శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

అక్షయతృతీయ నాడు చేయవలసినది బంగారం కొనడం కాదు..పుణ్యకర్మలు చేయడం

>> Monday, April 20, 2015

మానవుని శ్రేయస్సు కోరిన ఋషులు కాలంలో కొన్నిప్రత్యేక సమయాలను గుర్తించి వెల్లడించారు. ఆరోజులలో చేసేశుభకర్మలవలనవిశేషమైన ఫలితాలు ప్రాప్తిస్తాయని చెప్పారు. అమ్దులో విజయదశమి,ఉగాది,అక్షయతృతీయ ఇలాంటి కొన్ని రోజులు ప్రత్యేకమైనవి. అయితే శాస్త్రాలు చెప్పినదానిని తారుమారు  చేసి తమకనుకూలంగా ఉపయోగించుకోవటం లో మనుష్యుల వ్యాపారదృక్పథం అతితెలివితేటలను ప్రదర్శిస్తుంది. వ్యాపారులు జనానికి గాలం వెయ్యటానికి శాస్త్రవిషయాలకు వక్రభాష్యం చెప్పటానికి వెనుకాడరు.

ఈరోజు బంగారం కొంటే శుభమని ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తూ ఊదరగొడుతున్నారు.
నిజానికి ఈరోజు చేయవలసినపనులు స్వార్ధం తో కూడుకున్నవి కాక త్యాగపరమైనవిగా ఉండాలి. భగవంతుని అర్చించటం, పారాయణాదులు, ఆకలిగొన్నవారికి అన్నం పెట్టడం, మంచినీరు అందించే చలివేంద్రాలు ఏర్పాటుచేయడం పదిమందికి నీడనిచ్చే మొక్కలను నాటడం ,ఆపన్నులకు సహాయం అందించటం ద్వారా మానవునికి శ్రేయశ్శు కలుగుతుంది. అంతే తప్ప  ఇలా వ్యాపారపుఆలోచనలవలలో పడి శుభతిథులను వృధాచేసుకోరాదు.
 మీకు వీలైతే ఇప్పుడు పీఠం లో హనుమత్ రక్షాయాగం జరుగుతున్నది కనుక మీరుకూడా రేపు [మంగళవారం అక్షయతృతీయ] నుండి  మీకోసము, మరియు లోకకళ్యాణం కోసం అని సంకల్పించి హనుమాన్ చాలీసా పారాయణం ,శ్రీరామనామ లేఖనం ప్రారంభించి ఆ జప సంఖ్యను సమర్పించండి. ఇదొక ఆథ్యాత్మిక సంకల్పం కనుక భగవంతుని కృపవిశేషంగా ప్రసరిస్తుంది మీపై 
జైశ్రీరాం

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP