శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఎవరు ముందు చెప్పినట్లు? నేటి శాస్త్రవేత్తలా ? నాటి మన ఋషులా ?

>> Tuesday, May 2, 2017స్త్రీ యొక్క మానసిక స్థితి ప్రభావం ఆమె గర్భంలోని పిండంపై పడుతుందనేది ఫ్రాయిడ్ చెప్పిన సిద్ధాంతం కదా!
          మరి ఈదేశంలో ఎప్పటినుంచో గర్భవతులు భక్తిగాథలూ వీరగాథలూ వినాలనీ చదవాలనీ ఎల్లపుడూ అందమైన ఆరోగ్యవంతమైన బిడ్డకోసం శ్రీరాముని చిత్రపటాన్ని చూస్తుండాలనీ స్మరించుకోవాలనీ..భయంకర వార్తలూ విషాదసంఘటనలకూ దూరంగా ఉండలనీ ఈ ఫ్రాయిడ్ చెప్పకముందునుండే ఎలా చెప్పేవారబ్బా??

బిగ్ బ్యాంగ్ థీరి ఒక అగ్నిగోళం బ్రద్ధలయి స్రుష్ఠి ఏర్పడిందని తేల్చింది కదా!
మరి మన దేశంలో అనామకుడు సైతం" బ్రహ్మాండం బద్దలయ్యిందనే "వేదజనిత స్రుష్ఠి మూలం పలుకుతున్నాడెలా??

భూమి మీద ప్రక్రుతి ఏర్పడి దాదాపు 200కోట్ల సంవత్సరాలయిందని నేటి సైటింష్ఠులు చెబుతున్నారు కదా!
       మరి మన పురాణాలు చెప్పే కాలమాణం ప్రకారం యుగాలు మహాయుగాలూ మన్వంతరాలూ సంధికాలం లను లెక్కేస్తే...మనం శ్వేతవరాహ కల్పంలో 28 వ మహాయుగంలో కలియుగంలో ఉన్నామని ప్రస్తుత సంవత్సరం ...అంటే 2017 నాటికి 197,29,49,119 సంవత్సరాలు అవుతోంది...మరి సైంటిస్టుల కాలగణనతో సరిపోతోందెలా??

బిగ్ బేంగ్ జరిగి విడిపోయిన పదార్థం వల్ల స్రుష్టి ఏర్పడిందని అది తిరిగి కేంద్రం వల్ల ఆకర్షింపబడి పదార్థం ఏర్పడటం వల్ల స్రుష్ఠి నశించి శూన్యం అవుతుందనీ అది తిరిగి మల్లీ బ్రద్దలయి స్రుష్ఠి మొధలవుతుందని ఇలా జరుగుతునే ఉంటుందని నేటి సైన్స్ చెప్పిన విశ్వముఖులిత సూత్రం కదా!
       మరి వేదసారమైన భగవద్గీత లో చెప్పబడిందేంటి?ప్రతి కల్పం అంతమందు సకల ప్రాణులూ తనయందు లీనమవుతాయని మళ్ళీ కల్పం ఆరంభంలో అన్నీ తననుండి పుట్టుకొస్తాయని భగవానుడు చెప్పినట్లు ఉందెలా??

ప్రతీ చర్యకూ సమాన స్థాయిలో ప్రతిచర్య ఉంటుందనేది న్యూటన్ చెప్పిన సూత్రం కదా!
    మరి వేల సంవత్సరాలనుండి భారతదేశంలో వినిపించే కర్మసిద్ధాంతం చెప్పేది ఏంటి??ఎవరు ముందు చెప్పినట్లు?

తొలివిమాన నిర్మాణం చేసిన మేధావులు రైట్ సోదరులు కదా!
      అంతకుముందునండే భారతీయులకు ఉన్న విమానశాస్ర్తాన్ని కూడా కాస్త పక్కనపెడదాం..రైట్ సోదరుల కంటే ముందు శివరాం బాపూజీ తళ్పాడే అనే పండితుడు మన పురాతన గ్రంధాల ఆధారంగా తయారుచేసిన "మరుత్సబి"గాలిలో ఎగిరింది కదా..మధ్యలో ఆగిపోయిన ఆవిమాన ప్లాన్ ని ఈయన వారసులు ఓ ఆంగ్లేయ కంపెనికీ అమ్మినట్లు తెలుస్తోంది...మరి అది ఏమైనట్లో...ఆ ప్రస్తావనే తేదెందుకు ఈ ప్రపంచం...

మొక్కలకు ఫీలింగ్స్ ప్రాణం ఉన్నాయని నిరూపించింది మన  దేశీయుడైన శాస్ర్తవేత్త జగదీశ్ చంద్రబోస్ కదా!
   మరి ముందు ఈ విషయం మనవారికి తెలియదా?మన గ్రంధాలలో వ్రుక్షాల భావాల ప్రస్తావనలు లెక్కలేనన్ని ఉన్నాయే...మన ఋషులు మొక్కలను ప్రార్థించే దర్బలను సేకరించేవారు(భాధ పెడుతున్నందుకు క్షమించమని)..మరి వారికి ఈ విషయాలు తెలియదనే అనుకుందామా...

పెద్దపెద్ద వ్రుక్షాలయే మొక్కల్ని రూపలక్షణాలు మారకుండా కుండీలలో చిన్నమొక్కలుగా పెంచే ప్రక్రియ"బోనోసాయ్"నేటి విజ్ఞాణశాస్ర్తం కదా!
     మరి భారతీయ ప్రాచీన ఆయుర్వేద ఋషి చరకుడు తన చరకసంహిత గ్రంథంలో "వామన తను వ్రుక్ష్యాది విద్య"అను ప్రకరణంలో వైద్యానికి ఉపయోగించే పెద్దవ్రుక్షాలను గుణం చెడకుండా చిన్నమొక్కలుగా పెంచే ఈ విధానాన్నే తెలిపాడెలా??

సముద్రగర్భంలో అగ్నిపర్వాతాలు ఉన్నట్లు మనం ఈమధ్య గమనించినట్లు చెప్పుకుంటాం కదా!
      మరి మన పురాణాలకాలం వారికి ఈ "బడభాగ్ని"గురించి ఎలా తెలిసిందబ్బా...

లోహవిజ్ఞాణంలో నేటిమనం చాలా అడ్వాన్స్ గా ఉన్నమని చెబుతాం కదా!
      మరి ప్రాచీన భారతీయులు ఢిల్లీలో నిర్మించిన ఇనుప స్తభం ఇప్పటికీ త్రుప్పు పట్టకుండా నిలిచి ఉంటే దానికి పోటిగా ఆధునికులు నిర్మించిన ఇనుప స్తభం త్రుప్పపట్టి కనిపిస్తుందెలా??

నిర్మాణ రంగంలో ఆధునికులు చాలా ముందున్నాం అని చెప్పుకుంటాం కదా!
       మరి వేల సంవత్సరాల నాటి ఆలయాలు కోటలూ ఇప్పటికీ నిలచి ఉంటే గత 500సం లోపు నిర్మాణాలు నిలబడుటలేదేమి?
గోల్కొండకోటలోని శబ్ధప్రసారపద్దతి వివిధ దేవాలయాలోని సంగీతం పలికే స్తంభాలూ శివాలయంలో లింగంపై చెక్కుచదరని నీడ పడే నిర్మాణాలూ.....వీటన్నిటికీ ప్రాచీన భారతీయులకు నేటి ప్రపంచం ఇచ్చే సమాధానమేంటి??

అణువు పరమాణువు గురించి వాటిలోని శక్తి గురించి ఆధునికులకు మాత్రమే తెలుసు కదా!
      మరి భారతీయ గ్రంధాలు తిరగేస్తే పరమాణువుల గురించి "వైషేశిక సూత్రం"అంటూ ఓ గ్రంధమే కనిపిస్తౌందే...దీనిని రాశిన కశ్యపుడను ఋషికి కణాల వివరణ చెప్పిన కారణంగా కణాదమహర్షి అను పేరువచ్చినట్లు తెలుస్తోంది....ఎవరు ముందు చెప్పినట్లు??

మెండలీఫ్ ఆవర్తన పట్టికలో పాదరసం,బంగారం పక్కపక్కన చూపించేవరకూ పాదరసం నండి బంగారం చేయవచ్చని మనకు తెలియదు కదా!
        మరి వీటి గురించి తెలీకుండానే మన పూర్వీకులు ఈపని ఎలా చేశారు...ఈ పని చేసేవారిని "రసవాదులు"అనికూడా పేరెట్టి పిలిచారే.....

సూర్యుడు ఓ నక్షత్రమనీ చాలా నక్షత్రాలలో సూర్యుడు కూడా ఒకడు మాత్రమేనని మన నేటి శాస్రజ్ఞుల విజ్ఞిణం కదా!
     మరి మన పూర్వీకులకు ఇది తెలియకుండానే అరుణ మంత్రంలో "సప్తదిశో నానా సూర్యాః"అని చెప్పారనుకుందామా??

భూమినుండి విడివడిన కొంతభాగమే చంద్రుడనీ ఆ భాగం విడివడిన చోటు పసిఫిక్ మహా సముద్రం ఏర్పడిందనీ శాస్ర్తవేత్తల పరిశీలన కదా!
       విజ్ఞాణాన్ని కథలుగా చెప్పే సంస్క్రుతి గల మన దేశ పూర్వులు చెప్పిన సాగరమధనం కథ ద్వారా బాగా గమనిస్తే తెలిసేదేంటి?పాల సముద్రం నుండి చంద్రుడు పైకెగసినట్లు చెప్పారే...

ప్రపంచం నేడు చదువుతున్న చరిత్ర ప్రకారం గ్రహణం గురించి మొదటగా చెప్పింది చైనావారని చెప్తున్నారు కదా!(2137 క్రీ.పూ)
అంతకు పూర్వం వాడైన అత్రిమహాముని చరిత్రకు పనికిరానివాడెలా అయ్యాడు?ఆయన తయారు చేసిన "తురీయ బ్రహ్మ"అనే టెలిస్కోప్ సహాయంతో మొదటగా గ్రహణం పరిశీలించాడే(ఋగ్వేదం 5వమండలం 40-6 మంత్రం)
ఈ విషయం మన గ్రంధాలలో అనేక చోట్ల కనిపిస్తోందని శ్రీ బాలగంగాధర్ తిలక్ తేల్చారు కూడా.....

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో....మనకు జరిగిన అన్యాయం వర్ణించలేనిది...రాతి యగంలో వేదాలు రాశిన వారికి అంత జ్ఞాణం ఉండదని విదేశీయులు నేర్పిన చిలకపలుకులు నేటికీ వల్లే వేసే బానిస మనస్కులు తెలుసుకోవలసిందీ ఒకటుంది...రాతియుగం పరాయి పాలన...అంతకుముందంతా రత్నయుగమేనని...

భారత్ మాతా కీ జై!!    Mundur rosayya narayana garu from whatsapp

9 వ్యాఖ్యలు:

Raabite May 3, 2017 at 12:58 AM  

మరి సూర్యుడు సప్త అశ్వాల రధం మీద తిరుగుతుంటాడని కూడా వాళ్ళే కదా చెప్పింది?

భూమిని ఆది శేషుడు మోస్తున్నాడని కూడా మన వాళ్ళు ఎప్పుడో నిరూపించేశారు.

ఎన్నని అడగను, గొంగట్లో ఎంట్రుకలు

durgeswara May 3, 2017 at 9:17 AM  
This comment has been removed by the author.
శ్యామలీయం May 3, 2017 at 9:23 AM  

చాలా సంగతులు ప్రతీకాత్మకంగా చెప్పటం జరిగింది. అది సరే. ఎంట్రుకలు?


durgeswara May 3, 2017 at 9:32 AM  
This comment has been removed by the author.
durgeswara May 3, 2017 at 9:34 AM  
This comment has been removed by the author.
durgeswara May 3, 2017 at 9:35 AM  
This comment has been removed by the author.
durgeswara May 3, 2017 at 11:14 PM  

సప్తాశ్వాలు అంటే సప్తవర్ణాలు . ముందు తెలుసుకోవాలనే తపనతో మన శాస్త్రాలను అధ్యయనం చెస్తే తెలుస్తాయి. కానీ మెకాలే మానస పుత్రులకు అంత ఓపిక ఉందదు. కాదు కాదు.. నిజం తెలుసుకోవాలనే కోరికే ఉండదు. ఈ ధర్మానికి దేశానికి వ్యతిరేక భావజాలం పాతుకుపోయుంది మనసులలో

ketan May 7, 2017 at 6:02 AM  

అంటే సప్త వర్ణాలవల్ల గమనంలో ఉన్నాడా? అదీకాక సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతుంటాడా? ఇది సైన్సేం?

బిగ్ బ్యాంగ్ థియరీ కరెక్టని ఇప్పటి సైంటిస్టులు భావించడంలేదు. మీరు ఖంగారు పడాల్సిన అవసరంలేదు. String theoryనో, Quantum Tunneling, p-Brane theory భగవద్గీతలో చెప్పబడే ఉంటుంది. మీకు వెదకడానికి ఒక యాభైయేళ్ళు పట్టొచ్చు. ముందు సైన్సు చెప్పాలిగా ఏది రైటో!

Seriously!! Alchemy is science! You are kidding right?

భారతీయ గ్రంధాలు అన్నిఒ వాదనలూ చేశారు. ఒకచోట భూమి గుండ్రంగా ఉంటే, ఇంకోచోట చపాతీలా ఉంటుంది. ఒకసారి గుండ్రంగా ఉంటుందని తెలిస్శాక మన వేదమేధావులు గుడ్రంగా ఉందని చెప్పబడిందనే వాదాన్నిమాత్రమే ముందుకు తెస్తారు.

మనదేశంలో మనుమానసపుత్రుల కుట్ర సాగుతోంది. జనాల్ని సైన్సునించి మళ్ళించి తమ స్వకపోలకల్పిత అజ్ణానంలో బంధించి పాతకాలంలోలా డబ్బు, అధికారం చేసుకుందామనుకొనే పాఖండుల ప్రభ పెరుగుతోంది.

అవి ప్రతీకాత్మకమే ఐతే అదేమాట మీరు పోస్టురాసినాయనకు చెప్పరేమండీ! ఆయన అక్షరాలా నిజమని నమ్ముతుంటేనూ...

ఈ కామెంటు పబ్లిష్ ఐతే నేను point to point సమాధానం చెప్పి మీరు తప్పని ఋజువు చెయ్యగలను. మీరు పబ్లిష్ చేయగలరా?

durgeswara May 8, 2017 at 3:15 AM  

నేను గతంలో ఒక టీవీ చర్చ చూశాను. అందులో ఒక కరుడు గట్టిన హిందు వ్యతిరేకవాది ,ఇంకొక కుర్రవాడు మనశాస్త్రాలలో సైన్స్ ఎంత అనే దానిపై చర్చిస్తున్నారు. మన కు గ్రహాలగూర్చి గాని నక్షత్రాలగూర్చిగాని తెలియదు తెలియకే నవగ్రహాలు అదీ ఇదీ అనిచెప్పారు అంటాడు మొండిగా అతను. ఈ కుర్రవాడెమో మనకు తొమ్మిదిగ్రహాలలో రెండు చాయా గ్రహాలని పోనీ అలాకాకున్నా ఏడుగ్రహాలనైనా చెప్పారు . కదా అదీ విజ్ణానమే కదా అంటాడు. అదెలా అవుతుంది? తొమ్మిది గ్రహాలని కనిపెట్టి చెప్పింది సైంటిస్టులే
పాశ్చాత్యులు లేకుంటే మనకు అంధకారమే అని మొండిగా వాదిస్తున్న ఆయనను చూసి జనం నవ్వుకోవటమే మిగిలింది. ఇప్పుడు నవగ్రహాలుకాదు గ్రహాలు ఎనిమిదే అని మన సైంటిస్టులు చెబుతున్నారు కదా అంతమాత్రం చేత వారు ఏమీ తెలియని వారా?
ఇక్కడ వాదనలు చేసే వాల్లటైపు వాదనలు నేను బ్లాగులలో కొచ్చిన మొదట్లో అంటే ఎనిమిది తొమ్మిది సంవత్సరాలక్రితం చాలా భారీగనే కనపడతాయి చూడండి .చిన్నపిల్లవాడికి అంటే రెండు మూడు క్లాసులవానికి పాఠాలు చెప్పేప్పుడు గ్రహాలగూర్చి వివరాలు సూచనప్రాయంగానే చెప్పటం సాధ్యమవుతుంది పలకమీదే అంతా దిద్దించతం సాధ్యం కాదు. ఆసబ్జక్టుపట్ల ఆసక్తి కలిగి విస్త్రుతంగా చదివి పరిశోధనా స్థాయిలో పెద్దపెద్దపుస్తకాలుగా నిష్ణాతులచే ఇవ్వటం కుదురుతుంది. అంతే తప్ప పూర్తిస్తాయిలో,బ్లాగులలాంటి చిన్నవేదికలపై అదంతా వ్రాయటం సాధ్యం కాదు. వీళ్ళబుర్రలు సైంటిఫిక్ రీజన్ కంటే హిందూ వ్యతిరేక హిస్టీరియా జబ్బుతో నిండిపోయాయి .అందువల్ల ముందు శాస్త్రాలలో ఏముందో చదివి ఆతరువాత చర్చించినా బాగుండు.అలానూ చేయరు. మనువు ఎంతటి గొప్ప సామాజిక నియమాలు ఇచ్చాడో ఒక్కముక్క చదువరు. దానిలో వీళ్లలాంటి బాపతు జనమే మూర్ఖంగా చొప్పించిన ప్రక్షిప్తాలను పట్టుకు ని వేలాడుతుంటారు. అసలు ఈ యుగానికి మనుధర్మ శాస్త్రనియమాలు పూర్తిగా వర్తించవని యుగధర్మాలననుసరించి సవరించాల్సి వస్తుందని మన మహర్షులు చెప్పారన్న విషయమే వీళ్లకు తెలియదు. అందువలన అంతర్జాలంలో ఈ పోస్ట్ వ్రాసిన రచయిత ఉద్దేశ్యంగానీ, ఇక్కడ దీనిని నాబ్లాగులో ఉంచిన నాఉద్దేశ్యం గానీ వీల్లకు అర్ధం కాదు. పై పోస్ట్ లో ఒక్క టంటే ఒక్క నిజమునూ వీళ్లంగీకరించరు. బాబూ! భూమి గుండ్రంగా లేదు ఒత్తబడిన వెలగపండు ఆకారం లో ఉందని మన రుషులు చెప్పినవిషయం ధ్రువాలదగ్గర భూమి ఒత్తబడినట్లుగా ఉంటుందన్న నేటి రుషులు [సైంటిస్ట్లు] మాట ఒకటే నన్నా వీరునమ్మరు గట్టిగా చపాతీ వాదనలు నమ్మి ఉంటారు. కనుక ఇక్కడ వాదనలు వ్రుధా గతంలో చాలామంది వీరులను చూశాము. వారి ప్రగాల్భాలతో గొంతుకలిపి గోలచేసే సమయము నాకు లేదు. ఒక పని చేయండి నేను నమ్మిన సత్యం నేనిక్కడ ఎలా వ్రాశానో మీరనుకున్నవి మీరు మీ బ్లాగులలలోనో, మరో వేదిక పైనో వ్యక్తం చేసుకోండి. అక్కడకు వచ్చి మీకు సమాధానం చెప్పే తీరిక ఉన్నవారేవరో తప్పనిసరిగా తటస్థిస్తారు.ఇకపై వీళ్ళకామెంట్లు ప్రచురించను .అందువలన వారు నాకు పంపటం వలన వారి శ్రమ వ్రుధా అవుతుంది
ఒక్కటి మాత్రం నిజం మనువువంటి గొప్పరుషుల వారసత్వాన్ని పొందిన హైందవులు మానవవాదులు . నాకు తెలిసినదే సత్యం మిగతాదంతా అబద్దమనే మూర్ఖత్వ వాదులు కాదు. "నేతి...నేతి..." అంటే ఇదేకాదు ఇంకా సత్యం కోసం అన్వేషిస్తూ ముందుకెళ్ళు అని చెప్పిన వేదం బాటలో నడిచేవారు .. జైశ్రీరాం

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP