శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

విష్ణు సూక్తంతో సర్వపాప పరిహారం

>> Wednesday, August 7, 2013

మానవజాతికి మెుట్టమెుదటి గ్రంధం ఋగ్వేదమని ప్రాచీన భారతీయులను, ననీనపాశ్చాత్యుల గ్రహించి తమ గ్రంధములందు ముక్తకంఠంగా నిశ్చరుుంచి పలికిరి. ఋగ్వేదం ప్రాచీన వేదగ్రంధమున కొంత భాగం ఇందు కొన్ని సూక్తములు పరిపూర్ణములు కోన్ని భిలములు పరిపూర్ణమగు సూక్తములతో వివరించబడిన విషయం స్వయం సంపూర్ణంగా ఉండును. అట్టి వానిలో ముఖ్యమైనది పురుషసూక్తము , శ్రీసూక్తము సువర్ణసూక్తము,అశ్వినుల సూక్తములు, ఇంద్రుని సూక్తములు, అగ్నిసూక్తములు, విష్ణూ సూక్తము
21Feaదేనిని శ్రద్ధతో అధ్యయనం చేయువారికి సామార్ధ్యం, దర్శన జ్ఙానం, సంపద ఆరోగ్యం, మోక్ష ప్రాప్తికలుగును. పురుషసూక్తము దేవుడను పురుషునియందు దర్శనమిచ్చు చున్న పరమ పురుషుని దర్శింప చేయు పురుషోత్తమ ప్రాప్తియోగం అటూపైన వాక్యనింపబడిన శ్రీ సూక్తము నామరూప గుణత్మకమైన పకృతిలోని అంతర్యామియైన ప్రకృతిని జగన్మాతగా స్థాపించబతున్నది. రుద్రసూక్తము ఈశ్వర ప్రపంచమందలి సమస్త రూపములను స్థాపించుచున్నవి. సర్వస్వతి సూక్తము ఈ సృష్టి సమస్తమును సృష్టికర్త యోక్క ఉచ్చారణ రూపమైనా వాక్ప్రవాహముగా తెలుపబడుచున్నవి. ఇన్నిటి యందలి అంతర్యామీ ఈ విష్ణు సూక్తము స్థాపించుచున్నది.సృష్టి అంతయు సామాన్యునికి అభ్యకపు శోకులవలే లోకములుగా ఏర్పడుచున్నది. ఒక లోకమున ప్రజ్ఙలో జీవించు వారికి మరోక లోకములో సంబంధం ఉండదు. ఎవరి లోకం వారిదే అదే గ్రుడ్డి మాలోకము నిద్రించున్నవాని పొట్టపై తేలు ప్రాకుచుండగా వారిరువురికి సంబంధం లేదు.ఇట్టిదే రెండు లోకములో వేరువేరుగా జీవించుచు సహచరులపై బ్రతుకుచున్న వారి ప్రజ్ఙ కూడ ఆ ఇద్దరు తండ్రి బిడ్డ అయినను తల్లి బిడ్డ అయినను భార్య భర్త అయినను బౌతికముగా వ్యవహరం జరుగునే కాని,ఒకరికిఒకరు జీవించరు. ఆలాంటి సంసారమగ్నమైన అంధ జీవితానికి నివారోణపాయము అంతర్యామి ఒక్కటే.. దానిని అనుసరించుటమే విష్ణుపాసనముగా మొట్టమొదటి బుగ్వేదమున కనిపించును దానిని ప్రతిపాధించు తేజోమయులైన వాక్యములే విష్ణు సూక్తములు.. ఈ సూక్తములను శ్రద్ధతో చదివినను విన్నను వివరించి అర్ధం చేప్పినను అంతర్యామి ప్రజ్ఙ శ్రద్ధ అనుసరించి సిద్ధించును అట్టిదే ఈ విష్ణు సూక్తముల వివరణ...దేనిని శ్రద్ధతో అధ్యయనం చేయువారికి సామార్ధ్యం, దర్శన జ్ఙానం, సంపద ఆరోగ్యం, మోక్ష ప్రాప్తికలుగును.

Vishnu-(3)పురుషసూక్తము దేవుడను పురుషునియందు దర్శనమిచ్చు చున్న పరమ పురుషుని దర్శింప చేయు పురుషోత్తమ ప్రాప్తియోగం అటూపైన వాక్యనింపబడిన శ్రీ సూక్తము నామరూప గుణత్మకమైన పకృతిలోని అంతర్యామియైన ప్రకృతిని జగన్మాతగా స్థాపించబతున్నది. రుద్రసూక్తము ఈశ్వర ప్రపంచమందలి సమస్త రూపములను స్థాపించు చున్నవి. సర్వస్వతి సూక్తము ఈ సృష్టి సమస్తమును సృష్టికర్త యోక్క ఉచ్చారణ రూపమైనా వాక్ప్రవాహముగా తెలుపబడుచున్నవి. ఇన్నిటి యందలి అంతర్యామీ ఈ విష్ణు సూక్తము స్థాపించుచున్నది.

Lord-Vishnu1ఋగ్వేద గర్బితములైన రహస్వార్థములు సూక్ష్మములో గాని క్లిష్టములుకావని నిరూపించుచు పామరులలోని అంతర్యామికి సమర్పితముగా ఈ సూక్తముల వివరణ.
(ఋగ్వేదము: మం. 7, సూ. 999, చందస్సు, త్రిష్టుప్‌, ఋషి-మైత్రావరుణుడగు వశిష్టుడు).
శ్లో: పరోమాత్రమా తన్వావృధాన
నతే మహిత్వ మన్వశ్న్రవంతి
ఉభోతే విద్మ రజసే పృధివ్యా
విష్ణోదేవత్వం పరమస్యవిత్యేః
తాత్పర్యము: ఓ విష్ణుదేవా? నీవు శరీర పరిమాణపు కొల తల తీతుడవై వ్యాపించి వద్ధిల్లితివి. నీ మహిమను మరి మొక ఎవ్వరు అనుభవమునకు తెచ్చుకొనగలరు? నీ మూడడుగులలో మేము రెండింటినే ఎరుగుదుము అం దొకటి పృధివి, రెండవది రజస్సుల లోకము. మూడవది నీ పరమ పదమును నేవొక్కడికే తెలియును.

Vishnuవివరణ: విష్ణువు అనగా సర్వవ్యాప్తి, స్థితికారకుడు అగ్ర అంతర్యామి అతడు ఈ సృష్టిని ‘భూర్భు’వస్సు వర్లోకము’ అనబడు మూడు లోకములుగా నిర్మించి మూడు పాదములుగా ఆక్రమించెను. అవి వరుసగా ద్రవ్యమయము, శక్తిమయము, తేజోమయము, అనబడు లోకములు. అందు మొదటిది భౌతిక సృష్టి, రెండవది భౌతికమును కదిలించు శక్తుల సృష్టి. అది అణుమయ పరమాణు మయములైన శక్తులతో ఏర్పడినది. మూడవది కేవలము ప్రజ్ఞా మయము. మానవులు మొదటి రెండు లోకములను అర్థము చేసుకొనగలరు. అర్థము చేసుకొనే విధముగా మూడవ లోకములో కొంది (కొంచెము) భాగమే కనుక ఈ మూడవి నారాయణ లోకమును ఎవ్వరును అర్థము చేసుకొని చెప్పలేరు. తానే సర్వము కనుక ఆ లోకము తనకు మాత్రమే తెలియును. ఈ అంశమునే వామన మూర్తి పొట్టివాడై మూడడుగులు అడుగుట. రెండడుగులతో భూమిని, ఆకాశమును కొలుచుట. మూడవ పాదము బలి చక్రవర్తి శిరస్సుపై నుంచి అతనికి శాశ్వత లోకము ఇచ్చి భవిష్యత్‌ బ్రహ్మగా అనుగ్రహించుట అను వామన అవతార కథగా వర్ణించిరి. విష్ణుని మూడవ పాదమును పాసించుట వలన బలి అనబడు అహంకారము భక్తుడై బ్రహ్మ జ్ఞానము పొందునని అర్థము.

శ్లో: నతే విష్ణో జామమానోనజాతో
దేవ మహిమ్నః పరమంతమాప
ఉదస్తభ్నా నాకమృష్వం బృహంతం
దాధర్థ ప్రాచీం కకుభం పృధివ్యాః‚
తాత్పర్యము: ఓ విష్ణు దేవా. ఇంతవరకు జన్మించిన వారు కాని పుట్టబోవు వాడుగాని, నీ పరమపదము యొక్క వరమును తన మహిమచే పొందలేడు. అత విస్తారమై వెలుగులచే దర్శనీయమైన ‘దివ’మును అనబడు లోకమును పైకెత్తి పట్టి మిగిలిన లోకములను పరిపాలించుచున్నావు అనీ వెలుగుల లోకమును మా భూబికి తేర్పు దిక్కున వెలుగుచున్నావు.


Vishnu-(1)వివరణ: నాకము అనగా దుఃఖములేని లోకము లేక స్వర్గము. స్వర్గము అనగా సుఖవర్గము లేక మంచి ప్రవర్తనముల సత్కర్మల సోపాన క్రమము. అది విష్ణువు యొక్క అంతర్యామి ప్రజ్ఞ. సత్కర్మలచేతను జీవులలో అంతర్యామిని చూచుట చేతను జీవులు విష్ణులోకమును పొందుచున్నారు.తూర్పు దిక్కు భూమిపై ఉన్న వారందరికిని సూర్యోదయమును కలిగించును. చీకటి నుండి వెలుగులలోనికి రావచ్చును. నిద్ర నుండి మెలకువ కలిగించును. ఇంద్రియములు మనస్సు యొక్క అనుభవము నుండి అంతర్యామి అనుభవమును ప్రజ్ఞకు కలిగించును. కాబట్టి సూర్యోపాసనము, సంధ్యా వందనము చేయుదురు. సూర్యోదయము నుండి ప్రారంభమగు పగలు ‘దివ’ అనబడు లోకము జీవికి వెలుపలి పగలు లోపల ప్రజ్ఞలో ‘దివ’మను లోకము పరస్పరా ఆశ్రయములుగా ఉండును, సూర్యుని నుండి భూమికి సూటిగా దిగివచ్చు కిరణములు మనలను స్పృశించు కాలమే సూర్యోదయము. దాని వలన ఇంద్రియాధిపతి అగు ఇంద్రుని ప్రజ్ఞమనలో మేల్కొనును కనుకనే ఇంద్రుడు తూర్పు దిక్కునకు అధిపతి సృష్టి యందు అంతర్యామి ‘ప్రజ్ఞయే’ విష్ట లోకము ఇంద్రా విష్ణువులు ‘సృష్టి’ అను గుఱ్ఱమునకు రెండు కళ్ళెముల వంటి వారు. భూమిపై జీవులకు సూర్యుడే సృష్టికర్త స్థితికర్త కనుక విష్ణువు ఒక స్తంభము ఎత్తి పట్టి ఉంచినట్లుగా మనకును సూర్యునికీ మధ్య గల మార్గమున్నది.

Vishnu-(2)1ఇందలి విష్ణు సూక్తములో ఈ విధంగా సత్యములు ప్రతి ప్రాధించబడినవి.
1. విష్ణువు అనగా అన్ని లోకములకు అంతర్యామిగా ఉన్న ‘వేలుగు’
2. దేనికి మూడు పాదములున్నవి. 1) స్థూల దృష్టి, 2) సూక్ష్మ ప్రజ్ఙ అనబడు వెలుగు, 3) ఈ రెండిటి యందు ఉన్న అంతర్యామీ ఈ రెండు సామాన్య మానవుకు అంతుపట్టును. విష్ణు ఒక్కడికే అంతుపట్టును. అనగా మానవుడు మానవునిగా అర్ధం చేసుకోనుటకు అంతుపట్టదు.
3. అంతర్యామీ ప్రజ్ఙయే విష్ణువు జేవ ప్రజ్ఙయే ఇంద్రుడు ఇద్దరును వృక్షము పుష్పమువలే సృష్టి కర్మను నిర్వహంచుచు ఇంద్రావిష్ణువులు అనబడును.
4. భౌతిక మానవ దేహమున వామనుడిగా విష్ణువు పుట్టును అతడు ఇంద్రుని సంపదను యాచించుటతో ప్రారంభించి రెండు పాదములలో భూమ్యాకాశముల నడుమనున్నదానిని కోలుచును. మూడవది అయిన పరమ పదముతో త్రీవిక్రముడై అంతర్యామీతత్వం పోందును.
5. విష్ణువు తన్ను దానుము చేసి సృష్టి అంతర్యామి అగుచున్నాడు. జీవుని అహంకారము తనకున్న దానిని దానము చేసి బలి చక్రవర్తి అగుచున్నది. దానిని విష్ణువు తన మూడవ పదముతో ఆక్రమించి తన స్థితి లోనికి స్వీకరించుచున్నాడు. ఇంద్రుడు తన సామ్రాజ్యమైన జీవ ప్రజ్ఞను స్వర్గముగా పొందుచు, పోగొట్టుకొనుచు, ఇంద్రుడుగనే మిగిలిపోవుచున్నాడు.
6. ఈ సృష్టియందు సర్వము విష్ణువు అయిండగా ఇతర వస్తువులు సంబంధములు కష్టసుఖములు, ధర్మాధర్మములను ఉన్నవి ఉన్నట్లు లేనివి లేనట్లుగా చేయు శక్తి ఒక్కడికే ఉంది. అదియే శాంబరి అనబడు మాయ దానిి అధిపతి శంబసురుడు అనబడును.
7. నవ ధ్వారములతో దేహములు కోటలుగా అల్లిన శంబసురుడు 9 అను సంఖ్యచే అనబడుచున్నాడు. ఇంద్రుడు ‘1’ సంఖ్యచే తేలియబడుచున్నాడు.అతడు విష్ణు ప్రజ్ఙ అగు పుర్ణత్వం ‘0’ నుండి ఉద్భవించుచున్నాడు. అతడు యుద్ధమున శంబరుని తాకుట వలన శంబరుని కోటలు మాయమె ైఇంద్రా విష్ణువులు మిగులుచున్నారు. ఈ చిత్రము 9+1=10 అను సత్యమును దర్శనమిస్తున్నది.
8. ఇంద్రుడు విష్ణువును ధ్యానించుట మూగవిధ్య అనబడును.దేని వలన ఇంద్రుడు శంబసుర వధ సాధ్యమై జీవులు పరమ పదమును అనుభవించచున్నారు.
ఈ విధమున కావ్య వస్తు సంపదలో పరిపూర్ణమైన విష్ణు సూక్తములు ఇందులో వివరించబడినవి.
శ్లోకం: ఇరావతీ దేనుమతిహిభూతం
సూయవసిన మనుషేదశస్యా
దాదర్ధపృదవీ మభితో మయూబై:
తాత్పర్యం: ఓ విష్ణుదేవా నీవే రోదసి కుహరమును నిలిపి పృదవిని దివమును వేరువేరుగా ఉండునట్లు స్తంభించి పట్టితివి. ఈ పృదవికి అభిముఖముగా సూర్యకిరణములను ప్రసరింపచేయుచున్నావు.దాని వలన భూమిపై జలములు ఏర్పడినవి, అవి మేఘములుగా ఏర్పడినవి అవి వర్షించినవి అన్నమేర్పడినది.పచ్చిక చక్కగా పెరుగుచున్నది. దానిని తినునట్టి దేనువు లేర్పడినవి. జీవులన్నియు ప్రసరించుట ఏర్పడినది. ఈ మొత్తము సంపదను నీవు మనువుకు దానం చేసితివి.అతడు మానవులకు కూడ దానం చేసెను.

బుగ్వేదం: మండలాలు 7 సూక్తములు 99, చందస్సు త్రిష్టుప్‌ బుషి మైత్రావరుణుడగు వశిష్టుడు.
గమనిక: గతవారం తరువాయి

శ్లోకం...
ఇంద్రా విష్ణు దృంహితా శంబరస్వ
నవ పురో నవతించశృధిష్టమ్‌‚
శతం వర్చినస్సహస్యం చసాకం
హధో అప్రత్యసురస్వ వీరాన్‌..
తాత్పర్యం: ఓ ఇంద్రా విష్ణువులారా మీకుద్రోహము తలపెట్టిన శంబరుడను రాక్షసుని యొక్క 9 పురములను (పట్టణములను) అటుపైన 90 పురణములను ద్వంసము చేసితిరి. తేజోవంతులగు 100తో 1000 మందితో కలిసి మీరు రాక్షసుని వీరులను వారి రథములను గుర్రములను కూడ మాయం చేసిరి.శ్లోకం....
ఉరు యజ్ఙయ చక్రధురు లోకం
జనమంతా సూర్యముఫాసముగ్నిమ్‌
దాసస్యచిద్‌ వృషిని ప్రస్వమాయం
జఘ్నధుర్నరా పృతనాజ్యేషు.
తాత్పర్యము: ఓ ఇంద్ర విష్ణువులారా మీరు విసృతిని వేగమును కలుగ చేయుదురు.
ఈ లోకమును వేగవంతము విసృతమగును అగ్ని పుట్టింతురు వర్షము వలన ఉద్భవించినట్టి లక్షణము చేత వృషశిప్రుడు అని పిలువబడు దేవదారి అను మీ దాసునకు గల ఎట్టి మాయనైన మీరు తోలగింతురు. సేనల వినియోగముననరులై సేనా నాయకులై ముందు నడచి కార్యసాధన చేయుదురు.

శ్లోకం: ఇయం మనీఫా బృహతీహంతో
రుక్రమా తవసా వర్థయంతి
రరే వాం స్తోమం విదధేషువిప్లో
పిన్వతషో వృజనేష్వింద్ర
తాత్పార్యము: ఇంద్రా విష్ణువులారా ఈ మీస్తోత్రము ప్రజ్ఙయము చాల మహత్తర మై విసృతిని కలుగచేయును. ఉరుక్రము డైన విష్ణుని స్తోత్రము సృష్టిని వర్ధిల్లచేయు ను. పాపములను బాణములవలే ఖండిం చును. ఈ స్తోత్రములను చక్కగా స్తుతింప బడినచో సంపదను పోందగలరు.

శ్లోకం :
వషట్‌తో విష్ణవాస అకృణోమి
తన్మోజుషస్వ శిపివిష్ణు హవ్వమ్‌,
వర్ధంతు త్వా సుష్ణుతమోగిరోమే
మాయం పాత స్వస్థిభి స్వదాన:
తాత్పార్యము:
ఓ ఇంద్రా విష్ణువులారా మేము ఓ విష్ణు అని పిలువగా అపదము నందు విష్ణువు వసించుచుండును,శ్రద్ధతో ప్రత్యేక్షము చేసికోనుచు ప్రార్ధించుదము, ఆకారముచే మాయజ్ఙము నందు మీరు ప్రవేశించి మా అన్నమును యజ్ఙశేష ముగా ప్రసాధించుదురుగాక మిమ్ములను పుష్కములైన స్తోత్రములతో మేము స్తుతింతుముగాక అట్టి మా వాక్కులు మీ యేడల వర్ధిల్లునుగాక మీమ్ములను ఎల్లపుడును యోగ క్షమములతో రక్షింతురుగాక...

వివరణ: యజ్ఙము అనగా ఫలా ఫేక్ష లేక చేయునట్టి విశ్వశ్రే యమైన సత్కర్మము యజ్ఙములలో మొట్టమొదటి సృష్టి కర్మ దానికై అంతర్యామీ ప్రజ్ఙము ఇంద్రియా అధిపతి అయిన మ నస్సు యొక్క ప్రజ్ఙయు కావాలయును. ఆరెండింటిని విష్ణువు ఇంద్రుడు అనువారు ఆధిదేవతలు దేనిని ఉద్భవింపచేయుట కు లోకములను కల్పింపవలెను.వానిని కల్పించువాడిగా మొ దట సూర్యుని కల్పింపవలేను. దానిని కల్పించునదిగా ఉషస్సు ను కల్పించవలయును.ఉషస్సు అనగా సూర్యోదయానికి ముం దు కూడ ఉషస్సును పట్టును.అది సూర్య తేజస్సును నిర్మాణం చేయునట్టి అనంతమైన వేలుగు దానిని పుట్టించుటకు ముందు అగ్ని కావలేను. అగ్ని అనగా అంగముల యందు వివాహితమై మనలో జీవుడుగా వెలుగుచున్నది. మరియు అగ్రము అందు కొని రాబడునది (అన్నిటికనన ముందు పుట్టునది) అని అర్ధ ము. అది వ్యక్తము యొక్క మొదటి రూపమైన మహత్తు నుండి వ్యక్తి యగు అహాంకారము ( ఇది జీవుల అహాంకారము కాక ఒక సృష్టికి మొదటి అహాంకారము. ఇది బిందువుల వలేవ్యక్త మగు అంతర్యామీయైన విష్ణుత్వము నుండియే ఇది వ్యక్తమ గుచుండును, కనుకనే దేవతలందరిలో అగ్ని మొదటివాడు విష్ణువు చివరివాడని ఐతరేయం బోధించుచున్నది. ఈ విధము గా ఉషస్సు కోరకై అగ్ని వీరిద్దరును తెచ్చుచున్నారు. విష్ణుని వర్షా శక్తి వలన భూమిపై పుట్టిన జీవుడు వృషశిపుడు అను పేరుతో వ్యవహరింపబడుచున్నాడు.అతడు విష్ణువు నందు భా గమై జీవించుచున్నందున, విష్ణునకు దాసుడు అతనికి ఇంద్రీ య సుఖములందు సంపదలయందు చిక్కుకోనుట కలుగు చుండును. దానినే మాయ అంటారు.దానిని తోలగివచుటకు విష్ణుని అంతర్యామి ధ్యానమే తోడ్పడును మంచి చేడులను గూర్చిన అభిప్రాయములు సేనల వలే బారులు తీర్చి యుద ్ధభూమిని కల్పించుచుండును. ఈ సేనలకు నామకుడై విష్ణువే వైరాగ్య మార్గమున పరిష్కారము కలిగించి, విజయమును క ల్పించినది. ఇందలి భావముననే కురుక్షత్రమైన ఉభయ సేనల నడుమ నరునకు సారథిగా నారాయణుడు ఉన్నట్లు స్వీకరించి మహాభారత గ్రంథములో కృష్ణుని కథతో కలిసి వివరించేను.

వివరణ: పురణములతో ఇంద్రుడుశంబరసురుని చంపిన కథకిది మూలం. శంబసురుడనగా మాయ అనగా లేనిది ఉన్నట్లుగా కనిపించుట అని అర్ధం. ఈ విద్యను శాంబరి విద్య నందురు. దేని వలన సృష్టిలో సర్వము విష్ణుమయ మే అయినను మనస్సు ఇంద్రీయములు. దేహములు ఇంద్రీయార్ధములు సంపదలు చుట్టరికములు కష్టసుఖములు మొదలగునవి.నిజముగా ఉన్నట్లు నమ్మకం కలుగును. దానితో విష్ణుమయమైన సృష్టికి బాధలు కలుగును. దా నితో విష్ణుమయమైన సృష్టికి బాధలు కలుగును.కనుక ఇది ద్రోహరుపమైన నిర్మాణము. ఇది ఇంద్ర విష్ణువుల ధ్యానముచే తోలగిపోవును. కనుక వారిరు వురును శంబరుని పట్టణములను ద్వంసము చేసినట్లు చెప్పబడినది. శంబ రుని రధములు అనగా జీవుల దేహములను గుర్రములనగా, ఇంద్రయము లు, శంబరుని 9 పురము( పట్టణము) లనగా నవ ద్వారములు గల భౌతిక శరీరములు 99 అనగా సంఖ్యలో సృష్టి కర్మయందు హెచ్చింపబడుచున్న దేహములు. ఇచ్చట ఒకటి అను సంఖ్య మొదటి వాడగు ఇంద్రునకు 9 అను సంఖ్య ఈ నవ ద్వారపురములను నిర్మించిన శంబరునకును,పూర్ణమగు సం ఖ్‌య విష్ణువునకు సూచకములు 9 లో ఒకటి తాకినచో 9 మాయమై ఒకటి యు లేదా సున్నయు మిగులును.(9+1=10) అదేవిధంగా 99ని 1 కలిపిన (99+1=100) అవును. అనగా శంబరుని పురమును ఇంద్రుడు తాినచో పురముమాయమై ఇంద్రా విష్ణువులు మిగులుదురు. వీరిద్దరి 10, 100, 1000 మొదలగు సంఖ్యలు పుట్టును. ఇట్లు పుట్టుచున్న జీవులు తాత్కాలిక దేహములైన దేహముల ప్రజ్ఙనుండి విముక్తి చెంది విష్ణు లోకమున వర్ధిల్లుచున్నారన్నది భావం.
Email | Print |

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP