శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

పురుడు, మైలలు పాటించనక్కర్లేదా!

>> Sunday, April 12, 2015

* ఒకే ఇంటి పేరు గలవారు కొందరు తరాలు మారిపోయాయని పురుడు- మైలలు పాటించటం లేదు. ఇది సరియేనా? - కె.యమ్.శివాజీరావు, హైద్రాబాద్ ఇంటి పేరనేది తెలుగువారికి మాత్రమే వుంది. ఒకే ఇంటి పేరుతో విభిన్న గోత్రీకులు కూడా వున్నారు. కనుక, పురుడు, మైలలను నిర్ణయించటానికి శాస్తక్రారులు ఒక విధానాన్ని ఏర్పరచారు. ఒక వంశవృక్షంలో ఏడుతరాల వెనుకగల ఒక వ్యక్తిని మూల పురుషుడుగా స్వీకరించి, ఆ వ్యక్తినుంచి వ్యాపించిన వంశశాఖలలో ఏ శాఖకు ఆ శాఖలో ఏడుతరాలు దాటితే, ఆశౌచాలు (పురుడు, మైలలు) తగ్గిపోతాయి. ఒకే వ్యక్తినుంచీ వచ్చిన వేరువేరు శాఖలలో మాత్రం మూడుతరాలు దాటితే చాలు. ఆశౌచాలు తగ్గుతాయి. ఎవరికివారు తమ వంశవృక్షాలను ఎప్పటికప్పుడు నవీకరించుకుంటూ, పెద్దల సహాయంతో ఈ తరాల లెక్కలను నిర్ణయించుకుంటూ వుండాలి.
* పాండవులు పరాక్రమ వంతులు, శ్రీకృష్ణుడికి ప్రియులు, పైగా దైవాంశ సంభూతులు. వారికి అన్ని కష్టాలేమిటి? దుర్యోధనునికి రాజ్యభోగాలేమిటి?
- కేశవరావు, అనంతపురం
దైవాంశ సంభూతుల దాకా ఎందుకు? సాక్షాత్తు దైవావతారమైన శ్రీకృష్ణపరమాత్మకే కష్టాలు తప్పలేదే! మన సమాజంలో ఒక రౌడీల నాయకుడు (డాన్) ఉన్నాడు అనుకుందాం. ఈ జన్మలో అతని భోగాలు అపూర్వాలు. మరి పైజన్మలో వాడి గతేమిటి? అందుకనే, పెద్దలు పుణ్యఫలాన్ని- పుణ్యోద్దీపక పుణ్యఫలమనీ, పాపోద్దీపక పుణ్యఫలమనీ రెండుగా విభజించారు. దురుద్దేశ పూర్వకంగా కొన్ని పుణ్యకర్మలను ఆచరించినపుడు వారికి మరుజన్మలో పాపోద్దీపక పుణ్యఫలం లభిస్తుంది. దుర్యోధనాదులంతా ఆ కోవలోనివారే. రావణాదులూ అంతే. వారికి పై జన్మలో తీవ్ర కష్టాలు తప్పవు. కేవల సదుద్దేశ్యంతోగానీ, అసలే నిష్కామంగా గానీ, పుణ్యకార్యాలు చేసినవారికి మరుజన్మలో పుణ్యోద్పీపక పుణ్యఫలం లభిస్తుంది. దానివల్ల ప్రస్తుత జన్మలో ఇతోధికంగా పాపక్షయం జరిగి పై జన్మలో మహత్తరమైన సుఖం లభిస్తుంది. పాండవులు ఈ కోవలో ఉత్తములు.
* ఏ దేవుని పూజామందిరంలో అయినాసరే ప్రతిదినం శంఖనాదం చేయవచ్చునా?
- కె.వి.ప్రసాదరావు, కందుకూరు
శంఖనాదం ఓంకారానికి, దేవతాహ్వానానికి సంకేతం. దాన్ని గుడిలోనూ, ఇంట్లోనూగూడా ఆచరించుకోవచ్చు.
===============
ప్రశ్నలు పంపాల్సిన చిరునామా :
కుప్పా వేంకట కృష్ణమూర్తి
ఇంటి నెం. 11-13-279, రోడ్ నెం. 8,
అలకాపురి, హైదరాబాద్ - 500 035.
vedakavi@serveveda.org

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP