శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఇటు తిప్పితే ఇష్టకార్యం... అటు తిప్పితే మోక్షకారకం

>> Thursday, September 10, 2015

ఇటు తిప్పితే ఇష్టకార్యం... అటు తిప్పితే మోక్షకారకం

  • -‘రసస్రవంతి’,‘కావ్యసుధ’
  • 07/09/2015
‘జపం’అంటే ఒక మంత్రాన్ని అనేక పర్యాయాలు ఉచ్చరించటమువల్ల అది మనస్సులో రూఢిపడి భగవంతునిపై అచంచల భక్తి ఏర్పడగలదు. జపమంత్రోచ్ఛారణ వలన మనం భగవంతునికి మరింత సన్నిహితమయ్యే అవకాశములున్నవి. మంత్రం అనగా ఐహిక ప్రపంచంనుండి మన మనస్సును మరలించి పరమాత్మ పాదములచెంత చేర్చడం. జప మంత్రాలలో గొప్ప దైవభక్తి నిబిడీకృతమై ఉంటుంది. జప మంత్రములవలన మనకు మన ఇష్టమైన నిజరూపమును దర్శించగల వీలుంటుంది. జప మంత్రములందు నిబిడీకృతమై ఉన్న శక్తి మరియు దానికి దోహదపడిన ఆధ్యాత్మిక సాధన కూడా కలసి పనిచేసి ఉండడమే ‘జపం’. జపమాలలో 108 పూసలుగా నిర్ణయించారు మన మహర్షులు. 108 పూసల పిదప వచ్చి అగ్రస్థానంలో వుండే పూసను ‘మేరువు’అంటారు. 108 పూసలు మంత్ర జప ఉచ్చారణ జరిగిన తర్వాత వచ్చె ‘మేరువు’ రాగానే ఒక మాల జపం పూర్తిఅయింది అని తెల్పడానికి ప్రతీక నిలుస్తుంది ఈ మేరువు పూస. మానవ శరీరంలో సహజంగా డెబ్బై రెండువేల నాడులు ఉంటాయని అందులో 108 నాడులు హృదయాన్ని పొందేవి. హృదయం భగవంతునికీ, ఆత్మకూ స్థానం. కనుక ఇందుకు గుర్తుగా జప సంఖ్య 108గా నిర్ణయించగా, మరి ముఖ్యమైనవిగా 54,27 నాడులను గుర్తించారు. 108లోని ‘‘1’’టి పరమాత్మ ‘0’ప్రకృతిగా ‘8’ అష్టవిధ ప్రకృతులు కనుక పరమాత్మ, అతని యొక్క ప్రకృతి, అందుకు అవసరమైన పంచభూతాలు, మనస్సు, అహంకారం, బుద్ది అనే ఎనిమిది తత్త్వాలు 108కి సంకేతం. ఏ మాలతో జపంచేస్తే ఫలసిద్ధి ఎలా ఉంటుందో అని ఒక్కసారి మనం ఆలోచించినట్లైతే, సాధారణంగా చేతి రేఖల్ని జపించడం గాయత్రీమంత్ర జపంలో ఉంటుంది. ఈ రేఖా జప ఫలం పదింతలు మరి శంఖమాల జపం నూరింతలు కాగా వెయ్యింతల ఫలాన్ని ‘పగడమాల’ జపం చేస్తే, పదివేలింతల ఫలం ‘స్ఫటికమాల’ ఇస్తుంది. ముత్యాలమాల వలన లక్ష గుణం, తామరపూల మాలచే పది లక్షల గుణం, బంగారు పూసల జపమాలతో కోటి గుణం, తులసి, రుద్రాక్షలచే అనంతఫలం లభిస్తుందని శివుడు పార్వతిదేవితో చెప్పినట్లుగా మన పురాణాల ద్వారా తెలుస్తోంది.
పాప నిర్మూలనం, శాంతికొరకు ‘దర్భమాల’, శంఖమాల లక్ష్మీపదం కాగా, ‘పగడాల మాల’ ఐశ్వర్య ప్రదం, మోక్షసిద్ధికి ‘స్ఫటికమాల’,సుమంగళకరమైనది ‘ముత్యాలమాల’, తామరమాలతో సకల సంపత్ప్రదం, ఇష్టకామ్యర్థ సిద్ధికి బంగారు లేదా వెండి పూసల మాల అక్షయ ఫలం, సర్వసిద్ధికరమైనది ‘తులసి, రుద్రాక్ష’మాలతో ఆత్మజ్ఞానప్రదం, మోక్షసిద్ధి కలుగుతుంది. జపమాలను కుడిచేయి మధ్యవేలు మొదటి కనుపుపై ఉంచి మన వైపుగా పూసలను త్రిప్పుకుంటే ఇష్టకామ్యసిద్ది, ఆవలి వైపుగా త్రిప్పితే మోక్షసిద్ధి జరుగుతుందని గురు వచనం. ‘జపం’అంటే ‘జకారో జన్మవిచ్చేదః పకారః పాపనాశకః తస్మాజ్జప ఇతి ప్రోక్తో జన్మపాప వినాశకః’’ ‘జ’అంటే జన్మరాహిత్యం, ‘ప’అనగా పాపనాశం కాబట్టి జపమనగా జన్మరాహిత్యాన్ని, పాపనాశనాన్నీ కలుగజేసేది అని భావం.

2 వ్యాఖ్యలు:

astrojoyd September 10, 2015 at 8:27 PM  

జపమాలను కుడిచేయి మధ్యవేలు మొదటి కనుపుపై ఉంచి మన వైపుగా పూసలను త్రిప్పుకుంటే ఇష్టకామ్యసిద్ది, ఆవలి వైపుగా త్రిప్పితే మోక్షసిద్ధి జరుగుతుందని గురు వచనం./ ....ఆర్యా ఇటువంటి చిన్న విషయాలలోనే జ్ఞాని సైతం బోర్లా పడుతుంటాడు..జపమాలను బాహ్యంగా ఎన్నడూ త్రిప్పరు..త్రిప్పరాదు కూడానూ..దాని చలనం ఎన్నడూ అధోముఖం అంటే లోపలివైపుకే ఉండాలన్నది శాస్త్ర నిర్దేశం..మీరు రాసినది సరిగాదు ..అదెలా ఉందంటే ఎడమవైపుతొండం ఉన్న వినాయకుని పూజిస్తే ఎక్కువ పుణ్యమా లేక కుడివైపు తొండముంటే ఎక్కువ ఫలమా ? అని మనకి మనం నిర్ధారణ చేసినట్టుగా ...మీరు రాసినది గురు వచనం కాదు,,అది మీ స్వ వచనం..

durgeswara September 11, 2015 at 5:10 AM  

svaami idi andhrabhumi daily numdi teesukunna vyaasam naarchanakaadu

dhanyavaadamulu

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP