శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

యాగదక్షిణను నేపాల్ బాధితులసహాయంకోసం ఆర్.ఎస్.ఎస్.ద్వారానే ఎందుకు పంపాము.

>> Saturday, May 23, 2015

మొన్న జరిగిన హనుమత్ రక్షాయాగం లో భక్తులు సమర్పించిన  దక్షిణల మొత్తాన్ని నేపాల్ భూకంప బాధితులకోసం పంపుతున్నామని చెప్పాము. అలాగే ఆమొత్తాన్ని విజయవాడ కార్యాలయంలో అందజేయమని మాపిల్లవాడు మాలకొండారెడ్డి ద్వారా ఆరోజే పంపించటం జరిగినది.

ఆ రోజు యాగానికొచ్చిన ఓ వ్యక్తి అడిగారు. మాస్టారూ ! డబ్బును ఆర్ ఎస్ ఎస్ వాల్లద్వారా ఎందుకు పంపుతున్నారు. [ఈయనకు  ఆర్ ఎస్ ఎస్ గూర్చి తెలియదు] అనడిగారు.

స్వామీ ! సేవాకార్యక్రమాలను నిబద్దతతో నిర్వహించటంలో  ఆ సంస్థ ను మించినది లేదు, మనం అందిస్తున్న సహాయమేదైనా వారిద్వారా సద్వినియొగమవుతుంది.
ఎక్కడ ప్రమాదలు దుర్ఘటనలు జరిగినా  ఆర్ ఎస్ ఎస్ వాల్లు ముందుండి సాహాయ కార్యక్రమాలలో పాల్గొంటారు అని చెప్పాను.
 నేను ఎప్పుడు పేపర్లో చూడలేదండి అన్నాడాయన.
చెసే సహాయం గూర్చి ప్రచారం కోరటం ఆసంస్థ సిద్దాంతం కాదు. సేవచేయటమనేది తమధర్మం మాత్రమే అమ్దువలనే ఎక్కువగా  వారి సేవాకార్యక్రమాలు పేపర్ల ప్రచారంలో కనపడవు అని చెప్పాను.

1 వ్యాఖ్యలు:

Dahagam Vijetha August 21, 2015 at 3:00 AM  

avunu rashtrrya swayam sevak sangh sevane paramavadhiga bhavistu elanti pracharalaku tavivakunda nibadatato seva chestunadi..kani kondaru matram bibles ni pampi devudu rakshistadani chebutunayee...manava sevaye madhava seva ani mana vallu chepina danni aksharala paistu ipatikee oka shaktivantamaina samstaga rss undi

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP