శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

కొత్త నోట్లు కట్టలు కట్టలు గా ఎలా దొరుకుతున్నాయి ?

>> Monday, December 19, 2016

 కొత్త నోట్లు కట్టలు కట్టలు గా  ఎలా దొరుకుతున్నాయి ?
 facebook topics
మనకందరకు తెలిసిన విషయమే. పులిని వేటాడాలంటే, ముందు ఎరను ( దీనినే దీవు అంటారు ) కట్టాలి. ఆ పులి ఆ దీవు దగ్గరకు పరుగెత్తుకుంటూ రాదు. నక్కి నక్కి, పరిస్తితులు, గమనిస్తూ మెల్లగా వస్తుంది. అంతవరకు వేటగానికి సహనం ఉండాలి తొందరపడితే గురితప్పుతుంది. - ఆదును చూచి తుపాకీ పేలాలి. ఈ నల్లదనం వేటా అలాంటిదే. అదెవ్యూహమ్. ముందు 2,000 నోట్లు విసిరారు. ఎక్కడి ఏ మార్గంలో వెళుతున్నాయో , గమనిస్తునారు, ఈ నెలాఖరుకు పాతవి రావలసివి అన్ని వస్తాయి. ఉచ్చులో పడ్డ నల్ల కుబేరులు, కొత్తనోట్లతో సహా పాత నోట్లు, బంగారం, బినామిలు, అన్ని వేటగానికి దొరుకుతాయి. సహనం ప్రస్తుతం అవలంబంచ వలసిన విధానం తరుణం. - సహకరించండి.
 జాజి శర్మ
పద్ధతి నేను పెద్దగా పట్టించుకోను.
కాని, దేశద్రోహులను పట్టకుని తీరాలి.
వేగులే పట్టిస్తున్నారు: ఐటీ శాఖ
న్యూఢిల్లీ, డిసెంబరు 14: దుర్భిణి వేసి కనిపెట్టినట్లు, గురిచూసి కొట్టినట్లు... సరిగ్గా డబ్బు ఉన్న చోటికే ఐటీ అధికారులు ఎలా వెళ్తున్నారు? కొత్త రెండువేల నోట్లను ఎలా పట్టేస్తున్నారు? కార్లు, హోటల్‌ గదులు, బ్యాంకు లాకర్లు, చివరికి బాత రూమ్‌ భోషాణాలను సైతం ఎలా బద్దలు కొట్టగలుగుతున్నారు? నిజంగానే రెండువేల నోట్లలో ‘చిప్‌’ ఏదైనా ఉందా? ఇవి సామాన్యుల సందేహాలు! పెద్దనోట్ల రద్దు తర్వాత 200 చోట్ల సోదాలు జరిగాయి. ప్రతిచోటా కొత్త 2వేల నోట్లు దొరికాయి. దీనికి కారణాలపై ఆరా తీయగా... ‘వ్యూహాత్మక ప్రాంతాల్లో నియమించిన వేగులు అందించిన సమాచారంతోనే కొత్త కరెన్సీ గుట్టు రట్టు చేస్తున్నాం’ అని ఐటీ అధికారులు తెలిపారు. ‘వ్యూహాత్మక ప్రాంతాలు’ అంటే... బ్యాంకులు, మార్కెట్లు, నగల దుకాణాలు ఇలాంటివన్న మాట! కాగా.. కొత్త నోట్ల ముద్రణలో ఫాస్పరస్‌ రేడియోధార్మిక ఐసోటోప్‌ పీ32ను స్వల్ప మోతాదులో ఉపయోగించారనే వార్తలు వ్యాపిస్తున్నాయి. ఈ రేడియో ధార్మక పదార్థం వల్ల ప్రమాదం ఉండదని... నోట్ల ఉనికిని మాత్రం పట్టిస్తుందని సోషల్‌ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆర్బీఐ, ఆర్థిక శాఖ ఎటువంటి ప్రకటన చేయలేదు.
జయహో! నరేంద్ర మోదీజీ! భారతమాతా కీ జై!

2 వ్యాఖ్యలు:

sarma December 19, 2016 at 5:10 AM  

వీటి గురించి చెప్పడానికి మీడియాకి నోరు రావటం లేదండి

Zilebi December 21, 2016 at 2:04 PM  



>>>త్త నోట్లు కట్టలు కట్టలు గా ఎలా దొరుకుతున్నాయి

అంతా 'హరి ' సేవ మహాత్మ్యమం :)

జిలేబి

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP