శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

నందుగాడి అల్లరి

>> Monday, April 4, 2016

 నందుగాడు పుట్టి మూడు నెలలు దాటింది . ఇక  వీడి ఆటలు చూడాలి . అల్లరి పనులు చూడాలి .  చెంగుచెంగున గాలిలో తేలుతున్నట్లు దూకుతూ చేనంతా పరుగులు తీస్తుంది. వెళ్ళి మట్టి, మసి ముఖమంతా పులుముకుని వస్తుంది.  ఇంట్లోకొచ్చి ఏదైనా పెట్టమని మారాం చేస్తున్నది. కూర్చునిమాట్లాడుకుంటూంటే పరిగెత్తుకొస్తుంది.     ఇదంతా బాగుందిగాని  అందరినీ తనవెంట పరిగెత్తమని గొడవచేస్తుంది. వేగంగావచ్చి కుమ్ముతుంది. మాతమ్ముడినైతే వదలదు. నందుగాని బలానికి మగవాళ్లమే తట్టుకోలేక తూలిపడుతున్నాము. ఇంటిలో వాళ్లదగ్గరకు కూడా వచ్చి ఆడుకోవటానికి రమ్మని  తలతో నెడుతూ పిలుస్తోంది. ఇప్పుడు వేసవి కావటం వలన పచ్చిగడ్డి లేదు. పచ్చి గడ్డి ఉంటే ఇంకా బలంగా పెరిగేది. ఇంకో ఆరునెలలు పోతే  ముక్కుతాడు లేకుంటే నందుగాడ్ని పట్టుకోవటం కూడా కష్టమే .

1 వ్యాఖ్యలు:

SD April 4, 2016 at 12:15 PM  

దయచేసి ఆ ముక్కు తాడు మాత్రం వేయకండి. అదెంత భాధ అనుభవించాలో.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP