శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

నూజండ్లలో స్వామి లీలకు గుర్తుగా వైభవంగా సాగిన హనుమదభిషేకములు

>> Sunday, May 10, 2015

అత్యద్భుతం స్వామి లీల . సంకల్పించిన ఇరవైనాలుగు గంటలసమయంలోనే గ్రామము మొత్తం  స్వామికి అభిషేకములు నిర్వహించిన భారీ పూజా కార్యక్రమము జరిగినది. చందాలు వసూలు చేయకుండా  వస్తురూపేణా సమీకరణ జరిపటం, ఇంటింటినుండి స్వామి సేవకు తరలివచ్చిన జనంతో స్వామి అభిషేకములతో  మెరిసిపోతూ ఉండగా భక్తులుచేసే జయఘోషలతో నూజండ్ల తరించిపోయింది.
గురువారం రాత్రి నేను కార్యక్రమం రూపురేఖలు వివరించిరాగా  శుక్రవారం ఇంటింటికీ తిరిగి హనుమద్దీక్షాధారులు అమ్దరినీ పూజల కాహ్వానించి పూజాసామాగ్రి తెచ్చేట్లుగా వివరించారు. శనివారం పీఠం లో పూజ,నైవేద్యాలు చూసుకుని నేను వెళ్ెసరికి ఎనిమిదిగంటలైంది. తెల్లవారుఝామునుండే భక్తులుపోటెత్తారు ఆలయానికి . స్వామికి స్నానం చేపిస్తున్నామనేది గ్రామీణూల భావన. తనవాల్లంతా తనకు జలకమాడిస్తున్నారని స్వామికి సంతోషం. ఇక అక్కడ చూడాలేగాని సందడి చెప్పలేం. ఓ పక్క అభిషేకములు , పంచసూక్తముల పారాయణలు.  ఇంకొక అర్చకులవారి మన్యుసూక్తపారాయణం, నేను  వెళ్ళాక అందరిచే హనుమాన్ చాలీసా పారాయణ ఘోషలతో  పరిసరాలు మార్మోగిపోతున్నాయి. ఇక పిల్లలైతే జైశ్రీరాం... జైహనుమాన్  నినాదాలతో చిందులేస్తున్నారు.
 అప్పటికే తయారై పులిహోర, వడపప్పు, పానకం,గుగ్గిళ్లు ఇత్యాది ప్రసాదాల ఘుమఘుమలు  .
 అహో !ఎంత సంతోషమో స్వామికి !

ఏం స్వాములూ ! ఎలా జరుగుతున్నది కార్యక్రమం  అని అడిగాను దీక్షాధారులను.
అద్భుతం స్వామి. ఇంతబాగా జరుగుతుందని మేమనుకోలేదు. అసలు ఇంత తక్కువసమయంలో స్వామి మాచే ఇంతపెద్ద కార్యక్రమాన్ని చేయిస్తున్నారంటే నమ్మలేకపోతున్నాం   అన్నారు వాళ్ళు.
 అదే మరి. స్వామి హనుమ అంటే.  అసాధ్యసాధక స్వామిన్ అసాధ్యం తవకింవద..  రామదూత కృపాసింధో  మత్కార్యం సాధయ ప్రభో అని వేడుకున్నప్పుడల్లా స్వామి ఇలాంటి అద్భుతాలు ఆవిష్కరించటం నేను పలుసార్లు చూసి మీకు చెప్పాను. మీరు మంచి మనసుతో కోరుకుంటే పదిమందికి మేలు జరిగే ఏకార్యక్రమాన్నైనా సాధించి పెడతారు . ముందు మీకు సంపూర్ణవిశ్వాసం ఉండాలి .అది ఉంటే ఆయన ఎప్పుడూ మీవెంటే ఉంటారు అని చెప్పాను.

సాయంత్రం అర్చకులవారు ఫోన్  చేశారు.  స్వామీ ! చాలా బాగా జరిగినది కార్యక్రమం. మీరు వెళ్ళాక మరో చిత్రం జరిగినది. ఓ భక్తురాలి ముఖతా స్వామి తనకు  ఎంతో సంతోషం కలిగినదని వెళ్లడించారు.  ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన దీక్షాధారులంతా చాలా సంతోషం గా ఉన్నారని చెప్పారు.
హనుమద్దీక్షాధారులను సరైనసాధనా మార్గంలో నడిపిస్తే  స్వామి అనుగ్రహంతో అద్భుతములు సాధిస్తారు. లోకానికి మేలు చేస్తారు.అని చెప్పాను

జైశ్రీరాం


పారాయణములో భక్తులు

ప్రసాద వితరణ
 అర్చన       హనుమద్ గుణగానం చేస్తున్న బుడ్డ గురు స్వామి  గారు

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP