అన్నపూర్ణ భిక్షాశాల నిర్మాణం జమాఖర్చుల వివరములు
>> Monday, October 27, 2014
భగవద్బంధువులందరకూ నమస్సులు
శ్రీహనుమంతులవారి ఆదేశంగా భావించి మొదలుపెట్టిన "అన్నపూర్ణభిక్షాశాల" అమ్మ అనుగ్రహంతో శీఘ్రంగారూపుదాల్చి విజయదశమినాడు ప్రారంభించబడినది. మాతో ఏసంబంధమూ లేకున్నా కేవలం భగవత్సంబంధిత ప్రేమభావమే బంధమై తమంతతాము తరలివచ్చి ఈ కార్యం లో తమచేతులు కలిపి ఈ నిర్మాణభారాన్నంతా పంచుకున్న ఆత్మబంధువులందరకూ పాదాభివందనములు చేసుకుంటున్నాను.
దసరా నవరాత్రుల పూజలతో ను తరువాత వెంటనే శ్రీవారి సేవకు వెళ్ళిరావటం వలన దసరానుంది నాకు జ్వరం రావటం వలన జమాఖర్చుల లెక్కలివ్వటం లో జాప్యం జరిగినది.క్షంతవ్యుడను.
ఇప్పటివరకు జమాఖర్చులన్నీ ఈ క్రింది లింక్ లో చూడగలరు.
https://docs.google.com/spreadsheets/d/1kLyxI3c3sgR2rqzEziUuoMfixqeWiGzWmA1f3nr4Wxc/edit?usp=sharing_eid
ఇందులో ఎవరి పేరైనా మేము అజాగ్రత్తవలన మరచి ఉంటే పెద్దమనస్సుతో క్షమించి మెయిల్ ద్వారా లేదా ఫోన్ లోగాని తెలియపరస్తే జతపరచగలము.
ఇప్పటివరకు
ధనరూపంలో అందిన సహాయం 633004
వస్తురూపేణా 228200
-----------------------------------------------
total 861204
-------------------------------------------------
-
ఇప్పటివరకు మొత్తం ఖర్చు[వస్తురూపేణా అందినవాటితో కలిపి] 851700
ఈ నిర్మాణంలో కిటికీలకు తలుపులు బిగించటం, భక్తులు వారి లగేజీ లు జాగ్రత్తపరుచుకోవటానికి నిర్మిస్తున్న లాకర్లకు ఐరన్ డోర్లు తయారుచేపించవలసి ఉంది
మరొకసారి మీ అందరికీ నమస్కారములు తెలుపుకుంటున్నాను
జైశ్రీరాం
0 వ్యాఖ్యలు:
Post a Comment