శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

హనుమత్ రక్షాయాగం పూర్ణాహుతి ఉత్సవమునకు ఆహ్వానం .

>> Thursday, May 26, 2016

భగవద్బంధూ!
    
   హనుమత్ప్రభువుల  అనుగ్రహంతో మొదలైన హనుమత్ రక్షాయాగం ఎనిమిదవ ఆవృతి  నిర్విఘ్నంగా కొనసాగుతూ ఇరవై ఎనిమిదవ తేదీ  పూర్ణాహుతి జరగనున్నది.  ఇప్పటివరకు ఈ కార్యక్రమములో పాల్గొంటూ శ్రీరామ నామమును లిఖిస్తున్న భక్తులందరూ రామనామ లేఖన ప్రతులను యాగశాలకు చేరేలా పంపగలరు. అలాగే ఇరవై ఎనిమిది   శనివారం  జరిగే పూర్ణాహుతి కార్యక్రమమునకు సకుటుంబ సమేతంగా విచ్చేసి స్వామి వారి తీర్థప్రసాదములను స్వీకరించాలని ఆహ్వానిస్తున్నాము. 

ఈ సంవత్సరం ఎండల తీవ్రత ఎక్కువగానున్నందున    తెల్లవారు ఝామునుండే  కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. ప్రభాతకాలంలోనే స్వామివారికి అష్టోత్తర కలశాభిషేకం. అర్చనలు  జరుపబడతాయి, అనంతరం యాగపూర్ణాహుతి  జరుపబడుతుంది. తీవ్రవడగాల్పులవలన ఒక్క యజ్ఞ కుండము మాత్రమే  ఏర్పాటు చేయటం జరుగుతున్నది.వచ్చిన భక్తులందరికీ  అన్నపూర్ణభిక్షాశాలలో అన్నప్రసాదవితరణ జరుపబడుతుంది.

       ఇక ప్రతిసంవత్సరం  పూర్నాహుతి తరువాత  ,శ్రీవేంకటెశ్వరస్వామివారికి శ్రీదేవీ,భూదేవి వార్లతోనూ
భవానీ సమేత రామలింగేశ్వర స్వామివారికి కూడా కళ్యాణోత్సవములు జరిపేవారము. కానీ  ఈసంవత్సరం ఎండలతీవ్రత వలన కళ్యాణోత్సవములను   నిర్వహించుటకు కుదురుటలేదు.

యాగంలో పాల్గొనదలచిన భక్తులందరూ శుక్రవారం రాత్రికే పీఠమునకు చేరుకుంటే  వెసులుబాటుగా ఉంటుంది.

ఇంకా వివరములకు    9948235641  లో సంప్రదించండి

జైశ్రీరాం.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP