శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మొగుడ్నికొట్టి మొగసాల కెక్కుతున్న జాతి వ్యతిరేక "మేతావులు"

>> Friday, October 30, 2015

 మొఉడిని కొట్టి మొగసాల కెక్కింది అని వెనుకటికొక సామెత ఉంది.. ఇప్పుడు స్వయంప్రకటిత, జాతి వ్యతిరేక శక్తుల  పోషిత "మేతావుల" గుంపు హైందవ వ్యతిరేక చర్యలు చూస్తుంటే .
హైందవశక్తులు బలపడుతున్నాయట మతోన్మాదులు సెక్యులరిజంపై దాడులు చేస్తున్నారట. కాబట్తి మేంకష్తపడి కొనుక్కున్నవి, పైరసీలద్వారా సాధించుకున్న అవార్డులన్నీ తిరిగిఇవ్వదలచుకున్నామని పెడబొబ్బలు పెడుతున్నారు.
ఈ  మేతావులు దేశానికి చెసిన సేవగాని మేలుగాని మనకెవరికీ తెలియదుగాని వాళ్లు తెలుసుకోవలసిన విషయం  సెక్యులరిజమంటేనే   హైందవం. నీవునమ్మే  నమ్మకమేకాదు ఇతరుల నమ్మకంలోనూ సత్యముంటుంది కనుక అందరి దైవసాధనామార్గాలను ఆదరించమని చెప్పి ఆచరించి చూపిస్తున్నది. హైందవము మాత్రమే .

ఎన్ని విమర్శలనైనా సహనంతో భరించెది క్షమించేది హైందవమే . లేకుంటే పిచ్చిరాతలు వ్రాసి ధర్మాన్ని అవమానపరుస్తున్న   కుహన లౌకికవాదులమనుగడ  ఇంతక్షేమంగా ఉండగలిగేదా.
భావస్వాతంత్ర్యాన్ని గౌరవిస్తున్నది ఎవరు.   ఇతరమతాలపట్ల  కొద్దిగా వ్యతిరేక రచనలు చెసిన రచయితలకు  ఈదేశంలో ఎటువంటి చెదు అనుభవాలు ఎదురయ్యాయో  నిన్నమొన్నకూడా చూశాం కదా.! మరి అప్పుడు కనీసం నోరెత్తి ఒక్కమాట పలకని ఈ దౌర్భాగ్యుల   సెక్యులరిజం నిబద్దత జనమంతా తెలుసుకుంటూనే ఉన్నారు. అది వీళ్లకింకా తెలియలేదా. తెలిసినా సిగ్గూశరం వదిలి విదేశీ శక్తుల కుక్క బిసికెట్లకు ఆశపడి  వాళ్లాడినట్లు జాతి వ్యతిరేకంగా పనిచేస్తున్నారా?

  బజారుకెక్కి గుంపుగాగొంతుచించుక్కుంటే చాలు అబద్ధమైనా నిజమని జనం నమ్మేస్తారనుకునే  అజ్ఞానం నుండి వీళ్లింకా బయట పడలేదు

 మీ.  అబద్దాలప్రచారాలు ఎక్కువయ్యేకొద్దీ   మీ నిజస్వరూపాలు బట్టబయలవుతాయి కానివ్వండి


0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP