శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

కర్మ ఫలితం ఇంత కఠినంగానే ఉంటుంది . అనుభవించక తప్పదుకదా !

>> Sunday, June 28, 2015

 ఏరా నాగరాజూ !  యాగానికి రాలేదేమిటి ? పెట్రోలు బంకులో పెట్రోల్ పోయడానికి వచ్చిన నాగరాజును అడిగాను .మొన్న
కుదరలేదు సార్! అని సమాధానం చెప్పాడు నెమ్మదిగా
అదేమిటీరా ! ఎక్కడెక్కడొ నుండి వచ్చి జనం పాల్గొంటుంటే పక్కఊరు నుండి రాలేకపోయావా ? అన్నాను
 కాదుసార్ ! పిల్లవాడు  చనిపోయాడు సార్!  కళ్లలో నీళ్ళు తిరుగుతుండగా చెప్పాడు.
 మనసు కలుక్కుమన్నది. అయ్యో ! ఎంతపని జరిగినదిరా ! అని బాధపడి వాడిని ఓదార్చాను. ఋణానుబంధ రూపేణా పశుపత్నీ సుతాలయా అన్నారు పెద్దలు. వాడికి నీకు రుణం  ఇంతవరకే ఉంది.
కాకుంటే నిరంతరం వాడి బాధచూస్తూ నరకయాతన అనుభవించేకంటే ఈ దు:ఖమే నయం అనుకుందాం. నువ్వు కాస్త ధైర్యపడు అనిచెప్పాను.
అంతే సార్!. మీరు అప్పుడే చెప్పారు . కానీ కన్నప్రేమకదా సార్  . అంటున్న వాడిని జాలిగా చూస్తూ  నువ్వు  ఈ భూమ్మిదకు రావాలనుకున్న జీవిని రావద్దనుకున్నావు... ఇక్కడున్నజీవి నీతో ఉండవద్దనుకుని వెళ్లిపోయింది  ధైర్యపడు. మనంచేయగలిగిందేముంది  అని చెప్పి వచ్చేశాను.
 బండి మీదవస్తున్నా మనసంతా కల్లోలమైంది. కర్మ ఫలితం ఇంత కఠినంగా ఉంటుందా అని  ఆలోచనలు గతం లోకి వెళ్లాయి.

.....................................................................................................................................................


 నాగరాజు చిన్నప్పుడు నాదగ్గర చదువుకున్నాడు . మమ్చి పిల్లవాడు. అయితే సహవాసదోషాలు వలన ఇప్పటికుర్రవాల్లలో చాలామందికున్న అలవాట్లున్నాయి.  కానీ పెద్దలపట్ల గౌరవం. గ్రామంలో బీసీ లైనా అస్తిపరంగా  బాగా ఉన్నత్లే. చేపలచెరువులు లీజుకు తీసుకోవటం దగ్గరనుండి ఇక్కడ పెట్రోలు బంకులో ఓనర్ల తరపున నిర్వహణ కూడా చూస్తూ వాల్ల కుటుంబం అర్థికంగా  బాగానే ఉంది.

 మనకు తామరపూలు కావలసినప్పుడల్లా ఒరే !పూలుకోద్దాం అంటే పడవేసుకుని వచ్చి చెరువులోకి వెళ్లేది వీడే..కానీ పీఠానికి అర్చనలో పాల్గోవటానికి రమ్మని ఎన్నిసార్లు పిలచినా రాడు.

గతంలో ఓసారి వీనికి నాకు మధ్యజరిగిన ఓసంభాషణ కూడా ఈ బ్లాగులో వ్రాసినట్లు గుర్తు.


మానవులుచేసే సత్కర్మలు దుష్కర్మల వలన వారికి  ఈ జీవితకాలం లోనూ కర్మలింకా బలీయంగా ఉంటే తరువాత జన్మలోనూ ఫలితాలు ప్రాప్తిస్తూనే ఉంటాయి.

వీడో సారి చెప్పాడు.
వీని  చెల్లెలు గర్భం తో ఉండగా వాల్లబావగారు  టెస్ట్ లు చేపించి ఆడపిల్ల అని తెలియటం తో బలవంతంగా గర్భం తీపించాడు. వాళ్ల బావ కోసం ఈ తతంగమంతా తానే నడిపానని . అప్పటికే ఆబిడ్దకు చేతిగోర్లు కూడా ఉన్నాయని తానే పాతిపెట్టి వచ్చానని చెప్పాడు.
  ఓరే ! పనికిమాలినవాడా ఎంతపనిచేశావురా! ఎంత కర్మను నెత్తికెత్తుకున్నావురా ! అని చెడామడా తిట్టాను ఆరోజు.
మా బావ మాటవినకపోతే చెల్లెలిని బాధపెడతాడని ఈ పనికి ఒప్పుకున్నాసార్ ! అని బాధపడ్దాడు. అప్పుడు
దీనిఫలితంగా   నీకు జీవితంలో దు:ఖం కలిగే అవకాశం కల్పించుకున్నావు .పశ్చాత్తాపపడుతున్నావు కనుక  ముందు ఒక ఆవునుకొని దాన్ని పోషించమని మీబావకు చెప్పు. అలాగే నువ్వుకూడా   ... దీనివలన కొంతలో కొంత దోషం పోతుంది అని చెప్పాను అప్పుడు.   కానీ వానికి చెప్పి  మూడు నాలుగేళ్లయినా వాడు గోవుని కొనలూలేకపోయాడు. మేపనూ లేదు.
  సంవత్సరన్నరక్రితం వీనికొక కొడుకు పుట్టాడు. కానీ ఆరునెలలు దాటెసరికి పిల్లవానికి లక్షల్లో ఒకరికొచ్చే వ్యాధిరావటం. వైద్యం కోసం లక్షలు ఖర్చుచేసి హాస్పటల్లచుట్టు తిరుగుతున్నానని .. వైద్యం సమయంలో పిల్లవాడు పడుతున్న బాధను చూసి తట్టుకోలేక పోతున్నానని ... వైద్యం చేస్తున్నా పిల్లవాడు ఎక్కువకాలం ఉంటాడని నమ్మకం చెప్పలేమని డాక్టర్లు చెప్పారని       ... నాతో చెబుతూ  పిల్లవాడు[నాగరాజు]బాధపడ్డాడు పోయిన మార్గశిరమాసంలో తామరపూలు కోయటానికి తీసుకెళ్ళినప్పుడు.
అయ్యో !  వీని కర్మఫలితం ఇంతవేగంగా ,,కఠినంగా అనుభవంలోకొచ్చినదే అని బాధపడ్డాను. ఎక్కువ మమకారం పెంచుకోకు . చెసిన తప్పుకు ఇలా శిక్షపడుతున్నదని నమ్మి మనసు దిటవు పరుచుకోమని చెప్పాను. ఏంజరిగినా తట్టుకునేలా ఉండమని చెప్పాను ఆరోజు.  ఈరోజు మాత్రం    మనుషులం కదా ! మనసు మెలివేస్తోంది.


అందుకే పెద్దలు చెప్పారు   . చేసేపని ధర్మబధ్ధమాకాదా అని చూసుకోవాలని. మన అహంకారాలు ... మమకారాలతో .. విధికి పనిలేదు. తనశాసనం అమలుకావాల్సిందే . జాగ్రత్తగా బ్రతకటం నేర్చుకుందాం.


జైశ్రీరాం.

2 వ్యాఖ్యలు:

శ్యామలీయం June 28, 2015 at 6:40 PM  

జీవుల ప్రయాణం భగవదభిముఖంగానే ఉంటుంది. ఐతే వారందరూ ఒకే విధంగా ఉండరు, ఒకే దారిలో నడవరు. వారివారి కర్మలు వేరుగా ఉండటం వలన కర్మఫలాలూ వేరుగానే ఉంటాయి. ఐనా సరే కఠినంగా కనిపించే కర్మఫలానుభగవాలన్నీ పురోభివృధ్ధిని కలిగించేవే. మీ కథనంలోని మనిషి రాగం కారణంగా భ్రూణహత్యాదోషానికి ఒడిగట్టాడు. కాని కావలసినంతగా పశ్చాత్తాపం కలుగలేదు. అందువలన కర్మఫలం కఠినంగా అనుభవంలోనికి రావలసి ఉంది. వచ్చింది. ఏ రాగం ఐతే అతడిని ఒక జీవిని భూమిపైకి రాకుండా అడ్డుకునేలా చేసిందో ఆ రాగం యొక్క మరొక ఛాయ మరొక జీవి తానై అతడి కళ్ళముందే తొలగి అటువంటి రాగసంజనిత దుఃఖాన్ని ఇబ్బడిముబ్బడిగా అనుభవించేలా చేసింది. దానికి ఇది చెల్లు అని కాదు. ఈ దుఃఖానుభవంలో తాను లోగడ చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం జరగటం ఇమిడి ఉందన్న స్పృహ కలిగించి అతడికి అటువంటి వంటి తప్పులు మరలా, మరొక జన్మలో నైనా చేయకుండా నిలువరించుకొని ఉండగలిగే సంస్కార లేశాన్ని అందించింది. దారాపుత్రాదులు ఎలా సుఖకారకులో అలాగే వారి వలన దుఃఖమూ సహజమే నన్న మరొక కోణం కూడా చూపిన విధి మరి కొంత వైరాగ్యప్రాతిపదికను అందించింది. ఈ సంస్కారమూ ముందుముందు ఆ మనిషికి ఉపయుక్తమైనదే. ఈ జన్మలో కాకపోతే మరొకజన్మలో ఈ సంస్కారలేశాలు మరింత మంచిదారిలో నడిచే జీవనాన్ని అనుగ్రహిస్తాయి. కర్మఫలానుభవాలు కఠినంగా కనిపించినా అవి అన్నీ కూడా జీవులకు సరైన దిశానిర్దేశం చేస్తూ ఈశ్వరాభిముఖమైన ప్రయాణమార్గంలోనే నడుపుతూ ఉంటాయి. మనం తెలిసీతెలియక కర్మఫలానుభవం యొక్క కాఠిన్యాన్ని గమనించినప్పుడు నివారణోపాయాలు అంటూ గడబిడ చేస్తూ ఉంటాం. కాని నివారణ అన్నది లేనే లేదు. వాయిదా వేసే అవకాశం కొద్దిగా ఉండవచ్చును. కాని దాని వలన లాభం ఏమీ లేదు. అగిఆగి నడుస్తూ ఉండటంలో కొంత సుఖభ్రాంతి ఉన్నా అది ప్రయాణాన్ని మరింత పొడిగిస్తుందన్న సంగతి మరవరాదు. భగవంతుడు ప్రియతముడన్న బుధ్ధి ఉన్నవారు అందుకే కర్మఫలాలను అనుభవించేందుకు ఇష్టపడతారు కాని నివారణలను కోరుకోరు.

saketh July 9, 2015 at 10:58 PM  

panthulu garu---
edi tanakrama palithame ani-- chesina aa okkariki arthamu kavatamu ledu--
tanaku chedu jarugutundi ani telistene kada-- manishi aa vypu pokunda vundagaladu-- ela -- veellaki cheppatamu-- aapatamu---pls meelanti dyvaparulu alochinchandi---

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP