన కూడాగట్టడంలో విజయం సాధించి దేశక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్ళటం వల్ల ఇది సాధ్య పడింది.

6. ఇరాన్ నుంచి పెట్రోల్ దిగుమతులను భారత్ పెంచుకుంది, పైగా దిగుమతులకు రుసుము మనం రూపాయిలలో చెల్లించడానికి ఇరాన్ అంగీకరించింది. దీనివల్ల మనకు ఏంతో విదేశీకరెన్సీ ఆదా అవుతుంది. పైగా మన కరెన్సీ విలువల హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా చెల్లింపులకు ఇరాన్ ఒప్పుకుంది. " చాబహార్"  పోర్టు నిర్మాణంలో కూడా మన దేశం ఇరాన్ నుండి కాంట్రాక్ట్ పొందింది. దీనివల్ల ఈ పోర్ట్ నకు రాకపోకలలో   మన నౌకలు ప్రత్యేక వీలు కలిగి ఉంటాయి. దీనివల్ల పాకిస్తాన్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటుంది.

7. ఆస్ట్రేలియా ను మనకు యురేనియం అమ్మడానికి భారత్ ఒప్పించగలిగింది. ఈ విషయంలో మోడీ తన రాజనీతిజ్ఞత తో టోనీ అబ్బోట్ ను ఒప్పించగలిగారు.

8. శ్రీలంక లో రాజపక్సే ఎన్నికలలో ఓడిపోయారు. చైనా ప్రభావం శ్రీలంక పై దీనితో తుడిచిపెట్టుకుపోయింది. శ్రీలంక విదేశీనీతి లో చైనా ప్రాబల్యం పోయి భారత్ వైపు మొగ్గు ప్రారంభం అయింది. ఇందులో RAW పాత్ర ఎంతో ఉన్నదని అమెరికా గూధచారి సంస్థ అయిన CIA బయటపెట్టింది.

9. చైనా తో వాణిజ్యలోటు బాగా పెరిగిపోయింది. మోడీ ప్రభావంతో చైనా మన దేశం లో 20 బిలియన్ డాలర్ల పెట్టుబడికి ఒప్పుకుంది. అంటే 1,40,000 వేల కోట్లు అన్నమాట. దీనివల్ల చైనా వస్తు నిల్వలు తగ్గుముఖం పట్టి వాణిజ్యలోటు తగ్గుముఖం పడుతుంది.

10. ఇక దేశరక్షణలో  జాతీయ భద్రతా సలహాదారు అయిన " అజిత్ దోవాల్" ఒక తురుపు ముక్క అనే చెప్పాలి. పెంటగాన్ కానివ్వండి, ఇస్రాయిల్ కానివ్వండి, జపాన్ కానివ్వండి - భారత్ తో ఎన్ని ఒప్పందాలు చేసుకున్నాయో చూడండి. 2008 నవంబర్ తరహా దాడులు ఇంకొకసారి పునరావృతం కాకుండా పాకిస్తాన్ పడవలను మన ప్రభుత్వం సముద్రంలోనే ఎలా పేల్చివేసి భారతీయులను కాపాడిందో గుర్తు తెచ్చుకోండి. " ఇంకొక సారి పాకిస్తాన్ అటువంటి దాడికి తెగబడిందా- ఇక అది బెలూచిస్తాన్ ను వదలుకోవాలసిందే" అని ధైర్యంగా గర్జించిన ప్రధానిని మీరు ఇంతకుముందు చూసారా? చెప్పండి.

11. మన ఈశాన్య రాష్ట్రాలలో సరిహద్దు రోడ్ల నిర్మాణానికి అనుమతించింది ఈ ప్రభుత్వమే. ఇంతవరకు ఈ ఫైలు UPA హయాంలో పక్కన పెట్టబడింది. Asian Development Bank కూడా చైనా ఆక్షేపణలను దృష్టిలో ఉంచుకుని మనకు నిధులు విడుదల చేయలేదు. దీనివల్ల  మన రక్షణ విషయంలో గత ప్రభుత్వం ఎంత నిర్లక్ష్య ధోరణి వహించిందో తెలుస్తోంది. ఇప్పుడు చూడండి మన సైన్యం ఎంత రెట్టించిన ఉత్సాహంతో ఉరకలు వేస్తోందో!

12. భారత్, యుద్ధవాతావరణం లో ఉన్న "యెమెన్" దేశం నుంచి 4500 పైగా భారతీయులను క్షేమంగా స్వదేశానికి తీసుకు వచ్చింది.  ఆ సమయంలో సౌదీ అరేబియా దేశం యెమెన్ పై దాడులు చేస్తోంది. కొన్ని గంటలు కాల్పుల విరమణకు సౌదీ అరేబియా ను ఒప్పించి మన దేశం విమాన సర్వీసులను నడిపింది. అవన్నీ మన మంత్రులు సుష్మా స్వరాజ్, జనరల్ వీ.కే. సింగ్ మరియూ మన భద్రతా అధికారి  అజిత్ దోవాల్ లు దగ్గర ఉండి మరీ పర్యవేక్షించారు. అదికాక 41 దేశాలనుంచి ఇబ్బందులలో ఉన్న వివిధ భారతీయులను వివిధ సమయాలలో క్షేమంగా ఇంటికి చేర్చింది. భారత్ నిబద్ధత పట్ల ప్రపంచ దేశాలు ఎన్నో భారత్ ను కీర్తించాయి.

13. భారత వైమానిక దళం రోజు రోజుకూ బలహీనపడుతూ వస్తూ ఉంటే, మోడీ ప్రభుత్వం రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు అధిక ప్రాధాన్యతను ఇచ్చింది. ఫ్రాన్స్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన 36 విమానాలకు పచ్చజెండా ఊపింది. మధ్యవర్తులు లేరు. కమిషన్లు లేవు.

14. 42 ఏళ్లుగా ఏ ప్రధానీ కూడా కెనడా వెళ్ళలేదు, కానీ మోడీ అక్కడకు వెళ్ళింది సరదా కోసం కాదు, కెనడా ని ఒప్పించి రాబోయే 5 సంవత్సరాలకు మన అణువిద్యుత్ కేంద్రాలకు యురేనియం ను కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది మన ప్రభుత్వం. అంతే కాదు, కెనడా ప్రభుత్వం భారతీయులకు Visa on arrival కు అంగీకరించింది.

15. ఇంతవరకూ మనం అణు రియాక్టర్ లకై అమెరికా, రష్యా లను అడుక్కుంటూ వస్తున్నాము. వారు మనపై ఉన్న అనుమానాలతో ఎంతవరకూ అవసరమో అంతవరకే ముష్టి వేస్తూ మనం అడిగినవన్నీ కాక వారు ఇవ్వదలచుకున్నవే ఇస్తూ వచ్చేవారు. అటువంటిది మోడీ ఫ్రాన్స్ ప్రభుత్వాన్ని ఒప్పించి Make in India లో భాగంగా ఫ్రాన్స్ మనతో కలసి అణుశక్తి నిర్మాణాలలో భాగం పంచుకునేలా చేయగలిగారు.

16. అమెరికా అధ్యక్షుడు ఒబామా రిపబ్లిక్ డే ఉత్సవాలకు భారత్ వచ్చినపుడు ఆయనను ఒప్పించి Nuclear Fuel Tracking అనే నియమాన్ని అమెరికా పక్కన పట్టేలా చేసారు మన ప్రధాని. దీనివల్ల 16 కొత్త అణు రియాక్టర్ లకు మార్గం సుగమం అయింది.దీనితో మన దేశం లో ఇక విద్యుత్ కొరత అనేది లేకుండా చేయడంలో మన కృషికి మార్గం సులువైంది.

ఈ విషయాలు విదేశీ తొత్తులైన మన ప్రధాన మీడియా మీకు చేరవేయదు. ఇప్పుడు మీరే ఆలోచించండి, ప్రధాని విదేశీ పర్యటనలు భారత్ కు ఎంత మేలు చేసాయో! మీకు నచ్చితే దీనిని షేర్ చేయండి.

This translation in Telugu was done for an original English post , honouring the suggestion of my facebook friend Sri Bhamidipati N Sarma.

1 వ్యాఖ్యలు:

srinivasrjy July 15, 2017 at 9:10 PM  

క్రింది వీడియో చూడండి ... ఎంత అద్భుతంగా ఉందొ ... మీరు చెప్పిన విషయాలు అన్నీ అందులో ఉన్నాయి


https://www.youtube.com/watch?v=TwjKlwYYIcI

మోడీ డి గ్రేట్

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP