శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మీ గోత్రనామాలు పంపి చాలీసాపారాయణంతో "హనుమత్ రక్షాయాగం "లో పాల్గొనండి

>> Wednesday, April 1, 2015భక్తరక్షకుడైన హనుమంతుడు కార్యసిధ్ధి ని ప్రసాదించటంలో బహుసులభుడు. భక్తి తో రామా అన్నవారికెల్లా రక్షణగా నిలబడి కాపాడుతూ ఉంటాడు. ఆయన గుణవర్ణన ,స్మరణ మనిషిలో నిబిడీకృతమై వున్న దివ్యశక్తులను జాగృతపరచి కార్యసిధ్ధిని కలిగిస్తుంటాయి. అందువలననే ఆయుగం నుండి ఈ యుగం లో కూడా భీతిని తొలగించి,జయమును కలిగించుస్వామిగా ఆయనను ఆరాధిస్తుంటుంది లోకం. బుధ్ధిబలాన్ని పెంచి కార్యసాధకశక్తిని ప్రసాదిస్తాడు కనుకనే పామరులనుండి పరమయోగులవరకు అందరూస్వామిని ఆరాధిస్తూఉంటారు.
ఎంత భక్తసులభుడు అంటే ..ఆయనను భక్తిగా కీర్తిస్తేచాలు పొంగిపోయి ప్రసన్నుడై ,తోడునీడై నిలుచుంటాడు గురువుగా రాముని దర్శనం చేపిస్తాడు స్వామి. ఏ ఆలయం లేకున్న ఊరిలోనైనా ఏదో ఒకచోట హనుమంతుని మూర్తిమాత్రం మనకు దర్శనమిస్తుంది . అల్పశక్తివంతులమైన ఈయుగపుమనుషులమైన మనకోసం భవిష్యద్రష్టలైన పరమయోగులు చేసిన ఏర్పాటిది.

స్వామి అనుగ్రహాన్ని నాజీవితంలో ప్రత్యక్షంగా చవిచూశాను ఎన్నోమారులు. ఈవిషయాన్ని ఓ పుణ్యక్షేత్రంలో కూర్చుని చర్చించేప్పుడు  హఠాత్తుగా ఓప్రేరణ కలిగించాడాయన. భగవంతుని ఉనికిగూర్చి పలుఅనుమానాలు కలిగించే  ఈ కలిపురుషునియుగంలో మన సమకాలీనులలో ,పలు సందేహములతో భగవత్కృపను కోల్పోతున్న వారికి  వారిజీవితంలో ఓ ప్రత్యక్షప్రమాణం  చూపించగల కార్యముగా సులభమైన స్వామి ఉపాసనావిధానాన్ని పదిమందికీ ఎందుకు అందజేయకూడదు ??? అని  ప్రశ్న  మనసున మ్రోగుతున్నది. అటువంటి శక్తిసామర్ధ్యాలు,గాని శాస్త్రపరిఙ్ఞానంగానీ నాకులేవు అని భయపడ్డాను. కానీ భక్తిగా ఆయనను ఆశ్రయించి ఉండటమే అర్హతగా భావించి ఈ కార్యాన్నిప్రారంభించమని పదేపదే  సందేశం మనసును తాకుతున్నది.
స్వామి  ఆదేశాన్ని శిరసావహించి ప్రారంభించబడినది   "హనుమత్ రక్షాయాగం".
కనీసం నలభైరోజులపాటు స్వామికి ఇష్టమైన స్తుతిని  చేస్తూ ,ప్రదక్షిణనియమాలను పాటిస్తూ ఇక్కడకు వచ్చిగానీ లేక వారి ప్రాంతంలో సూచనలను అనుసరిస్తూ సాధన సాగించటం ఇక్కడ అందరి గోత్రనామాలతో  యఙ్ఞం నిర్వహించి పూర్ణాహుతి జరపటం ..ఇదీ ప్రక్రియ.    పెద్దలు మహాత్ముల అనుమతి వేడుకుని మామితృలు గోపాలకృష్ణభట్టు గారి పర్యవేక్షణలో ప్రారంభంలో సాగిన గణపతిహోమంలో పూర్ణాహుతి సమయంలో అగ్నికీలలో మహాగణపతి వారి స్వరూపం సాక్షాత్కరించటం[ఈఫోటో గతంలో ఈబ్లాగులో ఉంచాను.] స్వామి అనుఙ్ఞకుగుర్తుగా  భావించి యాగం సాగించాము. మొదటి సంవత్సరం ఈ కార్యంలో పాల్గొన్న వారిలో ముఖ్యంగా యువత వారి జీవితాలలో వారు పొందిన స్వామి అనుగ్రహలీలలు  అద్భుతమైనవి. అవన్నీ గతంలో ఇక్కడ వ్రాశాను. ఇక గత ఆరు సంవత్సరాలుగా యాగంలో ప్రత్యక్క్షంగా నూ పరోక్షంగానూ   పాల్గొన్న వారి జీవితాలలో  స్వామి జరిపిన లీలలు పరమాద్భుతములు. ఆపదలనుండి గట్టెక్కినవారు,జీవితంలో నిరాశకుగురై ఏదారీ కనపడనివారు, అనారోగ్యములతోబాధపడుతున్నవారు,అపజయములతోనూ, జీవితభాగస్వాములతో విబేధాలతో ,ఇలా ఎన్నోవిధాల ఈతిబాధలతో సతమతమవుతూ ఈసాధనలో పాల్గొన్నపిదప వారి జీవితాలలో ప్రసరించిన వెలుగులగూర్చి  కొందరు ఇక్కడ ఈబ్లాగులో వివరించి ఉన్నారు గతంలో. ఇక ఇంకొక కోణంలో ఆథ్యాత్మిక మార్గంలోఆటంకాలన్నీఆశ్చర్యంగా తొలగిపోతూ అద్భుతమైన ఆనందలోకాలకు పయనిస్తున్నామని తెలుపుతున్నవారింకొందరు. ఎక్కడో మారుమూలప్రాంతంలో జరుగుతున్న ఈ యాగం లో దేశవిదేశాలలోఉన్న భక్తులు పాల్గొంటూ వైభవోపేతంగా సాగుతూభక్తులపై స్వామి అనుగ్రహవర్షం కురిపించుచున్నది ఈ యాగం.

   ఈసంవత్సరం ఏడవ ఆవృతి గా హనుమత్రక్షాయాగం  సాగుతున్నది.  ఏడురోజులపాటు వైశాఖ బహుళ సప్తమినుండి త్రయోదశి[శనిత్రయోదశి] వరకు సాగే ఈయాగం పూర్ణాహుతి శనిత్రయోదశి నాడు నిర్ణయించబడటం కూడా అసంకల్పితంగా స్వామి అనుగ్రహం జరిగినది.
ధర్మబుధ్ధిప్రవర్ధనార్ధం,దైవీగుణప్రవర్ధనార్ధం ...మరియూ ఎవరైతే ధర్మబద్దమైన లక్ష్యం సాధించవలెనని సమకల్పిస్తున్నారో,జీవితంలో జాతక,గ్రహదోషాలవలనగానీ కష్టనష్టాలతో బాధింపబడుతున్నారో, భగవత్కృపకై తపిస్తూ మార్గం కానరాక బాధపడుతున్నారో  వారందరూ తమ గోత్రనామాలను పంపి ఈ యాగం లో  పాల్గొని స్వామి అనుగ్రహంపొందాలని ఈ యాగం సంకల్పించబడినది.  మీరంతా ఈ యాగం లో పాల్గొనవలెనని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము.
తులసీదాసకృతమైన హనుమాన్ చాలీసా పారాయణ సంఖ్యలో శ్రీరామ నామం లిఖించి ఆప్రతులను మే పదవతేదీ కల్లా  పీఠమునకు అందేలా పంపగలరు. ఇక ప్రత్యేక లక్ష్యములుసాధించుటకై ప్రత్యేక నియమములు పాటించిన మేలు. ఈ యాగములో పాల్గొనుటకు స్వామి పట్లభక్తిశ్రధ్ధలే అర్హత. శ్రీరామ నామ జపమే సమర్పించవలసిన దక్షిణ. మరింకేమీ చెల్లించవలసి అవసరం లేదు.
ఇంకాఏవైనా సందేహములుంటే  సంప్రదించగలరు
durgeswara@gmail.com
9948235641

                                                          భక్తజనపాదదాసుడు
                                                                    దుర్గేశ్వర

                                                                శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం
                                                          రవ్వవరం--- గుంటూరు జిల్లా 


  జైశ్రీరాం

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP