శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అప్పుడు జలగల్లా వడ్డీలు పీల్చి, ఇప్పుడు వడ్డికాసులవాడా గోవిందా! కాపాడు అంటే కుదురుతుందా ????

>> Thursday, December 17, 2015

రాష్ట్రంలో  వడ్డీవ్యాపారుల ఆగడాలపై" కాల్ మనీ" వ్యవహారంపై దుమారం చెలరేగింది .  ఒక్కొక్కటిగా వడ్డివ్యాపారుల దుర్మార్గాలు వెల్లడవుతున్నాయి. అవసరమై అప్పులుచేసినవాళ్లదగ్గర వడ్డీలు రక్తంపీల్చినట్లు పీల్చి కొన్నిచోట్ల వాళ్ళు చేసిన దుర్మార్గాలు మానవత్వానికే మచ్చగా ఉన్నాయి.
ఇక ఇప్పుడు కేసులు మొదలవుతుండటం తో  వడ్డీవ్యాపారులంతా బెంబేలెత్తిపోయి   తిరుమల స్వామివారి దర్శనం క్యూలైన్ లోబారులుతీరారని పోలీసులు గమనిస్తున్నారట.

తప్పనిసరైతేనే వడ్డీవ్యాపారం జోలికెళ్ళాలని వివిధమతగ్రంథాలు చెబుతున్నాయి. అదీకూడా ఎదుటివాడి అవసరాన్ని అవకాశం వచ్చిందికదా అని దోచుకోవటానికి ఉపయోగించుకోకుండా  సాటివారికి సాయంచేసే బుధ్ధితో చేయాలి. ధర్మంగా వడ్డీతీసుకుని తనకుటుంబాన్ని పోషించుకోవటం తప్పనిపించదు .
కానీ సాటిమనిషి రక్తం పీలుస్తూ వారికంటపెట్టించే కన్నీరు కట్టికుడుపుతుంది . ఆడబ్బుతోపాటు ప్రతి కన్నీటిబొట్టు మీకుటుంబంలో కన్నీరు కార్పిస్తుంది . కాకుంటే ఒకరోజు వెనుక ముందు అంతే!

ఆయన భక్తుల పాపాలను పోగొట్టడానికై వడ్డికాసులవాడై నిలుచుని కాపాడుతున్నాడు. కానీ మీరో వడ్డీలరూపంలో జనం పాపాలమూటలన్నీ తలకెత్తుకుంటున్నారు , ఇప్పుడెళ్ళి స్వామీ ! మేముచేసిన ఈ దిక్కుమాలిన దౌర్భాగ్యాన్ని  మేము హుండిలో వేసే లంచాలుతీసుకుని తొలగించు అని ప్రార్థిస్తే కుదురుతుందా!???
కష్టాలకడలిలో ఉన్న సమయంలో బాధతో వడ్డీబాధితులంతా  స్వామీ ! ఈ అన్యాయం చూడు  ... మమ్మల్ని ఎలా వేధిస్తున్నారో చూడూ.... అని ఆయనకు మొరపెట్టుకునే ఉంటారు కదా మీకంటే ముందుగా.
మంచి మనసులతో  చేసే పనులకు వడ్డీతోసహా శుభాలను   చెడుభావనతో  చేసే పనులకు కూడా ఏమివ్వాలో అదికూడా  వడ్డీతోసహా అనుభవించేలా చేస్తాడు స్వామి .

ఆయనదగ్గరకూడా  మీ దిక్కుమాలిన  తెలివితేటలు ప్రదర్శించాలని చూడకండి. బుధ్ధితో క్షమాపణలు చెప్పుకుని తప్పుసరిదిద్దుకుని ధర్మంగా బ్రతకటం నేర్చుకోండి .  లేకుంటే ఘోరమైన ఫలితాలు కాచుకుని వుంటాయి మనపాపకార్యాలకు.

జైశ్రీరాం

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP