శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

దయచేసి డెంగ్యూ జ్వరాలు ,.రక్తకణాలసంఖ్య తగ్గిపోతున్న వ్యాధిగ్రస్తులకు ఈ ఔషధం తెలియపరచండి

>> Tuesday, October 27, 2015

మొన్న శుక్రవారం దాకా నవరాత్రి ఉత్సవముల పనులు    మనసు నిండిపోయింది ,వళ్లు అలసిపోయింది .
 కాస్త నడుం వాలుద్దామనుకునేసరికి    గుంటూరు నుంచి కబురు. మా బామ్మర్ది కుమారునికి నాలుగు రోజులుగా ఉన్న డెంగ్యూ జ్వరం ఎక్కువై అక్కడ ఓ పెద్ద కార్పోరేట్ హాస్పటల్ లో చేర్చారు అని.  అంతే కాదు బ్లడ్ సెల్స్ సంఖ్య వేగంగా పడిపోతున్నది అని. చేరగనే వాళ్లు  అవసరమున్నా లేకున్నా ఎక్సరే నుండి స్కానింగ్ వరకు అన్ని పరీక్షలు గ్రాండ్ గా చేసి జేబులు ఖాళీ చేస్తున్నారు. వాడు ఖంగారు పడుతున్నాడు.
శనివారం ఒక కారు అద్దెకు తీసుకుని నేను నాభార్య,పిల్లలు అందరం బయలుదేరాము.   వెళుతూ వెళుతూ  కాస్త తిప్పతీగ,బొప్పాయి ఆకులు తీసుకుని వెళ్ళాను.      గుంటూరు చేరేసరికి  బ్లడ్ సెల్స్ సంఖ్య ఆరవై వేలకు పడిపోయిందని   వాడు వాళ్ల అక్కకు ఆందోళనతో ఫోన్ చేశాడు.  నేరుగా హాస్పటల్ కు వెళ్ళాం . అక్కడ పేషంట్ గదిలోకి ఒక్కరికి మాత్రమే అనుమతిస్తున్నారు.  ఎలాగోలా లోపలకు చేరితే పిల్లవాడు బాగా నీరసించి పోయాడు. గది తలుపులు బిగించి తీసుకెళ్ళిన బొప్పాయి ఆకును పిండి వచ్చిన కొద్ది రసాన్ని ఒకడోస్ గా ఇచ్చాను [. ఈ వైద్యం చూస్తే వాళ్లు అసలు ఒప్పుకోరు. ఎవరికి వాళ్లు ఇలా చేసుకుంటే  మేమెలా బ్రతకాలని తగాదా వేసుకుంటారేమో !]

 ఆ పిల్లవాని తల్లిని ఇంటికి పంపి    .... తిప్పతీగను ముక్కలుగా కత్తిరించి   అందులో బొప్పాయి ఆకును వేసి   బాగా నూరటమో లేక  మిక్సీలో వేయటమో చేయమన్నాను. ఆపైన దానికి కలబంద గుజ్జు... దానిమ్మ పండ్ల రసం కలిపి మిక్సీ వేసి శుభ్రమైన వస్త్రంలో వేసి పిండి ఆరసాన్ని తీసుకురమ్మన్నాను. ఆ అమ్మాయి అలానే తయారుచేసుకొచ్చినది .
 ఈ ఔషధాన్ని  నాలుగు గంటలకొకసారి ఒక చెంచా తాగించమని చెప్పి సాయంత్రం దాకా ఉండి వచ్చాను.
మా బావమరుదులకు గతంలో ఇలాంటి వైద్యవిధానమంటే అంత నమ్మకం లేదు. అవన్నీ పాతకాలంలో పనిచేస్తాయి గాని  ,,, ఇప్పుడు వాతావరణానికి పనిచేస్తాయా ? అని      అనాసక్తిగా ఉండేవారు . డబ్బులు వదిలించుకోవాలని ముఖానరాసి ఉంటే ఎవడేం చేయగలడు అనుకుని  నవ్వుకుని వదిలేసే వాడిని . కానీ చిన్నపిల్లవాడు కనుక ఇప్పుడు నేను బయలుదేరి వచ్చాను.

వచ్చేప్పుడు చూస్తే  ఆ కొత్తపేట హాస్పటల్స్ అన్నీ కిటకిటలాడిపోతున్నాయి జ్వరాలు వచ్చిన వారితో . అక్కడ ఎవరికన్నా చెబుదామన్నా  హాస్పటల్ సిబ్బందితో గొడవఅవుతుంది.
 అయినా పాపం రాం దేవ్ బాబా గారు  ఈ ఔషధాన్ని తయారు చెసి ఇలావాడుకోండి అని ప్రకటించినా   జనాలకు పట్టటం లేదు.

మరుసటిరోజు ఆదివారం   బ్లడ్ టెస్ట్ చేసి  డెబ్బైరెండువేలకు పెరిగాయని చెప్పారట
 సోమవారం  లక్షాముప్పైఆరువేలకు  చేరాయి రక్తకణాలసంఖ్య 
ఇకభయం లేదు.  అని చెప్పాను.
 మావాడు వెంటనే హాస్పతల్ నుండి పిల్లవాడిని డిస్చార్జ్ చేసుకుని ఇంటికి తీసుకువచ్చి మూడుపూటలా ఈ ఔషధం తయారు చేసి ఇస్తున్నాడు. మొన్న కురిచేడు నుండి ఓపిల్లవాడు మాబంధువర్గం లో వాడె వెళితే ఏభైవేలు బిల్లు పిండుకుని పంపారట.

మహర్షులు లోకక్షేమంకోసం తపించి ఆవిష్కరించినది ఆయుర్వేదం. ఇందులో ఔషధాలకు మనవాళ్లు పేటెంట్ హక్కులు  పొందాలనే దౌర్భాగ్యబుధ్ధి రాకూడదని సమాజానికి పంచారు . సమాజంలో అందరికీ ఈ వైద్యవిధానాన్ని పలురూపాలుగా నేర్పారు. మనమేమో ఈ విద్యను కోల్పోవటమే కాక దీని పరిరక్షణకు  పాటుపడుతున్నవారినీ విస్మరిస్తున్నాం . దయచేసి డెంగ్యూ జ్వరాలు .రక్తకణాలసంఖ్య తగ్గిపోతున్న వ్యాధిగ్రస్తులకు ఈ ఔషధం తెలియపరచండి


0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP