నూజండ్లలో రేపు హనుమంతునికి సామూహిక అభిషేకములు.
>> Friday, May 8, 2015
శనివారం [రేపు] నూజండ్ల గ్రామంలో గల ఆంజేయస్వామి వారికి గ్రామక్షేమం కోరుతూ సామూహికంగా అభిషేక కార్యక్రమములు నిర్వహించబడుతున్నాయి. నిన్న రాత్రి టాబ్లెట్ల కోసం నూజండ్ల దాకా వెళ్ళాను . చాలా రోజులయింది కదా అని స్వామి ఆలయం దగ్గరకు వెళ్ళాను. ఆలయం దగ్గర దీక్షాస్వాములు చాలామంది ఉన్నారు . స్వామిని దర్శించుకుని కార్యక్రమాలేమి చేస్తున్నారు అని అడిగాను. హనుమజ్జయంతికి జాపాలి కి వెళుతున్నాము అన్నారు వాళ్లు. దీక్ష అంటె మీ వ్యక్తిగతక్షేమం కోరుతూ చేస్తున్న సాధన . కానీ సర్వేజనా సుఖినోభవంతు అని కోరుకునే మన మతంలో లోకం కోసం చేసే పూజ,జపతపాలకు విశేషమైన ఫలితం ఉంటుంది.చెప్పబడుతుంది. కాబట్టి మీరు ఇతరులకోసం కూడా పూజాధికాలు జరపాలి అని చెప్పాను. ఏంచేయాలి అనడిగితే గ్రామక్షేమం కోరుతూ స్వామికి సామూహిక అభిషేకం జరుపుదాం అని చెప్పాను.
ఎప్పుడు ? రేపు శనివారం చే్ధ్ధాం అన్నాను.
ఒక్కరోజు మాత్రమే సమయముంది మీరు చెప్పిన కార్యక్రమం చూస్తే భారీ ఖర్చు ఇరవై నాలుగుగంటలలో ఎలా ? అన్నారు.
మీరో విషయం మర్చిపోతున్నారు ? ఈకార్యక్రమానికి ఎవరినీ పైసాకూడా అడగకూడదు. కావలసిన సామాగ్రి అంతా వ్రాసి ఇస్తాము . ఇందులో ఎవరేమి ఇవ్వగలిగితే అవి తెచ్చిఇవ్వవచ్చు. ఐతే గ్రామంలో ప్రతి ఇంటినుండి వచ్చి అభిషేకం జరుపుకోవాలని మీరు అన్ని ఇల్లకూ తిరిగి చెప్పాలి ఇదీ షరతు అన్నాను.
స్వామీ ! ఇది జరిగేపనేనా ? ఎలాసాధ్యం అని నిరుత్సాహపడ్దారు.
అవుతుంది. స్వామి మీకార్యక్రమాన్ని ఇష్టపడ్దారు అనటానికి ఇదే మీకు గుర్తు. మీకు ఆయన పట్ల సంపూర్ణ విశ్వాసం ఉండి ప్రార్థిస్తే "అసాధ్య సాధక స్వామిన్ ............ అనే శ్లోకం అర్ధం తెలుసుకుని ఆయన మీవెనుక ఉన్నాడని నమ్మితే అద్భుతంగా జరుగుతుంది. నేను ఇక్కడ కొద్దామని అనుకోలేదు. ఎదో మందులకోసం వచ్చి అటునుండి అటువెళ్లకుండా ఇటు వచ్చి మీకు ఈవిషయం చెప్పటం నా స్వంత తెలివితేటలు కాదు. స్వామి ప్రేరణ కూడా ఉంద్నుకోవచ్చు కదా . అయాన్నను నమ్మి చూడండి రేపెలా జరుపుతాడో గమనించండి. మీవంతు మీరు చేయవలసిన పని చేయండి అని చెప్పాను.
అర్చకులు అనంతాచార్యులు కూడా మాస్టర్ గారి మాటలు విని పదహారేళ్ళ క్రితం బాంబుల దాడితో వర్గాలుగా విడిపోయి కక్షలతో ఉన్న ఇదే గ్రామంలో ఇదేఅనుమానం తో మొదలుపెట్టాము కార్యక్రమం కానీ అద్భుతంగా జరిగింది. అప్పటినుండి మరలా రక్తం చిందలేదు ఈ గ్రామం లో మీ చే స్వామి చేయిస్తారు అని ఉత్సాహ పరచారు.
రేపు ఉదయం నుండి గ్రామంలో ఇంటింటికి ఈ కార్యక్రమ వివరం చెబుతామన్నారు.
ఈరోజు ఉదయం ఫోన్ చేశాను . వీళ్లలో కొంతమంది వద్దని కొంతమంది చేయాలని తర్జనభర్జనలు పడుతున్నారండి అని ఆచారి గారు చెప్పారు.
ఏం పరవాలేదు. ఇది యుగధర్మం. అందులోనూ స్వామి వైపుకువెళ్లకుండా ఉండాలని కోరుకునే దుష్టశక్తులు చాలా ఉంటాయి. అవి వీళ్లమనసులలో కల్లోలాలు రేపుతాయి . మీరు ధైర్యం చెప్పండి అన్నాను.
మధ్యాహ్నం ఒంటిగంటకు ఫోన్ చేశారాయన. దుర్గాసార్! మావాళ్లు గ్రామంలో వీధివీధికీ ఉత్సాహంగా తిరుగుతున్నారు[పెద్దగ్రామమిది] . కొద్దిమంది తప్పుకున్నా మిగిలనవాళ్లంతా ఉత్సాహంతో తిరుగుతున్నారు. ఒకవైపు ఆటొలో మైకు లో చెబుతున్నారు. దీక్షాధారులు ఇంటింటికీ తిరుగుతున్నారు అన్నారాయన.
రేపు ఉదయం పెందరాళె రావాలి మీరు అనికోరారు.
నేను తెల్లవారేసరికి పీఠం లో అర్చనాదులు ముగించుకుని వచ్చేస్తానని చెప్పాను
ఇక రేపు చూడాలి స్వామిలీలా వైభవం .
జైశ్రీరాం...................జైహనుమాన్

0 వ్యాఖ్యలు:
Post a Comment