శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

హిందూమతంలోని చతుర్వర్ణ విభాగంలో హేతుబద్ధత ఏమైనా వుందా?

>> Sunday, April 19, 2015

హిందూమతంలోని చతుర్వర్ణ విభాగంలో హేతుబద్ధత ఏమైనా వుందా?
ఇది చాలా లోతైన ప్రశ్న. దీనికి విపులమైన సమాధానం చెప్పేందుకు ఈ వేదిక చాలదు. సంగ్రహంగా చెప్పాలంటే, యా వన్మావ సమూహాన్ని, ఏ భేదభావాలూ లేకుండా, ఒకే పరమాత్మయొక్క శరీరంగా దర్శించగల ఏకాత్మతాదృష్టి ఒక్క భారతీయ మహర్షులకు మాత్రమే సాధ్యమైంది. శరీరం ఒకటే అన్నంత మాత్రాన, అందులోని అవయవాలన్నీ ఒకే పనిచేయవు. అవి వేరయినంత మాత్రాన వాటిలో ఏ ఒక్కటీ తక్కువది కాదు. ఈ దృష్టినే వివరిస్తూ, పరమాత్మ శరీరంలో ముఖం(నోరు) వంటివారే బ్రాహ్మణులనీ, బాహువులు వంటివారే క్షత్రియులనీ, తొడల వంటి వారే వైశ్యులనీ, పాదాల వలె సమస్తచలనాలకు ఆధారమైనవారే శూద్రులనీ అందువల్ల అందరూ పరమాత్మ స్వరూపులేననీ, ఋగ్వేదం ప్రతిపాదించింది. ఆంగ్లేయులు వచ్చి ఈ సర్వాత్మ భావనాసూత్రాన్ని కలుషీకృతం చేసే వరకు మన సమాజం ప్రపంచానికి గురుస్థానంలోనే నిలిచింది. ఆ స్థితిని మళ్ళీ సంపాదించుకోవటం ఇప్పటి భారతీయులందరికీ తక్షణ కర్తవ్యమే.
వ వశిష్ఠుడి భార్య అరుంధతి ఏ కులానికి చెందినది? - లక్ష్మి, జగిత్యాల
ఇలాంటి మహర్షుల చరిత్రలు ఒక్కొక్క కల్పానికి ఒకొక్క రకంగా సాగుతూ వుంటాయి. కొన్ని కల్పాలలో కర్దమ మహర్షి పుత్రియైన అరుంధతి ఆయన భార్య. ఒకానొక కల్పంలో ఒక ఋషి బాలిక శాపవశాన పంచముడి పుత్రికగా జన్మించగా, వశిష్ఠుడు ఆమెను వివాహం చేసుకొని, వెనువెంటనే ఆమెకు యోగ దీక్షను ప్రసాదించాడు. ఆ దీక్షాప్రభావంవల్ల ఆమె కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసింది. ఆ తపస్సువల్ల ఆమెలోని కాంతి పెరిగిపోయి, ఇతర నక్షత్రాల కాంతిని కప్పివేసింది. అందువల్ల ఆమెకు ‘‘అరుంధతి’’ అనే బిరుదు లభించింది.
వ మన దేశంలో అనేక మంది హిందూ సంప్రదాయాలను పాటిస్తూనే, సమయం వచ్చినప్పుడు హిందూమతాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇదెందువల్ల?
ఇటీవల ఒక విదేశీయుడు హిందూ సమాజాన్ని గురించి విశే్లషిస్తూ, ఒక దేశంలోని అత్యధిక సంఖ్యాకులు అవలంబించే జీవన విధానాన్ని, అదే మతంవారు విమర్శించటం ఒక్క భారతదేశంలో తప్ప ప్రపంచంలో మరెక్కడా లేదన్నాడు. పరదేశ పాలకుల వారసత్వంగా సంక్రమించిన కుహనా సెక్యులరిజాన్ని మన పిల్లలకు మనం నూరుపోయటమే ఇందుకు ప్రధాన కారణం. మనం హిందువులమనీ, ఇందుకు మనం గర్వించాలనీ, మన పిల్లలకు మన ఇళ్ళల్లో మనం బోధించగలిగితే, ఈ దుస్థితి మనకు దూరమవుతుంది.
ప్రశ్నలు పంపాల్సిన చిరునామా :
కుప్పా వేంకట కృష్ణమూర్తి
ఇంటి నెం. 11-13-279, రోడ్ నెం. 8,
అలకాపురి, హైదరాబాద్-500 035.
vedakavi@serveveda.org

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP