శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

వేద వాఙ్మయాన్ని అపౌరుషేయమని ఎందుకు అంటారు?

>> Wednesday, June 24, 2015



అన్నింటినీ సంస్కరించి ఒక పద్ధతిలో పెట్టింది. వ్యాసభగవానుడే గదా.
- కె.హెచ్. శివాజీ రావు హైదరాబాదు
కృతయుగ ప్రారంభం నుంచీ అనేక మంది దివ్యాంశ సంభూతులైన మహర్షులకు ఆయా యజ్ఞయాగాదులు చేద్దామనే సంకల్పం వచ్చినప్పుడు వాటికి కావలసిన మంత్రభాగాలు, బ్రాహ్మణ భాగాలు, కూడా ఆ మహర్షులకు తపస్సమాధి సమయాల్లో హృదయంలోనే సస్వరంగా వినిపిస్తూ ఉండేవి. అలా అవి వినిపించిన తరువాత వాటి అర్థమేమిటా అని వాళ్లు ఆలోచన చేసేవారు. ఆ మంత్రాలకు గల బహుముఖమైన అర్థాలు, వినియోగ విధానాలు గూడా వారికి సమాధిలోనే స్ఫురిస్తూ ఉండేవి. మామూలుగా, మనమంతా చెప్పదలుచుకున్నవిషయాన్ని గురించి ఆలోచించుకుని, ఆ తరువాత ఇతరులకు అర్థమయ్యే రీతిలో ఆ భావాలను వాక్యబద్ధం చేస్తూ ఉంటాము. అందువల్ల ఆ వాక్యాలు పౌరుషేయాలు అనబడుతాయి. అంటే మానవుని చే నిర్మితమైన వాక్యం - అని అర్థం.దీనికి భిన్నంగా వేదవాక్యాలనే ముందుగా వినిపించి, అటు తరువాత నిదానంగా వాటి అర్థ అవగతమవుతుంది. అందువల్ల అవి అపౌరుషేయాలు అనబడుతాయి. ఇక వ్యాసభగవానుడు చేసింది వాటిని ఛందోవైవిధ్యాన్ని బట్టి క్రతువులలో ఉపయోగ వైవిధ్యాన్ని బట్టి, విభాగాలు చేశాడే గాని, ఆ వాక్యాలను సొంతంగా నిర్మించలేదు. అందువల్ల వాటి అపౌరుషేయతానికి భంగం లేదు.
=================
ప్రశ్నలు పంపాల్సిన చిరునామా:
కుప్పా వేంకట కృష్ణమూర్తి

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP