శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

*వినాయకుడికి ఓ చెల్లెలు ఉందా ? -

>> Wednesday, May 27, 2015

* సంతానం లేని నాకు ఆత్మ పిండము చేసుకోవాలనుకుంటున్నాను. ఈ విధానం ఏ గ్రంథంలో వుంటుంది?
- ఆర్.యస్.రామారావు, ప్రశాంతి నిలయం
తెలుగు ప్రాంతాల్లో ఎక్కువగా ‘‘యాల్లాజీయము’’అనే గ్రంథాన్ని వాడుతున్నారు. దాంట్లో వుంటుంది. తమిళీయులు ఎక్కువగా ఉపయోగించే వైద్యనాథ దీక్షితీయంలోను, ఔత్తరాహులు మన్నించే వీరమిత్రోదయంలోగూడా ఈ విషయాలున్నాయి. గయలో వుండే పురోహితులకు ఈ విషయాలు బాగా తెలుసని వినికిడి.
*వినాయకుడికి ఓ చెల్లెలు ఉందా ? - శుభ, కాకినాడ
పురాణాలు, ఉపపురాణాలు గాక స్థల పురాణాలనే పేరుతో అనేక గ్రంథాలున్నాయి. వాటిల్లో ఇలాంటి గాథలన్నీ కనిపిస్తూ ఉంటాయి.
* అఘోరాలు గంగానదిలో దిగింబరంగా స్నానం చేయడం శాస్త్ర సమ్మతమా?
- కె. ప్రసాదరావు, కందుకూరు
దిగంబరంగా స్నానం చేయరాదనేది బ్రహ్మచారులకు, గృహస్థులకు సంబంధించిన నియమం. అవధూతలు దిగంబరసన్యాసులు, మొదలైన వారు ఈ నియమాలకు అతీతులు. మామూలు సన్యాస దీక్ష తీసుకొనే విధానంలో గూడా విరక్తుడైన బ్రాహ్మణుడు నదిలో శిఖను, యజ్ఞోపవీతాన్ని వస్త్రాలను విసర్జించి గరువును ఆశ్రయించగా, ఆయన సన్యాస దీక్షను అనుగ్రహిస్తూ లోకులకు ఇబ్బంది కలుగకుండా వుండటం కోసం కాషాయ కౌపీనం ధరించమని ఆజ్ఞ ఇస్తారు. వనచరులైన యతులకు ఇది గూడా అక్కరలేదనేది ధర్మశాస్తవ్రిధి.
*వశిష్ఠుడు మహాజ్ఞాని కదా. ఆయన పెట్టిన సీతారామ కల్యాణ మూహూర్తం ఆ దంపతుల వియోగానికి దారితీసిందేమి?
- బాలకేశవులు, గిద్దలూరు
సీతాదేవి లక్ష్మీదేవి అవతారం. ‘‘సౌ విష్ణోరసపాయినీ ’’ ఆమెకుశ్రీ మహావిష్ణువుతో వియోగం అసంభవం. వశిష్ఠుడు మహా దివ్యజ్ఞాని కనుకనే ఆ అవతార మూర్తుల కల్యాణం జగత్కల్యాణం గా మారే మూహూర్తాన్ని నిశ్చయించాడు. అది గూడా విశ్వామిత్ర, శతానందాదులతో సంప్రదించి.
* పంచముఖుడైన బ్రహ్మ శివుడి వల్ల చతుర్ముఖుడైనాడనే మాట నిజమేనా?
- రామలక్ష్మి, హైదరాబాదు
బ్రహ్మ కపాల క్షేత్ర కథఆ వర్ణన సందర్భంలో స్కాందాది మహాపురాణాలు అలాగే చెప్పాయి.
1* చేసిన పాపం చెబితే పోతుందంటారు. అంటే ఏమిటి?
- రాజేశ్వరి రాజమండ్రి
ధర్మశాస్త్రాలలో పాపాలకు ప్రాయశ్చిత్తాలను విధించేటపుడు మున్ముందుగా వృద్ధులైన పెద్దలను సమావేశపరిచి వారికి తను చేసిన తప్పుచెప్పి దాన్ని మళ్లీ చేయనని ప్రతిజ్ఞ చేసి జరిగిన దానికి ప్రాయశ్చితం చెప్పమని కోరాలి. వారు చెప్పినట్లు ఆచరించాలి. అని వుంది. ఆ ప్రక్రియకు సంగ్రహరూపమే మీరు చెప్పే సామెత.
ప్రశ్నలు పంపాల్సిన చిరునామా :
కుప్పా వేంకట కృష్ణమూర్తి
ఇంటి నెం. 11-13-279, రోడ్ నెం. 8,
అలకాపురి, హైదరాబాద్ - 500 035.
vedakavi@serveveda.org

1 వ్యాఖ్యలు:

శ్యామలీయం May 27, 2015 at 7:39 PM  

> ‘‘సౌ విష్ణోరసపాయినీ ’’
"సౌ విష్ణోరనపాయినీ " అని ఉండాలనుకుంటాను. పరిశీలించండి.

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP