శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

* జపం ఎక్కువగా చేసిన ప్రతిసారీ నిద్ర ముంచుకు వస్తోంది. జపానికీ, నిద్రకూ సంబంధం ఉందా?

>> Monday, March 9, 2015

* జపం ఎక్కువగా చేసిన ప్రతిసారీ నిద్ర ముంచుకు వస్తోంది. జపానికీ, నిద్రకూ సంబంధం ఉందా? (పి.వి.నరసింహవర్మ, రాజమండ్రి)
యోగశాస్త్రంలో ఈ విషయాన్ని వివరించారు. మనస్సుకు ఏకాగ్రతను సరిగా అభ్యాసం చేయకపోతే ఆ మనసు ఏకాగ్రతా ప్రయత్నాన్ని అనేక రీతులలో ప్రతిఘటించే ప్రయత్నం చేస్తుంది. నిద్ర, వంటిమీద అక్కడక్కడ దురద, లేనిపోని వాసనలు ముక్కుకు తగిలిన భ్రాంతి, ఎక్కడెక్కడి విషయాలో గుర్తుకు రావడం, చేస్తున్న మంత్రాన్ని మరిచిపోవడం వంటివన్నీ ఆ ప్రతిఘటనలోని భాగాలే. వీటిని మనోబలం చేత, అభ్యాస బలం చేత, వైరాగ్యం చేత, వివేకం చేత అధిగమించాలి.
*పగటి నిద్ర కారణంగా ఉపాసనా శక్తి క్షీణిస్తుందా?
ఉపనయనంలో వటువు ‘పగలు నిద్రించను’ అని తన గురువుకు ప్రమాణం చేసి చెబుతాడు. అందువల్ల పగటి నిద్ర యోగభంగకరమే. కానీ అనారోగ్యంవల్ల, వయోభారం వల్ల పగటినిద్ర అనివార్యమైతే ఆ నిద్రను జప మధ్యంలో కాకుండా మిగిలిన సమయంలో తగుమాత్రంగా స్వీకరించడంలో దోషం లేదు.
* మంత్రజపం విశేష సంఖ్యలో చేస్తున్నప్పుడు, మూత్ర విసర్జన సమస్య వచ్చినపుడు తప్పనిసరిగా స్నానం చేసి జపాన్ని కొనసాగించవలసిందేనా?
మూత్ర విసర్జన చేసినపుడు స్నానాన్ని ఏ శాస్తక్రారుడూ విధించలేదు. శాస్త్రంలో లేని ఆచారాలను సృష్టించుకోవడం సముచితం కాదు. జపదీక్ష ప్రధానమైనప్పుడు వయోభారాదులవల్ల మూత్ర విసర్జనాదులు మళ్లీ మళ్లీ సంభవిస్తుంటే, మనస్సును మంత్ర దేవతమీద నుంచి మళ్లనీకుండా జాగ్రత్తపడుతు పాదప్రక్షాళన ఆచమనాలను ఆచరించి వెంటనే జపంలోకి ప్రవేశించడమే శాస్త్ర సమ్మతం.
* లోహపు పూసలతో మంత్ర జపాన్ని లెక్కించవచ్చునా? ఏ లోహం ప్రశస్తం?
జప విధానానికి, ఆ దేవతను బట్టి రుద్రాక్ష, స్పటిక, పద్మాక్షం, పగడం వంటి మాలికలే ప్రశస్తం. కామ్యజపాల్లో కొన్నిచోట్ల ఐశ్వర్య కాములకు బంగారు పూసల మాలను చెప్పారు. వీటిని ప్రశస్తము అన లేదు

-- కుప్పా వేంకట కృష్ణమూర్తి

2 వ్యాఖ్యలు:

సురేష్ బాబు March 9, 2015 at 7:54 PM  

caalaa viluvaina samaacaaram andincinanduku kRtajnatalanDI.

NARA SIMHA March 10, 2015 at 7:17 PM  

యోగా సాధన లేదా జపం చేస్తున్నప్పుడు శరీరం యొక్క మెటబాలిజం తగ్గుతుంది ...అలానే గుండె లేదా పల్స్ రేటు ను నిదానిమ్చావచ్చు ...అభ్యాస పూర్వకంగా పల్స్ రేటు ను అదుపులో ఉంచవచ్చు ...మన ఆలోచనల కు సహజంగా పల్స్ రేటు కు సంబధం ఉంది ....కనుక జపాల ను కొనసాగించాలి ....మన మంచికే

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP