శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మగవారు ఉపవాసం చేయదలచుకుంటే సంవత్సరంలో ఏ రోజు మంచిది? దానివల్ల కలిగే ఫలితమేమిటి?

>> Wednesday, April 8, 2015

* మగవారు ఉపవాసం చేయదలచుకుంటే సంవత్సరంలో ఏ రోజు మంచిది? దానివల్ల కలిగే ఫలితమేమిటి?
- కె. రామారావు, ఆదోని
ఎవరికి ఏ దేవుడిమీద భక్తివుంటే, ఆ దేవుడికి సంబంధించిన మహాపర్వంనాడు ఉపవాసం వుండటం మంచిది. ఉదాహరణకు, శివభక్తులు శివరాత్రినాడు, విష్ణ్భుక్తులు శ్రీరామనవమి, కృష్ణాష్టమి, ఏకాదశి ఇత్యాది. ఉపవాసము అనే క్రియకు అసలైన అర్థం- భగవంతుడికి సన్నిహితంగా మనస్సు నిలబెట్టటమే. ఆ పనికి నిరాహారస్థితి అనుకూలం గనుక, దానినే ఉపవాసము అని పిలుస్తున్నారు. దీనివల్ల మనస్సుకు ఏకాగ్రత పెరిగి, ఇష్టదైవానుగ్రహం అధికంగా లభించి కోరికలన్నీ ఈడేరుతాయి.
* ఉపవాసంనాడు ఎటువంటి ఆహారం భుజించాలి?
- నిర్మల
శక్తివుంటే, ఆరోగ్యం అనుకూలిస్తే, కేవలం జలపానంతో ఉపవాసం చేయటం ఉత్తమం. అది చేతకాకపోతే, పాలు, పళ్ళరసాలు వంటి ద్రవాహారం తీసుకోవచ్చు. అదీ చేతకాకపోతే, రోజూ తినే ఆహారం కాకుండా దానికి భిన్నమైన ఉపాహారం పరిమితంగా తీసుకోవచ్చు.
* మంగళవారాన్ని అశుభ దినమని
ఎందుకు భావిస్తారు?
- పి.కుమారస్వామి, నెల్లూరు
జ్యోతిష శాస్త్ర ప్రకారం- ఎందుకూ పనికిరాని అశుభ దినం లేదు. అలాగే అన్నింటికి పనికివచ్చే ఒకే ఒక వారమంటూ లేదు. మంగళవారానికి కుజుడు అధిపతి గనుక, యుద్ధాలు, ఆయుధ వ్యవహారాలు, ఇలాంటి వాటికి అది శుభప్రదం. వివాహోపనయనాదులకు అశుభం. వారాని గల అధిపతిని బట్టి ఈ భేదం వుంటుంది.
* సూర్య భగవానుని ఏ సమయంలో ప్రార్థించవలెను.
- టి.శ్రీనివాసరెడ్డి, అనంతపురం
సూర్యోదయ సమయం ఉత్త మం. సూర్యాస్తమయం మధ్య మం. పగటిలో పూర్వభాగం అధమం. మిగిలిన భాగాలు పనికిరావు.
* రామ-్భరతులు, రావణ-విభీషణులు, వాలి-సుగ్రీవులు- అనే ఈ సోదరులలో ఏ తమ్ముడు ఉత్తముడు? - కె.హెచ్.శివాజీరావు, హైద్రాబాద్
భరతుడే అనటంలో సందేహం లేదు.
* సీతాకల్యాణం తరువాత రామాయణంలో విశ్వామిత్రుడు కనపడడు. ఆయన పాత్ర అంతవరకేనా?
వాల్మీకి రామాయణంలో అంతవరకే.
ప్రశ్నలు పంపాల్సిన చిరునామా :
కుప్పా వేంకట కృష్ణమూర్తి
ఇంటి నెం. 11-13-279, రోడ్ నెం. 8, అలకాపురి, హైదరాబాద్-500 035.
vedakavi@serveveda.org

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP