శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అమ్మ సాక్షాత్కారించిన ఈ చిత్రం ..మనకు లభించటం పూర్వ జన్మ సుకృతం

>> Monday, May 1, 2017

[
అమ్మ  సాక్షాత్కారించిన   ఈ చిత్రం  ..మనకు లభించటం పూర్వ జన్మ సుకృతం

అయ్యా, పరమ పూజ్యనీయులు శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రులుగారు, వారి సతీమణి గార్ల గురించి దాదాపుగా తెలియని వారుండరు అంటే అది అతిశయోక్తి కాదు...(పూజ్యులు శ్రీ చాగంటి గురువుగారు మరియు శ్రీయుతులు సామవేదం గారు మరియు ఇతర ధార్మిక ఉపన్యాసకులు ధర్మమా అని) వారు, వారికి శ్రీ బాలా త్రిపురసుందరీ దేవిపైనున్న అచంచలమైన భక్తి ప్రపత్తులవల్ల ఆ తల్లి శ్రీ తాడేపల్లి వారి ఇంట ఎల్లప్పుడూ నడయాడుతూ ఉండేదట అనేది చాలామందికి​ తెలిసిన విషయమే.... ఐతే ఒకానొక సమయంలో వారి ఇంటికి దగ్గరగా ఉన్న వేరొకరి ఇంటికి చుట్టపు చూపుగా వచ్చినాయన(వారెవరో.అంటే ఆ పుణ్యాత్ములు ఎవరో.... శ్రీ కేవీఎస్ఆర్ మూర్తి గారికి తెలిసిఉంటే చెప్పగలరు) ఏదో కాకతాళీయంగా పూజ్యులు శ్రీ తాడేపల్లి వారి ఇంటివైపు కెమేరా తో ఫోటోలు తీసి ఆయన తరువాత ఎప్పుడో వాటిని కడిగిస్తే అందులో ఒక చిత్రాన్ని చూసి అందరూ ఎంతో విస్మయానికి గురయ్యారు. ఆ ఫోటోలో ఒక చిన్నారి బాలిక రూపం ఉన్నదట...ఆ బాలిక ఎవరూ అని తాడేపల్లి వారి ఇంట్లోను, చుట్టుప్రక్కల ఇళ్ళల్లోను, ఇంకా దాపులనున్న గ్రామాలలోకూడా వాకబు చేశారట... ఆతల్లి ఎవరు అనేది చెప్పగలిగే జ్ఞానం ఉన్నవారెవరుంటారండీ....? ఆవిడ సాక్షాత్తు అమ్మలగన్నయమ్మ శ్రీ బాలత్రిపుర సుందరీదేవి కాక మరెవరు...? నాకు ఒక సంవత్సరం క్రితం నా ప్రాణస్నేహితునిద్వారా ఆ చిత్రం లభించింది. తను ఆ మహాతల్లి ఉన్న చిత్రం మరొకరికి పంపడానికి తటపటాయించాడు, ఐతే ఈరోజు శ్రీ మూర్తి గారు పంపిన ఆ పుణ్యదంపతుల చిత్రం చూశాక ఇక ఉండబట్టలేక ఆ బంగారుతల్లి రూపాన్ని తామందరితో పంచుకోవాలనిపించి పంపుతున్నాను...అమ్మవారు ఫోటోలకు ఎలా చిక్కుతుంది అనే వితండానికి పోకుండా అందరూ దర్శించుకుంటారు అనే విశ్వాసం తోం పంపుతున్నాను... ఐనా, ఆ తీసిన మహానుభావుడు ఎవరో ఆయనకి సాక్షాత్కారమవ్వాలని ఆతల్లి భావిస్తే... అలా కనిపించడం ఆవడకెంతపని....?

[అంతర్జాలం నుండి  లభించిన అదృష్టం ]    gowri shankar   gaari dvaaraa
:::

3 వ్యాఖ్యలు:

సురేష్ బాబు May 1, 2017 at 5:43 PM  

దుర్గేశ్వర్ గారు, ఇటువంటి చిత్రం మాతో పంచుకొన్నందుకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడం లేదు..

Zilebi May 1, 2017 at 8:38 PM  
--

అంబ కనబడె జిలేబీ !
బింబముగా ప్రతిమ గాను వివరము తెలియవ్ !
శాంభవి గన్పడ కరణము
గంపెడు లేదోయి నమ్మకము వలయు సుమీ !

జిలేబి

prabhanews giddalur May 20, 2017 at 4:01 PM  

అమ్మ దర్శనం పూర్వ జన్మ పుణ్యఫలం. తన లీలలు చూ పేందుకు ఆ తల్లి పుణ్య దంపతుల ఇంట దర్శనమిచ్చింది. జై జగన్మాత

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP