శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

జీవామృతం - జలం [కంచి పరమాచార్య వైభవం]

>> Wednesday, December 16, 2015

కంచి పరమాచార్య వైభవం
జీవామృతం - జలం
పరమాచార్య స్వామి వారు పాదయాత్ర ముగించుకొని ఒకసారి కలవై వచ్చారు. కొద్ది రోజులపాటు వారి మకాం అక్కడే. కలవైలో ఉన్న మేలు జాతికి ...చెందిన రెండు బిల్వ చెట్లు ఎండిపోయి ఉన్నాయి. వేదపురి శాస్త్రి గారు మరియు నేను దాని గురించి మాట్లాడుకుంటూ చాల అసంతృప్తితో ఉన్నాము. ఇంతటి మహాద్భుతమైన చెట్లు అలా ఎండిపోతుంటే మాకు చాలా బాధగా ఉంది. ఏ విధంగానైనా వాటిని బ్రతికించాలని మా అభిప్రాయాన్ని మహాస్వామి వారికి విన్నవించుకున్నాము.
మేము చెప్పినదంతా విని స్వామి వారు చాలా నిర్లిప్తంగా ఉన్నారు. వారి మోముపై ఎటువంటి భావనలూ లేవు. మేము ఏదేదో ఊహించుకుంటూ వారి దగ్గరికి వెళ్ళాము. వారు మా మాటలు విని "ఏంటి అలా జరిగిందా?" అని, ఇంకా ఎదేదో అంటారని అనుకున్నాము. మేము చాలా నిరాశ పడి, కనీసం ఎవరైనా కొంతమంది శిష్యులను పంపి అడగొచ్చుకదా? కలవై బృందావనంలోని పనిచేసే కార్మికులను పిలిచి "ఎందుకు మీరు ఇంత అజాగ్రత్తగా ఉన్నారు? మీరు సరిగ్గా నీరు పోసి ఉంటే ఈ పురాతనమైన చెట్లు ఇలా అయ్యుండేవి కాదు కదా? ఇప్పటి నుండి అయినా సరిగ్గా నీళ్ళు పోయండి" అని చెప్తారనుకున్నాం. కాని అలాంటిది ఏమి జరగలేదు.
కొద్ది సేపటి తరువాత, మహాస్వామి వారు తమ అనుష్టానము పూర్తి చేసుకొని, వారు ఉపయోగించే చిన్న ఘటం అదే చెక్క చెంబును తీసుకొని బయటకు వచ్చారు. దానిలో ఒక గ్లాసు నీళ్ళు ఉన్నట్లున్నాయి, వాటిని ఆ ఎండిపోయిన చెట్ల మీద పోసి వెళ్లి పోయారు.
మేము మా పనులలో పడి ఈ విషయం మరిచి పోయాము. కాని చెట్లు మరచిపోలేదు. ఎండిపోయిన ఆ రెండు బిల్వ చెట్లు పది రోజుల తర్వాత పుంజుకోవడం ప్రారంభించాయి. ఎండిపోయిన కొమ్మల నుండి కొత్తగా పచ్చి చిగుళ్ళు వస్తున్నాయి. మేము చాలా ఆశ్చర్యానికి గురయ్యాము.
మేము ఈ విషయాన్ని వచ్చిన వారందరికి చెప్పడం మొదలుపెట్టాము. అందరి దృష్టికి తీసుకుని వెళ్ళడానికి డప్పు వాయించినట్టు అడిగినవారికి అడగనివారికి అందరికి చెప్తూ వచ్చాము. "ఇది అంతా పరమాచార్య స్వామి వారి కృప వల్లనే జరిగింది. వారు ఎండిపోయిన ఈ రెండు చెట్లకూ ఒక గ్లాసు నీళ్ళను పోసారు. చెట్లు చిగురించడం మొదలుపెట్టాయి" అని అక్కడ ఉన్నవారికి మరియు కలవై వచ్చిన వారికి ఎవరిని వదలకుండా మళ్ళీ మళ్ళీ చెప్పాము.
నిజానికి మా మాటలలో అహంకారం దాగి ఉంది. మొదట ఈ చెట్లు ఎండిపోయిన విషయం పరమాచార్య స్వామి వారికి చెప్పినది మేమే కాబట్టి మా వల్లే అవి మళ్ళీ చిగురిస్తున్నాయనే అహంకారభావన కలిగింది. బాధ్యతతో కూడిన మా ప్రయత్నం వల్లే ఈ చెట్లు బతికాయని మా ఉద్దేశం. ఈ విషయం ఆచెవిన ఈచెవిన పడి మహాస్వామి వారి దగ్గరకు వెళ్తే, మాకు అయన అనుగ్రహం లభిస్తుంది, మరియు మాతో "ఇది అంత మీ కృషి వల్లనే జరిగింది" అని అందరిముందు చెప్తారు. ఇంతటి అవకాశాన్ని ఎవరుమాత్రం విడిచి పెట్టుకుంటారు. కాబట్టి తప్పక ఈ విషయం చెప్పాలి అని నేరుగా వారి దగ్గరకు వెళ్ళి నిలబడ్డాము.
వారికి సాష్టాంగం చేసి, "ఈ రెండు బిల్వ చెట్లు మహాస్వామి వారి దయవల్ల పునరుజ్జీవం పొందాయి. ఆకులు, చిగుళ్ళు మొలకెత్తడం మెదలైనాయి” అని చెప్పాము. కొంచమైనా అద్భుతం కానీ, కొంచమైనా ఆశ్చర్యం కానీ లేదు స్వామి వారి మోములో. చాలా ప్రశాంతంగా ఉంది. మేము మొదట ఎండిపోయిన చెట్ల గురించి చెప్పినపుడు అయన ముఖంలో ఎలాంటి ప్రశాంతత ఉందో, ఇప్పుడు కూడా అదే ప్రశాంత భావన ఉంది. అప్పుడు బాధ, విచారం, నిరాశ చెందడం ఇప్పుడు ఆశ్చచర్యం, అద్భుతం అనే భావన పొందటం లేదు. ఆత్మజ్ఞానం తెలిసిన వారు కష్టానికి బాధ పడటం, లేదా లాభం వల్ల అనందపడం అనేది ఉండదు. అవన్నీ మనలాంటి వారికే ఎందుకంటే మనం సాధారణ ఆత్మలం కనుక.
--- శ్రీ మఠం బాలు మామ




Regards
G .BHASKARA RAMAM
INDIA

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP