శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

హనుమదనుగ్రహానికి గుర్తుగా సాగిన యాగపూర్ణాహుతి

>> Monday, May 30, 2016

ఎనిమిదవ ఆవృతిగా   సాగిన హనుమత్ రక్షాయాగం  స్వామి అనుగ్రహాన్ని చవిచూపినది.   తీవ్రంగా ఉన్న వేసవి ఎండలు,వడగాల్పులు. పూర్ణాహుతి గూర్చి  ఆందోళన పడ్డాం. ముఖంబయటపెడితే  మాడిపోతున్నది. ఇంత ఎండలో వచ్చినవారికి వసతి చూడటం మాటెరుగు చల్లగా కూర్చోగలిగేలా కూడా చేయలేము అని భయపడ్డాము.
ఎపట్టిలానే  మరో చిత్రం జరిగింది. యాగానికి ముందు రోజు రాత్రి వర్షం కురిసింది. ఉర్లో చిరుజల్లు మాత్రమే పడగా పీఠం పరిసరాల్లో ఒక ఫర్లాంగుదూరం మాత్రం గట్టివానపడింది . వాతావరణం కొద్దిగా చల్లబడింది.
యాగానికి ఎక్కువమందిని ఆహ్వానించటానికి కూడా భయపడేలా  చేసిన ఎండ కొంత శాంతించింది.

  రాత్రి గాలిదుమారం వలన ఎక్కడో కరెంట్ లైన్ దెబ్బతిన్నది. శనివారం ఉదయాన  కరెంట్ లేదు మోట్ర్లు పనిచేయలేదు. చేతిపంపు వాచర్లు ఎండిపోయి ఉన్నాయి వాడకం లేక. స్నానపానాదులకు కూడా నీరు లేదు. అప్పతికీ పిల్లలు కాలువకట్టదగ్గరున్న బోరింగువద్దకు వెళ్ళి స్నానాలు పూర్తిచేసుకుని వచ్చారు. .
 అదృ ష్టం కొద్దీ సోలార్  సెట్   బిగించి ఉన్నది.  సూర్యభగవానుని దర్శనం కాగానే సోలార్ పంప్ పనిచేయటం మొదలైంది.  కావాలిసినంత నీరు. .అష్టోత్తర కలశజలములతో అభిషేకములు, తమాలార్చనలు ,హనుమత్ జయధ్వనులు .  .ఆనందం మనసునతాండవం చేస్తుండగా అద్భుతంగా సాగింది కార్యక్రమం. యాగం పూర్తయ్యాక రాత్రికి భారీవర్షం కురిసింది స్వామి అనుగ్రహానికి సూచనగా .


ఇక అన్నింటికంటే  ముఖ్యమైన విషయం మీకు మనవి చేస్తున్నాను .  ఎప్పుడూ హనుమజ్జయంతి తరువాత పూర్ణాహుతి ఉంటుంది . కానీ ఈసారి ముమ్దుగా పూర్ణాహుతి జరిపి వీలైతే జాపాలి క్షేత్రానికి వెళ్ళాలి అని మనసులో సంకల్పం కలిగింది. అమ్దువలన అన్ని అభ్యంతరాలను పక్కనబెట్టి ఇరవై ఎనిమిది శనివారం పూర్ణాహుతి నిర్ణయించాను.  యాగం నిర్విఘ్నంగా పూర్తయింది.
నిన్న సాయంత్రం అంటే ఆదివారం నాలుగు గంటల ప్రాంతంలో దూరపు ఊరినుండి కబురు   మాకు సూదకం వచ్చినదని.    
ఔరా! ఏమి స్వామి కరుణ   సూదకం  వస్తుందని అలాజరిగితే యాగం మధ్యలోనే ఆగిపోయి దోషం కలుగుతుందని  స్వామికి తెలిసే ఇలా యాగపూర్ణాహుతి  తేదీని ముందుకు జరిపి నిర్ణయించేలా ప్రేరన కలిగించినది ఎవరు?  స్వామి కాదా !!!!
ఇది మహిమ అంటే . స్వామి కరుణ అంటే.



0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP