శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఓర్నాయనో ! ఇలా నట్లు బోల్టులు వేసి బిగించారా ? నా కాలి ఎముకలను !

>> Wednesday, September 9, 2015



 ఇవి ఇప్పటిదాకా నా శరీరం లో నిక్షిప్తమై ఉన్న పరికరాలు. రెండు సంవత్సరాలక్రితం  జారిపడ్దప్పుడు కాలి ఎముక విరిగింది.  మోకాలు క్రింద నుండి పాదం దాకా ఉన్న నిలువు ఎముక విరిగింది . డాక్టర్ గారు నన్ను చెక్కమొద్దును మంచం పై పనుకోబెట్టినట్లు పెట్టి  అరకెజీ బరువున్న ఇనుపకడ్డీ ని ఎముకలోకి నిలువుగా సుత్తితో దిగగొట్టి ఆపై డ్రిల్లర్ తో గోడకు బిగించినట్లు ఎముకకు కిందరెండు పైన రెండు నట్లు వేసి బిగించి ఇవి ఇప్పటిదాకా నా శరీరం లో నిక్షిప్తమై ఉన్న పరికరాలు. రెండు సంవత్సరాలక్రితం  జారిపడ్దప్పుడు కాలి ఎముక విరిగింది.  మోకాలు క్రింద నుండి పాదం దాకా ఉన్న నిలువు ఎముక విరిగింది . డాక్టర్ గారు నన్ను చెక్కమొద్దును మంచం పై పనుకోబెట్టినట్లు పెట్టి  అరకెజీ బరువున్న ఇనుపకడ్డీ ని ఎముకలోకి నిలువుగా సుత్తితో దిగగొట్టి ఆపై డ్రిల్లర్ తో గోడకు బిగించినట్లు ఎముకకు కిందరెండు పైన రెండు నట్లు వేసి బిగించి కుట్లు వేసి పంపించారు  . రెండు నెలలపాటు   బాధను అనుభవిమ్చినా చిన్నగా నడిచాను. రెండు సంవత్సరాలు దాటిపోయింది . ఈ నట్లుకూడా నొప్పి పుడుతున్నాయి అప్పుడప్పుడూ . ఇంకెందుకులే అని తీపించాలని నిర్ణయిమ్చుకున్నాను . నాకు అప్పుడు ఆపరేషన్  చేసిన డాక్టర్ ప్రస్తుతం ఒంగోలు లో ఉన్నారు. మాస్టారూ ! ఇక్కడకు రండి తీసి పంపిస్తాను అన్నారు.
కానీ అటు ఒంగోలు, లేదా ఇటు గుంటూరో వెళ్లాలంటే నాతోపాటు ఇంకా ఇద్దరు రావాలి . ఇక్కడ పీఠంలో  తమ్ముడు ఉండాలి .   ఆసుపత్రిలో  ఓవారమ్  ఉంచుతారు   నరకం  నాకు .

 ఈలోపల వినుకొండ లో  కొత్తగా వచ్చిన శ్రీనాథ్  యువడాక్టర్ పరిచయమయ్యాడు  .  ms ortho.  మంచి  నైపుణ్యం ఉన్నది .  చేస్తాలే !మాస్టారూ  అన్నారు. మొన్న గురువారం వినుకొండ వెళ్లి ఉదయాన్నే ప్రారంభించిన ఆపరేషన్ గంటలో ఐపోతుందనుకుంటే   రాడ్డ్ సెట్ చేసి నప్పుడు   కొద్దిగా లోపలకు వెళ్లటం  ఎముక పెరగటం వలన దాన్ని కట్ చేసి  రాడ్ తీయవలసిరావతం వలన ఆలస్యమైపోయింది.     కుట్లు వేసే సమయానికి మత్తుదిగింది. అయినా బాధకలగకుండా ఆపరేషన్ పూర్తి చేశాడు డాక్టర్ . ఇక ఇప్పుడు ఎముక బోలు అయింది ఱాడ్ రంధ్రం ఒకటి అడ్డంగా నట్లు బిగించిన రంధ్రాలు నాలుగు . మళ్లా ఇంకో మూడు  జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు మంచంపై  రెస్ట్ . ఓర్నాయనో !   ఇదేమి వైద్యం ,  సైకిల్ కు నట్లు బిగించినట్లు .  అని  చూట్టానికి వచ్చినవాళ్లు  అంటున్నారు

ఏమయ్యా ! పూర్వం ముక్కలు ముక్కలైన ఎముకలను కూడా  కట్లు కట్టి అతుక్కునేలా చేసే వారు కదా  నాటు వైద్యులు . ఇప్పుడు ఒకసారి కట్టు కోవడానికి . మరొకసారి  ఇలా ఈ  రాడ్లు  ప్లేట్ లు తీయడానికి ఆపరేషన్ చేయవలసి వస్తున్నది .దీనిద్వారా రోగికి  ఇబ్బంది   ఎక్కువకదా ? ఉదాహరణకు  నా కాలిలో ఎముక విరిగినది ఒక్కచోట . మీరు చేసిన బొక్కలు  ఇంకొక ఐదు .    దీంతో  ఎముక ఇంకా బలహీనపడవా ? అన్నాను సరదాగా .
అప్పట్లో ఇంత టెక్నాలజీ లేదు కదండీ ? అన్నాడాయన

 ఇప్పుడు  వేలకు వేలు ఫీజులు సమర్పించుకునే మనం  నాటువైద్యుల  ను  పోషించుకుని ,ప్రోత్సహించి ఉంటే   వారిలో ఇంకా నైపుణ్యం పెంచుకుని పేదలకుకుడా  తక్కువలో   మంచి వైద్యం అంది ఉండేది .  . ఈప్రాంతంలో  అవిశాయపాలెం ,, చిత్తూరు  జిల్లాలో పుత్తూరు ఎముకల  ప్రసిద్దమైన పేర్లు . మదేశం లో  అద్భుతంగా ఎముకల వైద్యం చేయగలవారు ఇంకా ఉన్నారు  కాకుంటే  ఆదరణలేక  అందుబాటులోలేరు   తరాలు మారేకొద్దీ   అసలు మాయమయ్యే ప్రమాదం ఉంది .
కీళ్ల మధ్య లోనో లేక కట్టు నిలవటానికి వీలుకాని స్థలమైతే  ఐ రాడ్లు ప్లేట్లు  బిగించవలసిరావచ్చు  కానీ తేలికగా అతుక్కునే కేసులలో కూడా  ఒకటే పద్దతి . ఇప్పుడు ఆసుపత్రులలో .





0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP